కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచమంతా ఆన్లైన్ బాటపట్టింది. దాదాపు అన్ని సమావేశాలు ఆన్లైన్కే షిఫ్ట్ అయిపోయాయి. దీంతో Google Meetకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది గూగుల్. తాజాగా Google Meetలో మరో కూల్ ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. # Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే #
మీట్లో ఉన్నప్పుడు వినియోగదారులు తమ backgroundను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఫీచర్ను కేవలం desktop యూజర్స్కే అందిస్తోంది Google. దీనితో backgroundలో ఆఫీస్, ప్రకృతి అందాలు, పెయింటింగ్స్, సొంత ఇమేజ్లు పెట్టుకోవచ్చు.
దశలవారీగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది Google. ప్రస్తుతానికి ChromeOS, Chrome బ్రౌజర్లు, Macలో వినియోగదారులు దీనిని వాడుకోవచ్చు. ఇది పొందడానికి వినియోగదారులు ఎలాంటి అడిషనల్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు.
ఫోన్లో Google Meet ఉపయోగించే వారికి కూడా త్వరలో ఈ కూల్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
అయితే Google Meetకు పోటీదారులైన Zoom, Skypeలో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Click here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?
Click here: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’