ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

fundamental analysis part 1 (1)

Fundamental analysis – Part – 1

 

ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

క్రికెట్ని మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించే దేశం ఇండియా. ‘క్రికెట్ ఈజ్ లైఫ్’ అన్న మాట ఈ దేశంలో సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. చిన్న, పెద్ద భేదం లేకుండా అందరికి నచ్చే ఆట ఈ క్రికెట్. వీరితో పాటు ఫైనాన్షియల్ ఎనలిస్ట్లకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా? ఎన్నో క్లిష్టమైన అంశాలను చాలా సులభంగా నేర్పించే సత్తా క్రికెట్కు ఉండటమే కారణం. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే, ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటో క్రికెట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. # ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి? #

ఉదాహరణకు.. ఓ క్రికెట్ జట్టుకు కెప్టెన్ను ఎంపిక చేసే పని మీకు అప్పగించారని అనుకుందాం. జట్టుకు సరైన సారథిని మీరు ఎలా ఎంచుకుంటారు?

  • ఇప్పటివరకు ప్లేయర్ చేసిన ప్రదర్శన
  • ప్లేయర్ స్ట్రైక్ రేట్
  • ప్లేయర్ యావరేజ్
  • ఫీల్డ్లో ఆ ప్లేయర్ ప్రవర్తన

దాదాపు మీరు చూసేవి ఇవే కదా! ఓ స్టాక్ను ఎంపిక చేసుకునేటప్పుడు ఫండమెంటల్ ఎనాలసిస్ను కూడా ఇదే విధంగా చేస్తారు.

వాస్తవానికి మీరు క్రికెట్ నిపుణులు కారు. ఓ సాధారణ క్రికెట్ అభిమాని మాత్రమే. అయినప్పటికీ, ఓ జట్టు కెప్టెన్ను ఎంపిక చేసేటప్పుడు ఏవేవి పరిగణించాలో మీకు తెలుసు. క్రికెట్ ఒక్కటే కాదు.. రోజువారీ జీవితంలో వేరువేరు సందర్భాల్లోనూ….. ఈ ఎనాలసిస్ను మీరు ఉపయోగిస్తూ ఉంటారు.

మరో రెండు ఉదాహరణలు తీసుకుందాం…

బట్టల దుకాణంలో డ్రెస్ ఎంపిక

  • అసలు డ్రెస్ తీసుకుంటున్నది ఎందుకు?
  • ఎలాంటి డ్రెస్ కోసం చూస్తున్నారు?
  • ఆ డ్రెస్ సైజు ఎంత ఉండాలి?
  • ఏ రంగు డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నారు?
  • మీ బడ్జెట్ ఎంత?
  • డ్రెస్తో పాటు మ్యాచింగ్ యాక్ససరీస్ ఏవైనా తీసుకుంటారా?
  • ఏదైనా బ్రాండ్ కొనాలని మీరు అనుకుంటున్నారా?

వెకేషన్కు డెస్టినేషన్ ఎంపిక

  • ఏడాదిలో వెకేషన్కు ఎప్పుడు వెళదాం అనుకుంటున్నారు?
  • బీచ్కు వెళ్లాలని ఉందా? లేదా చారిత్రక నగరానికి వెళ్లాలని ఉందా? ఇవేవీ కాకుండా మంచి హిల్ స్టేషన్కు వెళ్లాలని ఉందా?
  • ఎన్ని రోజులు ఉంటారు?
  • మీరు ఎలాంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు?
  • ఏవైనా స్పెషల్ వంటకాలను ట్రై చేయాలని ఉందా?
  • ఫ్లైట్ ఛార్జీలకు మీ బడ్జెట్ ఎంత?
  • సాధారణ వెకేషన్ కావాలా? లేక సాహస యాత్ర వంటి అనుభవం కలగాలా?

రోజువారీ జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకునేది ఇలాగే కదా? ఇలా ఎన్నో విషయాలను మీరు సులభంగా పరిగణలోకి తీసుకుంటారు. అలవాటు అయిపోవడం వల్ల ఇవేవీ మీకు కష్టంగా అనిపించదు. ఫండమెంటల్ ఎనాలసిస్లో కూడా ఇంతే!

ఏ కంపెనీలో అయితే మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో…. ఆ కంపెనీకి ఆ అర్హత ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడమే ఈ ఫండమెంటల్ ఎనాలసిస్.

ఫండమెంటల్ ఎనాలసిస్ డెఫినిషన్

ఏదైనా అసెట్ యొక్క వాల్యు(విలువ)ను గుర్తించడానికి ఉపయోగించే టెక్నిక్నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. కంపెనీ వ్యాపారం, దాని భవిష్యత్తును ప్రభావితం చేయగలిగే అంశాలపై ఇది దృష్టి పెడుతుంది. కంపెనీ ఫైనాన్షియల్స్ (financials), ఎకనామిక్స్(Economics)ను  ఎనలైజ్‌ చేసేందుకు ఈ ఫండమెంటల్ స్టాక్ ఎనాలసిస్  ఉపయోగపడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ స్టాక్ వాల్యుకు అనుగుణంగా ఆ స్టాక్ ధర ఉందా? లేదా? అన్నది ఈ ఫండమెంటల్ ఎనాలసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు వెచ్చించేది stock price (ధర). మీకు లభించేది స్టాక్ వాల్యు (stock value).

ఇప్పుడు ఓ కంపెనీని ఉదాహరణగా తీసుకుందాం

ఐషర్ మోటర్స్:-

మార్చి 13, 2020న ఐషర్ మోటర్స్ ఒక్క షేర్ ధర రూ. 17,672.15గా ఉంది.

ఏప్రిల్ 13,2020 నాటికి.. ఒక్క షేర్ రూ. 12,680.05కి పడిపోయింది.

ఈ గణాంకాలను చూస్తే, షేర్ ధర పడిపోయింది కాబట్టి, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టకూడదని అనుకుంటారు.

కానీ జూన్ 24,2020కి అదే ఐషర్ మోటర్స్ షేర్ ధర రూ. 18,436.85కి పెరిగిపోయింది.

దీని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి?

స్టాక్ ధరల్లో ఒడుదొడుకులు ఉండటం సహజం. ఇది తరచూ జరుగుతునే ఉంటుంది. కానీ మంచి వాల్యుతో ఫండమెంటల్గా దృఢంగా ఉండే కంపెనీ దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తుంది.

మరి ఏ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందో ఎలా తెలుసుకోవాలి? కంపెనీపై ఫండమెంటల్ ఎనాలసిస్ చేస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అందుకోసం సరైన టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకోవాలి.

ఆ టెక్నిక్స్ ఏంటో Fundamental analysis part -2లో తెలుసుకుందాం.

రీక్యాప్..

  • ఓ  అసెట్ యొక్క వాల్యు తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్కే ఫండమెంటల్ ఎనాలసిస్.
  • కంపెనీ వ్యాపారం, భవిష్యత్తును ప్రభావితం చేయగలిగే  అంశాలపై ఫండమెంటల్ ఎనాలసిస్ దృష్టిపెడుతుంది.
  • ఓ కంపెనీ ఫైనాన్షియల్స్, ఎకామిక్స్ను విశ్లేషించేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్ ఉపయోగపడుతుంది.
  • స్టాక్ వాల్యుకు అనుగుణంగా దాని ధర ఉందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు.
  • మనం వెచ్చించేది స్టాక్ ప్రైజ్, మనకి లభించేది ఆ స్టాక్ వాల్యు.
  • స్టాక్ ప్రైజ్లో ఒడుదొడుకులు సహజం. అయితే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తుంది.

Click here: వార్షిక నివేదిక అంటే ఏమిటి?

Click here: ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?