What is “CANSLIM” strategy?

CANSLIM strategy

ప్రఖ్యాత అమెరికన్‌ ఇన్వెస్టర్‌ విలియం ఓ నీల్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీలు రూపొందించడంలో దిట్ట. ఆయన రూపొందించిన ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీనే CANSLIM. ఇందులో Fundamental, Technical, Risk Management అనాలసిస్‌ కలగలిసి ఉంటుంది. గత 12 ఏళ్ల కాలంలో ఈ CANSLIM స్ట్రాటజీ ప్రకారం ఇన్వెస్ట్‌ చేసినవారికి 2736శాతం రిటర్న్స్‌ వచ్చాయని మార్కెట్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. # What is “CANSLIM” strategy? #

మరి మనం కూడా CANSLIM స్ట్రాటజీ గురించి తెలుసుకుందామా?
C = Current quarterly earnings per share

దీని ప్రకారం గతేడాది ఇదే సమయంతో పోల్చితే earning per share 25% ఉండాలి. అప్పుడే ఆ కంపెనీ / స్టాక్‌ స్ట్రాంగ్‌గా ఉన్నట్లు.

A = Annual Earnings

కంపెనీ యొక్క Annual Earnings 25%కి తగ్గకుండా ఉండాలి. 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో కంపెనీ / స్టాక్‌ యొక్క గ్రోత్‌ నిలకడగా ఉండాలి.

N = New Product and New Heights

కంపెనీ కొత్త మరియు వినూత్నమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టిందా? లేదా? అనేది చూడాలి. నూతన ఉత్పత్తులు లేకపోతే స్టాక్‌ వాల్యూ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

S = Supply and Demand

కంపెనీ యొక్క ఉత్పత్తులకు ఎంత డిమాండ్‌ ఉందన్నది చాలా కీలకమైన అంశం. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే సప్లై కూడా పెరుగుతుంది. ఫలితంగా స్టాక్‌ వాల్యూ కూడా పెరగుతుంది. # What is “CANSLIM” strategy? #

L = Leader or Laggard

కంపెనీ మార్కెట్‌ లీడర్‌గా ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి. సాధారణ ఇన్వెస్టర్లు కచ్చితంగా లీడింగ్‌ కంపెనీలోనే ఇన్వెస్ట్‌ చేయాలి. సాధారణంగా కొన్ని కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుంది. కానీ ఆ కంపెనీలు నష్టాల్లో ఉంటాయి. అలాంటప్పుడు వాటిలో ఇన్వెస్ట్‌ చేయకపోవడమే మంచిదని విలియం ఓ నీల్‌ అభిప్రాయం.

I = Institutional Ownership

ఒక కంపెనీకి ఉన్నత స్థాయి సంస్థాగత యాజమాన్యం ఉన్నప్పుడే అందులో ఇన్వెస్ట్‌ చేయాలి. అలా లేకుంటే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

M = Market Direction

విలియం ఓ నీల్‌ ప్రకారం, ప్రతి నాలుగు స్టాక్స్‌లో మూడు స్టాక్స్‌ మార్కెట్‌ ధోరణిని అనుసరించి స్పందిస్తాయి. అందువల్ల ఇంటర్మీడియట్‌ ట్రెండ్‌ బేరిష్‌గా ఉన్నప్పుడు.. పెట్టుబడిదారులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు… మంచి బలమైన అప్‌ట్రెండ్‌ను నిర్ధారించుకోవడానికి మార్కెట్‌ కదలికలను జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. # What is “CANSLIM” strategy? #

Note: ప్రపంచంలో ఎంతో మంది ప్రఖ్యాత ఇన్వెస్టర్లు ఉన్నారు. వారు స్టాక్‌మార్కెట్‌లో తమకున్న అనుభవంతో కొన్ని స్ట్రాటజీలను రూపొందించి మనకు అందించారు. సాధారణ ఇన్వెస్టర్లమైన మనం వీటిని గురించి తెలుసుకోవడం చాలా మంచిదే. అయితే ఇలాంటి స్ట్రాటజీలను ఫాలో అయ్యే ముందు మీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సలహాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

Note: ఈ వ్యాసం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనిని వ్యాసకర్త యొక్క రికమండేషన్‌గా మీరు భావించకూడదు.

ఇదీ చదవండి: ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021

ఇదీ చదవండి: Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?