నూతన సంవత్సంలో అప్పుడే 10రోజులు అయిపోయాయి. జనవరి నెల మరో వారంలోకి అడుగుపెట్టింది. మరి ఈ వారంలో ఉన్న Tech సంగతలు, విశేషాలు చూసేద్దామా… # వావ్.. ఈ వారంలో ఇన్ని Tech విశేషాలా! #
CES 2021:-
ప్రతి ఏడాది అట్టహాసంగా జరిగే CES వేడుకా.. కరోనా వల్ల వర్చువల్ రూపానికి మారిపోయింది. అయితే ఏంటి? ఎప్పుడూలాగే ఈసారి కూడా Tech ప్రియుల మనసు దోచుకునేందుకు లోటు లేకుండా ఈ వేడుక సోమవారం జరగనుంది. అందరూ దీనిని లైవ్ స్ట్రీమ్లో చూడవచ్చు. టీవీలు, కంప్యూటర్లు, కొత్త స్మార్ట్ఫోన్స్ వంటి డివైజ్ల ఆవిష్కరణ ఇక్కడ జరుగుతుంది.
Samsung:-
Samsung తన కొత్త Exynos చిప్సెట్ను ఆవిష్కరించనుంది. స్మార్ట్ఫోన్ performanceలో ఈ ప్రాసెసర్ అద్భుతాలు చేస్తుందని దిగ్గజ సంస్థ ఆశిస్తోంది. దీనిని Exynos 2100గా పిలిచే అవకాశముంది. ఈ నెల 14న Galaxy S21 సిరీస్ను ఆవిష్కరించనుంది Samsung. ఇందులో Exynos ఉంటుంది.
Galaxy S21 సిరీస్లోని S21 Plus, S21 Ultraను Samsung అదే రోజు ఆవిష్కరిస్తుంది.
OnePlus:-
OnePlus Band తో తొలిసారిగా wearable marketలోకి అడుగుపెడుతోంది OnePlus. ఇండియాలో దీనిని సోమవారం ఆవిష్కరించనుంది.
iQOO:-
Qualcomm processorతో ఫోన్లను తొలుత విడుదల చేయడం Samsungకి అలవాటు. అయితే ఇప్పుడు ప్రపంచం Snapdragon 888లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే Mi 11 బంపర్ హిట్ అయ్యింది. తాజాగా Snapdragon 888తో vivoకు చెందిన iQOO 7 వినియోగదారుల ముందుకు వస్తోంది. సోమవారం దీనిని ఆవిష్కరించనున్నారు.
– VISWA (WRITER)
Click here: Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro?
Click here: WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’?