Fundamental analysis Part – 5
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ను చదవడం ఎలా?
ఒక ఇన్వెస్టర్‌గా మీకు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ (P&L)ను చదవడం మీకు రావాలి. ఎందుకంటే కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన గణాంకాలు ఇందులోనే ఉంటాయి.
ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) యొక్క 2019-2020 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం. అందులోని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ (P&L)ను ఎలా చదవాలో తెలుసుకుందాం.
profit and loss statement
లేఅవుట్
చట్టం ప్రకారం, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏ కాలవ్యవధికి సంబంధించిందో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ హెడ్డింగ్ కింద ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మన ఉదాహరణలో 2020 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన హిందూస్థాన్ యూనిలీవర్ P&L స్టేట్మెంట్ కనిపిస్తోంది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన ప్రాఫిట్ అండ్ స్టేట్మెంట్.
దాని కింద, కుడి భాగంలో కరెన్సీ డినోమినేషన్ (Currency denomination) వివరాలు ఉంటాయి. భారతీయ కంపెనీల ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ల్లో కరెన్సీ డినోమినేషన్ రూపాయల్లో, కోట్లలో ఉంటుంది.
అంటే 500 నెంబరు ఉంటే.. దాన్ని రూ.500 కోట్లుగా పరిగణించాల్సి ఉంటుంది.
సాధారణంగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ను నాలుగు భాగాలుగా విభజిస్తారు.
పర్టిక్యులర్స్ (Particulars)
ఇందులో కంపెనీ జరిపిన లావాదేవీల వివరాలు ఉంటాయి. దీనికి సంబంధించిన గణాంకాలు కుడివైపు ఉంటాయి.
నోట్ (Note)
ఇక్కడ మనకి కొన్ని నెంబర్లు కనపడతాయి. కంపెనీకి సంబంధించిన వివిధ లావాదేవీల గురించి వివరంగా తెలుసుకోవాలంటే, ‘నోట్స్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్’ అని విడిగా ఓ సెక్షన్ ఉంటుంది. అందులో ఈ నెంబర్ల పక్కన లావాదేవీల పూర్తి వివరాలు చూడవచ్చు.
2020 మార్చి 31తో ముగిసిన సంవత్సరం:
ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కంపెనీకి సంబంధించిన గణాంకాలు ఉంటాయి.
2019 మార్చి 31తో ముగిసిన సంవత్సరం
ఇందులో గత ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించిన కంపెనీ గణాంకాలు ఉంటాయి.
ఈ గణాంకాలను పరిశీలించడం ద్వారా, రెండు వరుస ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ పనితీరు మెరుగుపడిందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు.
ఆదాయం (INCOME)
ఈ సెక్షన్లో రెండు ప్రైమరీ సబ్క్యాటగిరీలు ఉంటాయి. అవి:
- కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం (Revenue from operations)
- ఇతర ఆదాయాలు (Other income)
రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్
ఇందులో కంపెనీ యొక్క ప్రధాన వ్యాపార కార్యకలాపాల వల్ల వచ్చిన ఆదాయ (రెవెన్యూ) వివరాలు ఉంటాయి.
HUL అనేది ఎఫ్ఎమ్సీజీ (FMCG) రంగానికి చెందింది. కాబట్టి, అది దాని ఉత్పత్తులను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది.
HUL తన ఆదాయానికి సంబంధించిన వివరాలను Note 24లో వెల్లడించింది.
note 24
వాటిని పరిశీలిస్తే, HUL తన వినియోగదారులకు సేవలు (Services) అందిస్తూ ఆదాయం పొందుతోందని స్పష్టమవుతోంది. అయితే ఈ ఆదాయాన్ని ‘other operating revenue’లో చేర్చింది.
(ఇతర ఆదాయాలు) Other income
ఒక సంస్థ తన ప్రధాన వ్యాపారం కాకుండా ఇతర కార్యకలాపాల ద్వారా పొందే ఆదాయాన్ని ‘other income’లో చూడవచ్చు.
HUL విషయానికి వస్తే Note 25లో other incomeకి సంబంధించిన వివరాలు పొందుపరిచారు.
note 25
HUL తన అనుబంధ సంస్థల్లో (Subsidiaries) పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన డివిడెండ్ ఆదాయాన్ని (dividend income), వడ్డీల రూపంలో పొందిన ఆదాయాన్ని Other income సెక్షన్లో పొందుపరిచింది. వాస్తవానికి ఈ ఆదాయాన్ని కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారంలో భాగంగా పరిగణించరు.
మొత్తం రాబడి (Total income)
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని (revenue from operations) ఇతర ఆదాయాలతో (other income) కలిపితే కంపెనీ యొక్క మొత్తం ఆదాయం (total income) వస్తుంది.
HUL యొక్క మొత్తం ఆదాయం = రూ. 39,518కోట్లు (రూ. 38,785కోట్లు+రూ. 733కోట్లు)
ఖర్చులు (Expenses)
ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పెట్టిన అన్ని ఖర్చుల వివరాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ ఖర్చులను వాటి స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. ఇప్పుడు వాటిని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.
ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులు (Cost of material consumed)
ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకును కొనుగోలు చేసేందుకు కంపెనీ పెట్టిన ఖర్చులు దీనిలో ఉంటాయి.
Purchases of stock-in-trade
వాణిజ్యం కోసం లేదా పునర్విక్రయం (resale) కోసం కంపెనీలు సాధారణంగా Finished goodsను కొనుగోలు చేస్తుంటాయి. అందుకయ్యే ఖర్చులను స్టాక్-ఇన్-ట్రేడ్ విభాగంలో చేర్చుతారు.
అంతిమ వస్తువుల జాబితాలో మార్పులు
Finished goods, stock-in-trade, work-in-progress వస్తువుల జాబితాలో చోటుచేసుకున్న మార్పులు గురించి ఇందులో పేర్కొంటారు.
ఉద్యోగుల లబ్ధి కొరకు చేసిన ఖర్చులు (Employee benefit expenses)
తమ ఉద్యోగులకు లబ్ధిచేకూరే విధంగా కంపెనీ చేసిన ఖర్చులను ఈ ’employee benefits expenses’లో చూపిస్తారు. ఈ ఖర్చులను note 29లో వివరంగా చూడవచ్చు.
note 29
ఆర్థిక ఖర్చులు (Finance costs)
వీటిని borrowing costs అని కూడా అంటారు. కంపెనీలు అప్పులు తీసుకున్నప్పుడు, ఆ అప్పులకు కట్టాల్సిన వడ్డీ, ఇతర ఖర్చుల వివరాలను Finance costs సెక్షన్లో పొందుపరుస్తారు.
HUL యొక్క ఆర్థిక ఖర్చులు note 30లో పొందుపరిచారు.
note 30
తరుగుదల మరియు రుణ విమోచన ఖర్చులు
(Depreciation and amortisation expenses)
ఏ అస్సెట్ (tangible, intangible asset) అయినా రోజులు గడిచే కొద్దీ దాని విలువను కోల్పోతూ ఉంటుంది. కంపెనీకి చెందిన Tangible assetలో వచ్చిన నష్టాన్ని తరుగుదల (depreciation) అంటారు. Intangible asset వచ్చిన నష్టాన్ని amortisation అంటారు.
కంపెనీకి చెందిన ఆస్తులు ఏటా వాటి విలువను కోల్పోతూ ఉంటాయి. కాబట్టి ఆ నష్టాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోని expensesలో చూపిస్తారు.
HUL విషయంలో తరుగుదల + రుణ విమోచన ఖర్చులు కలిపి రూ.938 కోట్లుగా ఉన్నాయి.
ఇతర ఖర్చులు (Other expenses)
Other expensesలో ancillary, miscellaneous expenses కలిపి ఉంటాయి. Note 32లో వీటి గురించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

note 32

మొత్తం ఖర్చులు (Total expenses)
HUL పెట్టిన ఖర్చులన్నింటినీ కలిపితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ రూ.30,229కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.
Profit before exceptional items and tax
ఒక సంస్థ యొక్క మొత్తం ఆదాయం నుంచి దాని మొత్తం ఖర్చులను తీసివేస్తే’Profit before exceptional items and tax’ వస్తుంది.
హిందూస్థాన్ యూనిలీవర్ యొక్క ‘Profit before exceptional items and tax’ = రూ.39,518 కోట్లు – రూ.30,229 = రూ.9,289 కోట్లు.
అసాధారణమైన అంశాలు Exceptional items(net)
ఒక కంపెనీ యొక్క రోజువారీ కార్యకలాపాల్లో అసాధారణ ఆదాయాలు లేదా అసాధారణ నష్టాలు వస్తుంటాయి. నిజానికి ఇవి పునరావృతం కావు. అయితే ఇలా వచ్చే అసాధారణ ఆదాయాన్ని ‘exceptional income అని, అసాధారణ నష్టాన్ని exceptional expense’ అని అంటారు.
మొత్తం exceptional income, exceptional expensesను net off చేస్తారు. ఈ net amountను profit before exceptional items and tax నుంచి తీసివేస్తే profit before tax వస్తుంది.
ఒక సంస్థ యొక్క అసాధారణ ఆదాయం, అసాధారణ ఖర్చులను మించిపోతే.. ఆ total exceptional itemsను profit before exceptional items and tax నుంచి తీసివేస్తారు.
అదే సమయంలో అసాధారణ ఆదాయం, అసాధారణ ఖర్చులను మించితే.. total exceptional itemsను profit before exceptional items and taxకు జోడిస్తారు.

Profit before tax (PBT)
Profit before exceptional items and tax నుంచి net of the exceptional items తీసివేస్తే వచ్చే మొత్తాన్ని profit before tax అని అంటారు.
HUL యొక్క PBT = (రూ.9,289కోట్లు – రూ.197కోట్లు) = రూ. 9,092కోట్లు
పన్ను ఖర్చులు (Tax expenses)
ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చేసిన కరెంట్, డిఫర్డ్ ట్యాక్స్ పేమెంట్స్ వివరాలు ఇందులో ఉంటాయి.
HUL ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రకారం, HUL కరెంట్ ట్యాక్స్ పేమెంట్స్ రూ.2,202కోట్లు, డిఫర్డ్ ట్యాక్స్ రూ. 152కోట్లుగా ఉంది.
ఒక్క ఏడాదిలో వచ్చిన లాభం Profit for the year (PAT)
దీనిని Bottom line of a company అని కూడా అంటారు.
ఒక్క ఏడాదిలో కంపెనీకి దక్కిన లాభాలు ఇక్కడ చూడవచ్చు. Profit before tax నుంచి tax paymentsను తీసివేస్తే PAT వస్తుంది.
HUL యొక్క PAT రూ. 6,738కోట్లుగా ఉంది. (రూ.9,092కోట్లు – రూ.2,202కోట్లు – రూ.152కోట్లు)
ఒక్కో షేరుకు వచ్చిన ఆదాయం Earnings per share (EPS)
కంపెనీలు EPSను తమ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో పొందుపరుస్తాయి. కంపెనీకి వచ్చిన లాభాలను పంచిపెడితే, ఒక్కో ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు ఎంత మేరకు లాభం చేకూరుతుందో EPS ద్వారా తెలుస్తుంది.
ఒక సంస్థ యొక్క మొత్తం నికర లాభాన్ని, మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్యతో భాగిస్తే EPS వస్తుంది.
దీని వల్ల పెట్టుబడులు పెట్టిన వారికి, భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి కంపెనీపై ఓ అవగాహన వస్తుంది.

ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ (P &L Statement) గురించి ఈ ఛాప్టర్లో తెలుసుకున్నాం. తరువాతి ఛాప్టర్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోని గణాంకాల ద్వారా పెట్టుబడిదారులు ఏఏ విషయాలు తెలుసుకోవచ్చో చూద్దాం.
ముఖ్యమైన అంశాలు
- పీ అండ్ ఎల్ స్టేట్మెంట్ కంపెనీ కార్యకలాపాలపై అవగాహన ఇస్తుంది.
- ప్రధాన వ్యాపారంతో పాటు ఇతర కార్యకలాపాల వల్ల కంపెనీ సంపాదించిన ఆదాయన్ని ఇది వివరిస్తుంది.
- Expenses సెక్షన్లో కంపెనీ యొక్క ఖర్చుల వివరాలు తెలుస్తాయి.
- Total income నుంచి Total expenses తీసివేస్తే profit before exceptional items and tax వస్తుంది.
- profit before exceptional items and tax నుంచి exception itemsను తీసివేస్తే profit before tax వస్తుంది.
- PBT నుంచి tax expensesను తీసివేస్తే profit after tax (PAT) తెలుస్తుంది.
- సంస్థ యొక్క మొత్తం నికర లాభాన్ని, మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్యతో భాగిస్తే EPS వస్తుంది.
Click here: Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?
Click here: ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి?