FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్!

facebook msg vanish

disappearing messages featureని వాట్సాప్ ప్రకటించిన కొన్ని రోజులకే, ఫేస్బుక్ కూడా అలాంటి ఫీచర్ ఒకటి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ‘Vanish Mode’ను అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో విడుదల చేసింది. # FBలోనూ మెసేజ్‌లు ‘VANISH’ అయిపోతాయ్! #

ఈ Vanish Mode, వాట్సాప్ ఫీచర్లాగే ఉంటుంది. Vanish Modeను ఆన్ చేసి మెసెంజర్లో ఎవరికైనా మెసేజ్ చేస్తే.. ఆ మెసేజ్ని చూసిన తర్వాత, లేదా చాట్ క్లోజ్ చేసిన తర్వాత, ఆ మెసేజ్ కనపడకుండా పోతుంది. ఒకవేళ తమకు అందిన మెసేజ్లు కావాలనుకుంటే screenshot తీసుకోవచ్చు. అయితే అలా screenshot తీసుకుంటే ఆ విషయం మెసేజ్ పంపిన వ్యక్తికి తెలిసిపోతుంది. # ఫేస్బుక్లోనూ మెసేజ్లు ‘VANISH’ అయిపోతాయ్!#

మొబైల్ ఫోన్లో ఈ ఫీచర్ను పొందాలంటే మెసెంజర్లోని చాట్ను swipe up చేయాలి. రెండోసారి swipe up చేస్తే vanish mode off అయిపోతుంది.

ఈ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు సామాజిక మాధ్యమ దిగ్గజం పేర్కొంది. అందుకే వినియోగదారుల ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వారు మాత్రమే ఈ ఫీచర్ను పొందగలరు.  # ఫేస్బుక్లోనూ మెసేజ్లు ‘VANISH’ అయిపోతాయ్!#

మిగిలిన దేశాల్లో ఈ ఫీచర్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్టు ఎఫ్బీ వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్కు కూడా ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

                                     – VISWA (WRITER)

Click here: ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?

Click here: What is Muhurat trading?

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?