ప్రాచీన తమిళ రాజ్యాలు – చోళ, చేర, పాండ్యుల పాలన- వికసించిన సంగం సాహిత్యం

దక్షిణ భారతదేశంలోని మూడు తమిళ రాజ్యాలు

ప్రాచీన దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య అనే మూడు రాజ్యాలు వెలిశాయి. వీరు తమిళ భాష మరియు సాహిత్యమును ఆదరించి అభివృద్ధి చేసినందువల్ల ఈ మూడు రాజ్యాలను  తమిళ రాజ్యాలు అంటారు. ఈ మూడు రాజ్యాల సమాచారము క్లుప్తంగా క్రింది పట్టికలో తమిళ ఇవ్వడమైనది.

రాజ్యం పేరు పాలించిన ప్రాంతం రాజధాని రాజకీయ చిహ్నం గొప్పరాజు
చోళ

 

ఉత్తర తమిళనాడు

 

ఉరయ్యూరు తరువాత కావేరీ పట్టణం పులి కరికాలచోళ
పాండ్య దక్షిణ తమిళనాడు మధురై చేప నెడుంజెళియన్‌
చేర కేరళ వంజి / కరూర్‌ విల్లు, బాణము సెంగుత్తవాన్‌
తమిళ సాహిత్యము / సంగం సాహిత్యము

ఈ మూడు రాజ్యాల ఆదరణలో తమిళ సాహిత్యము ఆరంభమయ్యింది. ఈ కాలం నాటి తమిళ సాహిత్యాన్ని సంగం సాహిత్యము అని పిలుస్తారు. పాండ్యుల రాజధాని నగరమైన మధురైలో నిర్వహించబడిన  మూడు తమిళ కవుల సమ్మేళనాలను ‘సంగం’లు అంటారు. చోళ, చేర, పాండ్య రాజ్యాల నుండి అనేక మంది తమిళ కవులు ఈ సమావేశాలకు హాజరై అద్భుత తమిళ సాహిత్యాన్ని అందించారు. ఏడవ శతాబ్దంలో తిరునవక్కరసు లేదా అప్పార్ అనే జైన మతాచార్యుడు తొలిసారిగా సంగం అనే పదాన్ని ఉపయోగించాడు.

I. తలైసంగం:

ఇది తొలి సంగం. అగస్త్య మహాముని దీనికి అధ్యక్షత వహించారని చెప్పబడింది. ఆర్య సంస్కృతిని దక్షిణానికి పరిచయము చేసిన వ్యక్తిగా అగస్త్య మహామునికి గుర్తింపు ఉంది. తొలి సంగంలో వ్రాయబడిన గ్రంథాలు లభ్యము కావడము లేదు.

II. ఇడైసంగం:

ఇది రెండవ సంగం. అగస్త్య మహాముని యొక్క 12 మంది శిష్యులు దీన్ని నిర్వహించారు. తమిళ భాషలో లభ్యమవుతున్న తొలి గ్రంథాలు ఈ సంగంలోనే వ్రాయబడ్డాయి. ఈ సమావేశంలో తొల్కాప్పియార్‌ రచించిన తొల్కాప్పియం తమిళ సాహిత్యంలోని తొలి గ్రంథం. ఇది వ్యాకరణ గ్రంథం. ఈ సమావేశంలోనే అగత్తియార్ అనే కవి అగత్తీయము అనే ఇంకొక వ్యాకరణ గ్రంథం వ్రాశాడు.

III. కడై సంగం:

ఇది మూడవ మరియు చివరి సంగం. నక్కిరార్ అనే తమిళ కవి దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సంగంలో అనేక గొప్ప తమిళ గ్రంథాలు వ్రాయబడ్డాయి. కడై సంగంలో రచించబడిన సాహిత్యాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.

  1. పదినిన్‌మేల్‌ కనక్కు (18 Major Works): అందులో ఈ క్రింది గ్రంథాలు ముఖ్యమైనవి.
  • అగనన్నూరు – (అగము అంటే ప్రేమ / శృంగారము; నన్నూరు అంటే 400). ఇందులో 400 ప్రేమ/ శృంగార కవితలుంటాయి. దీనిని రుద్రశర్మన్‌ రచించాడు.
  • పురనన్నూరు – (పురము అంటే రాజనీతి / యుద్ధాలు; నన్నూరు అంటే 400). ఇందులో యుద్ధాలు మరియు రాజనీతికి సంబంధించి 400 కవితలుంటాయి. మాములనార్ దీని రచయిత.
  • తిరుమురుగరుప్పదై – తమిళుల ఆరాధ్య దైవము ‘మురుగ’ (సుబ్రమణ్య / కార్తికేయ / కుమారస్వామి) పైన వ్రాయబడింది. ఈ గ్రంథాన్ని నక్కిరార్ అనే కవి రచించాడు.
  • మధురైకంజి – పాండ్యుల రాజధానియైన మధురై నగరం గురించి మాగుడిమరుదన్‌ అనే తమిళ కవి రచించాడు.
  • పట్టినిపలై – ఇది చోళుల రాజధాని కావేరి పట్టణముపైన వ్రాయబడింది. కన్నన్ దీని రచయిత.
  1. పదినిన్‌కిల్‌ కనక్కు (18 Minor Works):

అందులో తిరువళ్ళువార్ రచించిన తిరుక్కురల్ అత్యంత ముఖ్యమైనది. ఇందులో నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు మరియు పాలనాపరమైన సమాచారం ఉంటుంది. దీనిని తమిళ సాహిత్యపు బైబిల్ అంటారు.

  1. ఇతిహాసాలు: సంగం సాహిత్యంలో మూడు ఇతిహాసాలున్నాయి.
  • శిలప్పాదికారం: ఇల్లాంగొ అడిగల్ దీని రచయిత. ఇది కోవలన్ మరియు కన్నగి అనే దంపతుల గాథ. తమిళ ప్రజలు నేటికీ కన్నగిని పాతివ్రత్యదేవతగా ఆరాధిస్తున్నారు.
  • మణిమేగలై: సత్తలై సత్తనార్ అనే బౌద్ధుడు దీని రచయిత. అనేక కళల్లో ఆరితేరిన అద్భుత సౌందర్యవతి మణిమేగలై ఇందులో కథానాయకి. ఈమె చివరకు బౌద్ధభిక్షుణిగా మారిపోతుంది.
  • శివగసింధమని: తిరుత్తక్కదేవర్ అనే జైన కవి దీనిని రచించాడు. అనేక రాజ్యాలు జయించి చివరకు జైన సన్యాసిగా మారిన శివగ / జీవక అనే రాజు గాథ ఇందులోని కథాంశం.

Leave a Comment

error: Content is protected !!