అదిరే వార్త​.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ

jio offer

టెలికాం దిగ్గజం reliance Jio తన వినియోగదారులకు అదిరిపోయే వార్తను అందించింది. 2021 జనవరి 1 నుంచి Jio to non-Jio calls ఫ్రీ అని ప్రకటించింది. IUC(ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జెస్) ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అందుకే domestic voice callsను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొంది. # అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ #

ట్రాయ్ మార్గదర్శకాల మేరకు ఇప్పటివరకు దేశీయ non-jio కాల్స్కు ఛార్జీలు వసూలు చేసింది Jio. ఐయూసీని ట్రాయ్ తొలగించిన వెంటనే తాము ఛార్జీలు వసూలు చేయడం మానేస్తామని గతంలోనే హామీనిచ్చింది ఈ సంస్థ.

“మంచి నాణ్యమైన సర్వీసులతో, ఎవరైనా, ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అయ్యే విధంగా “డిజిటల్ సొసైటీ”ని నిర్మించేందుకు పునాదులు వేయాలన్న లక్ష్యానికి Jio కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా తక్కువ ధరలతో, అత్యాధునిక డిజిటిల్ ప్లాట్ఫాంలకు యాక్సెస్ పొందే వెసులుబాటు కల్పించాలన్నది మా సంకల్పం. ఇప్పటివరకు Jio అదే చేసింది. ఇక మీదట కూడా వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుంది,” అని Jio ఓ ప్రకటనను విడుదల చేసింది.

మరోవైపు reliance jio 4G స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనివైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది. రూ. 5వేల లోపు ఈ స్మార్ట్ఫోన్ను విక్రయించేందుకు Jio యోచిస్తున్నట్టు సమాచారం. # అదిరే వార్త.. Jioలో ఇక నుంచి ఆ voice call ఫ్రీ #

                                – VISWA (WRITER)

Click here: వార్షిక నివేదిక అంటే ఏమిటి?

Click here: త్వరలో OnePlus Band fitness tracker లాంచ్!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?