ఇన్వెస్ట్ చేసే ముందు ఇవి చూడండి!
మీరు ఏదైనా కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందుగా ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఎనాలసిస్, వాల్యుయేషన్ గురించి తెలుసుకోవాలి. పెట్టుబడులు పెట్టడానికి కేవలం సోకాల్డ్ నెంబర్స్ మాత్రమే సరిపోవు. కంపెనీని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు investigate చేయాల్సి ఉంటుంది. దీనినే due diligence exercise అంటారు. # Check These Before Investing! #
ఉదాహరణకు బ్యాంక్స్‌ను తీసుకుందాం. అవి ఏదైనా కంపెనీలో వాటా కొనాలనుకున్నా లేక మొత్తం కంపెనీనే కొనాలనుకున్నా, పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్ ఎనాలసిస్ చేస్తుంది. దీనితో పాటు due diligence exercise కూడా చేస్తుంది. అకౌంటింగ్, లీగల్ అంశాలను పరిశీలించేందుకు కొన్ని సార్లు నిపుణులను కూడా నియమిస్తుంది.
అదే విధంగా ఇన్వెస్టర్‌గా మీరు కూడా కొన్ని కీలకమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్‌గా మీరు దృష్టిసారించాల్సిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. # Check These Before Investing! #
Legal due diligence
కంపెనీ యొక్క లీగల్(న్యాయ) అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే Legal due diligence. దేశంలో ఉన్న చట్టాలను, నిబంధనలను కంపెనీ పాటిస్తోందా? లేదా ఉల్లంఘిస్తోందా? అన్నది Legal due diligence ద్వారా తెలుసుకోవచ్చు. చట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘిస్తే, కంపెనీపై పిటిషన్లు, పెనాల్టీలు పడే అవకాశముంటుంది. ఇది ప్రత్యక్షంగా ఆ కంపెనీ యొక్క సంపదపై ప్రభావం చూపుతుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు పరిగణించాల్సిన కొన్ని లీగల్ అంశాలను చూద్దాం.
-
Laws that govern the industry and the company
కంపెనీ ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలి. ఫలితంగా ఆ ఇండస్ట్రీలో ఉన్న లీగల్ అంశాలు తెలుస్తాయి. అందులో ఉన్న నిబంధనలు, పరిమితులు అర్థమవుతాయి. మనం పెట్టుబడులు పెడదాం అనుకుంటున్న కంపెనీ.. ఈ చట్టాలను అనుసరిస్తోందా? లేదా? అన్నది తెలుస్తుంది.
కంపెనీని ప్రభావం చేయగలిగే పాలసీల్లో ప్రభుత్వం ఏవైనా మార్పులు చేసిందా? అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
-
Memorandum and articles of association
కంపెనీ అధికారులు కంపెనీ యొక్క విషయాలను తెలిపే ముఖ్యమైన డాక్యుమెంట్లు ఈ memorandum and articles of association. ఇవి కంపెనీ-కంపెనీకి మారుతూ ఉంటాయి. కంపెనీ objectiveని memorandum of association (MOA) తెలుపుతుంది. కంపెనీ చేయాల్సిన పనులు(tasks)ను article of association(AOA) సూచిస్తుంది.
భవిష్యత్తులో కంపెనీ ఏవైనా కార్యకలాపాలు చేపట్టాలనుకుంటే, వాటికి ఆ అధికారం ఉండాలంటే అవి ముందుగా MOA, AOAలో ఉండాలి.
ఉదాహరణకు.. ఓ కంపెనీ ద్విచక్ర వాహనాల తయారీ కోసం MOA పొందింది. కానీ ఆ కంపెనీ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తోంది. అంటే ఆ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినట్టే కదా!
-
Board of Directors decisions and Annual General Meetings (AGM)
కంపెనీ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల మీటింగ్స్‌లోనైనా, ఏజీఎమ్లోనైనా షేర్‌హోల్డర్ల అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రెండు మీటింగ్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా AGM ద్వారా కంపెనీ నిర్ణయాలు, భవిష్యత్తు కార్యకలాపాలు, ప్రణాళికల గురించి తెలుసుకోవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్స్‌లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి.
-
Existing and potential future lawsuits
కోర్టు కేసుల వల్ల కంపెనీ ఫైనాన్షియల్స్, వనరులపై భారీ ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల మనం పెట్టుబడులు పెట్టే కంపెనీపై ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయా? అని తెలుసుకోవడం అవసరం.
ఒకవేళ కోర్టు కేసులు ఉన్నా, తీర్పు కంపెనీకి అనుకూలంగా వస్తుందా? లేదా? అన్నదానిపై అవగాహన పెంచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన తరుణంలో భవిష్యత్తులో ఏవైనా కోర్టు కేసులు ఎదురయ్యే అవకాశం ఉందా? అనేదానిపైనా అవగాహన ఉండాలి. # Check These Before Investing! #
-
Outstanding tax payments and other legal obligations
Due diligence exercise చేసేటప్పుడు, taxationని కూడా తప్పకుండా పరిశీలించాలి. పన్ను వ్యవస్థలో మార్పులు వస్తే, కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కంపెనీకి Outstanding tax payments కూడా ఉంటాయి. వాటి చెల్లింపుల్లో ఆలస్యం అయితే పెనాల్టీలు పడే అవకాశముంది. లేదా పన్నులపై వడ్డీ పడే ప్రమాదం కూడా ఉంది. ఇవి కంపెనీ ఫైనాన్షియల్స్పై ప్రభావం చూపుతాయి.
కొన్ని సార్లు, గత సంవత్సరాలకు సంబంధించి అదనపు పన్నులు చెల్లించాలంటూ ఆదాయపు పన్నుశాఖ అధికారులు నోటీసులు అందిస్తారు. అందువల్ల పన్నుల భారం పెరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో కంపెనీలు ట్యాక్స్ కట్టడం కన్నా కోర్టుల్లో కేసు వేయడానికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా కంపెనీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.
-
Corporate governance policies
కార్పొరేట్ గవర్నెన్స్ పాలసీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన సమస్యలు మన కంటపడే అవకాశముంది. కంపెనీ యొక్క ఆన్యువల్ రిపోర్టులో corporate governance అనే సెక్షన్ ఉంటుంది. అందులో వివరాలు తెలుసుకోవచ్చు.
Corporate governance అనేది చాలా పెద్ద వ్యవహారం. ఇందులో సెక్షన్స్, సబ్-సెక్షన్స్ ఉంటాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే, కంపెనీ సమస్యలు బయటపడతాయి. వాటిని తొందరగా పరిష్కరించకపోతే, పెద్దగా మారి కంపెనీకే ప్రమాదమవుతాయని అర్థమవుతుంది.
సామాజిక కార్యకలాపాల కోసం కంపెనీ కొన్ని ఖర్చులు చేయాల్సి ఉంటుంది. వాటిని CSR (corporate social responsibility) ని అంటారు. ఆ నియమాన్ని అందుకోలేక పోతే అది Corporate governance నిబంధనలను ఉల్లంఘించినట్టే. అదే సమయంలో వాటిని పూర్తి చేసి, సంబంధిత లావాదేవీ వివరాలను స్పష్టం చేయకపోయినా.. అది Corporate governance నిబంధనలను ఉల్లంఘించినట్టే. వీటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
-
Key Management changes
కంపెనీ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకమైన విషయం. Legal due diligenceను చేస్తున్నప్పుడు, management changes పైనా ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుంది. ఎవరైనా ముఖ్యమైన వారు రాజీనామా చేస్తే, దాని వెనకున్న కారణాలు తెలుసుకోవాలి.
Corporate governanceలో విఫలమైనా ఇలా రాజీనామాలు చేయడం లేదా పదవుల నుంచి తొలగించడం వంటివి ఉంటాయి.
Yesbankను ఉదాహరణకు తీసుకుందాం. 2018-19 మధ్య కాలంలో Yes bankకు సంబంధించిన ముఖ్యమైన మేనేజ్మెంట్ సిబ్బంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. Corporate governance వైఫల్యాన్ని ఇది సూచిస్తుంది. దీని ప్రభావం చాలా ఆలస్యంగా బయటపడింది. కంపెనీ షేర్ల విలువ 80శాతం మేర పడిపోయింది. # Check These Before Investing! #
Accounting due diligence
Due diligenceలో రెండోది అకౌంటింగ్. దీనిలో నెంబర్లపై దృష్టిసారిస్తున్నాం అనుకోకూడదు. కంపెనీ యొక్క అకౌంటింగ్ పాలసీలను చూడాలి.
కంపెనీ ఆదాయం- ఖర్చుల వివరాలు:
standard అకౌంటింగ్ విధానాలకు అనుగుణంగా కంపెనీ యొక్క అకౌంటింగ్ పాలసీ ఉందా లేదా అన్నది దీని ద్వారా తెలుస్తుంది. ఇందులోని మనం దృష్టిపెట్టాల్సిన కొన్ని కీలక అంశాలను చూద్దాం..
- కంపెనీ అకౌంటింగ్ పాలసీలు.
- కంపెనీ సొంతం చేసుకున్న, లీజుకు ఇచ్చిన
- యంత్రపరికరాల lifespan ముగిస్తుంటే, వాటిని మార్చేందుకు కంపెనీ చేసే ఖర్చులు.
- రెవన్యు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వాల్యుయేషన్‌కు సంబంధించి కంపెనీ పాటిస్తున్న ఆకౌంటింగ్ విధానాలు.
- ప్రస్తుత అప్పులు, ఇతర ప్రొవిజన్లు.
- కంపెనీ యొక్క ఆడిట్ రిపోర్టు
- కంపెనీ యొక్క షేర్‌హోల్డర్ పాటర్న్‌తో పాటు స్టాక్ ఓనర్షిప్ .
దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి?
కంపెనీలో పెట్టుబడులు చేసే ముందు Due diligence చేయడమూ ముఖ్యమే.
రీక్యాప్..
- ఒక ఇన్వెస్టర్‌గా due diligence exerciseని చేయడం ఎంతో అవసరం.
- కంపెనీ యొక్క లీగల్ అంశాలను పరిశీలించడాన్ని Legal due diligence అంటారు.
- కంపెనీ ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలి. ఫలితంగా ఆ ఇండస్ట్రీలో ఉన్న లీగల్ అంశాలు తెలుస్తాయి.
- కంపెనీ objectiveని memorandum of association (MOA) తెలుపుతుంది. కంపెనీ చేయాల్సిన పనులు(tasks)ను article of association (AOA) సూచిస్తుంది.
- కంపెనీ తీసుకునే ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల మీటింగ్స్‌లోనైనా, ఏజీఎమ్లోనైనా షేర్‌హోల్డర్ల అనుమతులు పొందాల్సి ఉంటుంది.
- మనం పెట్టుబడులు పెట్టే కంపెనీపై ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయా? అని తెలుసుకోవడం అవసరం.
- Due diligence exercise చేసేటప్పుడు, taxationని కూడా తప్పకుండా పరిశీలించాలి.
- Corporate governance policies (కార్పొరేట్ పాలనా విధానాలు) ను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన సమస్యలు మన కంటపడే అవకాశముంది.
- Legal due diligenceను చేస్తున్నప్పుడు, management changes పైనా ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుంది.
- కంపెనీ ఆదాయం- ఖర్చుల వివరాలు, standard అకౌంటింగ్ విధానాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది Accounting due diligence ద్వారా తెలుస్తుంది.
ఇదీ చూడండి: What is the right time to start investing?
ఇదీ చూడండి: మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?