రివెంజ్‌ ట్రేడింగ్‌ చేయొద్దు!!!

revenge trading

స్టాక్‌ మార్కెట్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల దూకుడు కొనసాగుతోంది. అయితే ఎక్కువగా మంది ఇన్వెస్టర్లు కనీస అవగాహన లేకుండానే, స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ, భారీగా నష్టపోతున్నారు. # రివెంజ్‌ ట్రేడింగ్‌ చేయొద్దు!!! #

సహనమే విజయానికి వారధి:

మన శక్తి సామర్థ్యాల కన్నా, మన సహనమే మనల్ని లాభాలబాట పట్టిస్తుంది. ఎవరైతే తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేరో, వారు ఎప్పటికీ గెలవడం అంటూ జరగదు. తాత్కాలికంగా లాభాలు కళ్లజూసినా, చివరికి నష్టపోవడం ఖాయం.

స్పష్టమైన లక్ష్యం ఉండాలి:

మీరు లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినా, లేక ట్రేడింగ్‌ చేసినా మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉండి తీరాలి. స్వల్పకాలంలోనే ఆయాచితంగా కోటీశ్వరులు అయిపోవాలానే అత్యాశను వీడాలి.

ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోండి:

కొత్తగా ట్రేడింగ్‌ చేస్తున్నవాళ్లలో ఎక్కువ మంది తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. దీనితో స్వల్ప నష్టాలను కూడా తట్టుకోలేక, రివెంజ్‌ ట్రేడింగ్‌కు దిగుతున్నారు. కొందరు ఓవర్‌ ట్రేడింగ్ చేస్తున్నారు. పోగొట్టుకున్న చోటే, తిరిగి సాధించాలనే, ఒక తప్పుడు ఆలోచనతో మరింతగా నష్టపోతున్నారు.

(FOMO) ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌:

చాలా మందికి FMO ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో దూసుకుపోతుండడం చూసి, తమకున్న అవకాశాలు ఎక్కడ తప్పిపోతాయేమో అనే భయంతో, చాలా మంది ఓవర్‌ ట్రేడింగ్ చేస్తున్నారు. నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం రివెంజ్‌ ట్రేడింగ్ చేస్తున్నారు. ఫలితంగా తమ కష్టార్జితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. # రివెంజ్‌ ట్రేడింగ్‌ చేయొద్దు!!! #

సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోండి:

స్టాక్‌ మార్కెట్‌లో వెల్త్ జనరేట్‌ చేద్దామనుకునేవారు, ముందుగా స్టాక్‌ మార్కెట్‌ను స్టడీ చేయండి. Investment Psychologyని పూర్తిగా అర్థం చేసుకోండి. సరైన సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సలహాను తీసుకోండి. ఆ తరువాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్‌ అయినా, ట్రేడింగ్ అయినా చేయండి.

ఇదీ చదవండి: ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021

ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల కోసం స్టాక్ మార్కెట్‌ గైడ్‌

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?