హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm.
ఈ ఆర్టికల్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్… వాటిలోని రకాలు గురించి తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్‌ను… ప్రధాన్యత ఆధారంగా ఈక్విటీ (equity) మరియు డెట్ (debt) మ్యూచువల్ ఫండ్స్‌గా వర్గీకరించవచ్చు. కాలపరిమితి ఆధారంగా అయితే ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌గా వర్గీకరించవచ్చు.
open ended funds:
ఈ పథకాల్లో అవసరానికి అనుగుణంగా కొత్త యూనిట్లు జారీ చేస్తారు. ఈ కొత్త యూనిట్ల జారీకి పరిమితులు అంటూ ఏమీ ఉండవు. అందువల్ల ఈ పథకాల ద్వారా ఎప్పుడైనా అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు. ఇన్వెస్టర్లు నికర ఆదాయ విలువ (NAV) ఆధారంగా ఎన్ని యూనిట్లు అయినా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ముఖ్య లక్షణాలు:
క్రమబద్ధమైన పెట్టుబడి: ఈ పథకాల్లో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) అమలు చేసుకునే సౌలభ్యం ఉన్నందున మదుపరులకు పెట్టుబడి క్రమశిక్షణ అలవడుతుంది.
లిక్విడిటీ: ఇన్వెస్టర్లు తమకు అవసరమైనప్పుడు యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి వీలవుతుంది.
అతిపెద్ద భాగస్వామ్యం: లాభాల్లో నడిచే పథకంలో పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు పాల్గొని, మంచి లాభాలు పొందే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.
నిష్క్రమణ: ఈ ఓపెన్ ఎండెడ్ పథకాల నుంచి ఏ సమయంలోనైనా నిష్క్రమించే అవకాశం ఉంది. కనుక క్లోజ్ ఎండెడ్ పథకాలతో పోల్చితే ఇన్వెస్టర్లకు నిష్క్రణ భారం తక్కువగా ఉంటుంది.
అమ్మకాల భారం: ఏ సమయంలోనైనా యూనిట్లు అమ్ముకునే సౌలభ్యం ఉండడం ఈ పథకాలకు ఉన్న ప్రధాన ప్రతికూల అంశం. ఎందుకంటే ఫండ్ నిర్వాహకులకు యూనిట్ల అమ్మకాలను పర్యవేక్షించడం చాలా భారంగా తయారువుతుంది. దీని కోసం కొంత డబ్బును వారు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదా ద్రవ్యరూప విధానాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటి ప్రభావం మొత్తం పథకం పనితీరుపై ప్రభావం చూపుతుంది.
close ended funds:
నిర్ణీత మెచ్యూరిటీ తెదీ, గడువులతో ఈ క్లోజ్ ఎండెడ్ పథకాలు ఉంటాయి. ఫండ్ అందుబాటులో ఉంచిన సమయంలోనే… కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త యూనిట్లను ఎప్పుడుబడితే అప్పుడు అమ్మకానికి ఉంచరు. అలాగే ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న యూనిట్లను గడువుకు ముందు అమ్మేందుకు కూడా వీలు ఉండదు.
క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ముఖ్య లక్షణాలు:
దీర్ఘకాల పెట్టుబడి:
ఈ పథకాలకు నిర్ణీత గడువు ఉండడం వల్ల ఫండ్ నిర్వాహకుడు.. సమీకరించిన ధనాన్ని దీర్ఘకాల పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ లాభాలను పొందేందుకు వీలుంటుంది. ఈ విధానాన్ని సాధారణంగా మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌తో వచ్చే ఈక్విటీ ఆధారత పొదుపు పథకాల్లో అమలుచేస్తారు. డెట్‌లో అయితే ఫిక్సెడ్ మెచ్యూరిటీ పథకాల ద్వారా అమలుపరుస్తారు.
అమ్మకాల భారం:
నిర్ణీత గడువు ఉండడంతో ఫండ్ నిర్వాహకుడిపై అమ్మకాల భారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సమీకరించిన ధనాన్ని స్తబ్దుగా ఉంచకుండా ఏదైనా పెట్టుబడి మార్గాల్లోనికి మళ్లించేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఫలితంగా అధిక రాబడి వస్తుంది.
మధ్యంతర నిష్క్రమణకు మార్గాలు:
పెట్టుబడులను సులభంగా నగదు రూపంలోకి మార్చుకునేకుందుకు… క్లోజ్ ఎండెడ్ పథకాల్లోనూ మధ్యంతర నిష్క్రమణ మార్గాలు ఉన్నాయి. సాధారణంగా స్టాక్ ఎక్స్ఛేంజిల్లో క్లోజ్ ఎండెడ్ యూనిట్లను అందుబాటులో ఉంచుతారు. కనుక ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న యూనిట్లను అమ్మివేసి సొమ్ము చేసుకోవచ్చు.
అలాగే ఒక్కోసారి కొన్ని ఫండ్ సంస్థలు కూడా నికర ఆదాయ విలువ (NAV) ఆధారంగా యూనిట్లను కొనుగోలు చేస్తుంటాయి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మదుపరులు తమ వద్ద ఉన్న యూనిట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు.
గమనిక: SEBI మార్గనిర్దేశాల ప్రకారం, పైన పేర్కొన్న రెండు మార్గాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా మదుపరులకు అందుబాటులో ఉంచాలి.
భారీ నిష్క్రమణ ఛార్జీలు:
అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు… మెచ్యూరిటీ తేదీ కన్నా ముందే ఫండ్లను తిరిగి తీసుకునేందుకు అవకాశం కల్పించినా… ఇన్వెస్టర్లు భారీ నిష్క్రమణ ఛార్జీలను చెల్లించకతప్పదు.
ట్రాక్ రికార్డ్:
క్లోజ్ ఎండెజ్ ఫండ్స్ యొక్క పూర్వాపరాలను, వాటి గత పనితీరును పరిశీలించేందుకు మనకు ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే, అంతకు ముందు వాటి ఉనికే ఉండదు కనుక. ఇన్వెస్టర్లు… ఆ ఫండ్ మేనేజర్ పనితీరు ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఎలాంటి పథకం ఎంచుకోవాలనేది ఇన్వెస్టర్ అవసరం, విచక్షణను అనుసరించి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నిర్ణీత గడువు వరకూ ఉంచుకోవాలంటే… క్లోజ్ ఎండెడ్ పథకం మంచిది.
అలా కాకుండా మన పెట్టుబడులను స్పల్పకాలంలో…. అవసరాలకు అనుగుణంగా, సులభంగా నగదుగా మార్చుకోవాలంటే కనుక ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఎంచుకోవడం మంచిది.
ఇంటర్వెల్ పథకాలు:
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ రెండింటి మిశ్రమ లక్షణాలతో రూపొందించినవే ఇంటర్వెల్ పథకాలు. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ ఈ ఇంటర్వెల్ పథకాలకు చక్కని ఉదాహరణ.
ఈ ఇంటర్వెల్ ఫండ్స్‌కు చెందిన యూనిట్ల ట్రేడింగ్‌ను… నిర్దేశ సమయంలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జరుపుతారు. ట్రేడింగ్ ధరలు NAV ధరల ఆధారంగా నిర్దేశితమవుతాయి.
Click here: వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు
Click here: The key players in the stock market