హాయ్ ఫ్రెండ్స్ welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం ‘ఇండస్ట్రీస్’ మరియు ‘సెక్టార్స్’ గురించి తెలుసుకుందాం. # Industries and Sectors? #
గ్రేట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్… మనకు తెలిసిన బిజినెస్‌లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని, తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోకూడదని చెబుతుంటారు. అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కచ్చితంగా మార్కెట్ బేసిక్స్ తెలుసుకోవాలి.
స్టాక్ మార్కెట్ బేసిక్స్‌లో భాగంగా ఇండస్ట్రీస్ గురించి, సెక్టార్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు స్వయంగా స్టాక్ మార్కెట్ రీసెర్చ్ చేసుకోగలుగుతారు. బిజినెస్ అనాలసిస్ కూడా చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఇండస్ట్రీ అంటే ఏమిటి?
ఒకే రకమైన ఉత్పత్తులను (Products) లేదా సేవలను (Services) అందించే కంపెనీలన్నింటినీ కలిపి ‘ఇండస్ట్రీ’ అంటారు.
ఉదాహరణకు TVS Motor company, Bajaj Auto, Hero Motocorp కంపెనీలను తీసుకుందాం. ఈ మూడు కంపెనీలు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తుంటాయి. కనుక ఈ మూడింటిని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందిన కంపెనీలుగా పేర్కొంటారు.
సెక్టార్ (sector) అంటే ఏమిటి?
Related industries అన్నింటినీ కలిపి సెక్టార్ అని అంటారు.
ఉదాహరణకు TVS Motor company, Bajaj Auto, Hero Motocorp అనేవి టూ-వీలర్ మరియు త్రీ-వీలర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందినవి. అలాగే Maruti Suzuki అనేది ప్యాసింజర్ కార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌కి, Ashok Leyland అనేది ట్రక్ మరియు LCV ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందినవి.
ఈ కంపెనీలు అన్నీ వేర్వేరు ఉప-ఉత్పత్తులను sub-productsను కూడా తయారుచేస్తుంటాయి. అలాగే మరికొన్ని కంపెనీలు వాహనాలకు కావాల్సిన టైర్స్, బ్యాటరీలు తయారుచేస్తుంటాయి.
మొత్తానికి ఈ కంపెనీలు అన్నీ ఆటోమొబైల్ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. కనుక వీటన్నింటికి కలిపి ఆటోమొబైల్ సెక్టార్‌కి చెందిన ఇండస్ట్రీస్ అంటారు.
Click here: డొల్ల కంపెనీలు అంటే ఏమిటి?
Click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటే ఏమిటి?