క్విక్ యాక్సెస్‌తో పాటు ఇతర అవసరాల కోసం Google chrome, Microsoft Edge, firefox browsersలో extensions డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటాం. అయితే దాదాపు 28 extensions వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. ఇవి malwareతో ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, వీటిని క్లిక్ చేసిన వెంటనే, unsafe websitesకు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా ఈమెయిల్ ఎడ్రెస్, కాంటాక్ట్ నెంబర్సతో పాటు బ్యాంక్ కార్డ్ సమాచారాలను దొంగిలించే అవకాశముంది. వీటి వల్ల ఇప్పటికే 30లక్షలమంది నష్టపోయి ఉండవచ్చని సెక్యురిటీ సంస్థ Avast ఓ నివేదికలో వెల్లడించింది. # మీరు extensions వాడుతున్నారా… అయితే జాగ్రత్త! #
ఫేస్బుక్ వీడియో డౌన్లోడర్, విమియో వీడియో డౌన్లోడర్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడర్, వీకే అన్బ్లాక్తో పాటు అనేక extensionsను గుర్తించింది Avast. వీటిని డౌన్లోడ్ చేసే సమయంలో యూజర్స్ శ్రద్ధ చూపించరని.. అందుకే వీటిలో హాని కలిగించే కోడ్స్‌ను పెట్టి malware డౌన్లోడ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది.
ఈ extensionsలో JavaScript ఉంటాయి. లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే సైబర్ దాడులకు పాల్పడే వారికి సమాచారం అందుతుంది. ఒక్క కమాండ్ ద్వారా phishing websiteలోకి మిమ్మల్ని రీడైరక్ట్ చేస్తారు. మళ్లీ మీరు కోరుకుంటున్న సైట్‌కి రీడైరక్ట్ చేస్తారు. ఇంతలో మీ ప్రైవసీ, డేటాను దొంగిలిస్తారు.
ఇలా థర్డ్ పార్టీ డొమైన్స్కు యూజర్స్‌ను రీడైరక్ట్ చేస్తే, వాళ్లకి కొంత డబ్బు అందుతుంది. Phishing సైట్స్‌కి కూడా ఇది ఉపయోగకరమే. యూజర్స్‌కు తెలియకుండానే వారి సమాచారం, డేటాను పొందవచ్చు.
ఈ extensionsపై ఈ నవంబర్‌లో పరిశోధన చేపట్టింది Avast. కానీ ఈ వ్యవహారం కొన్నేళ్లగా సాగుతోందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై google chrome, Microsoft edge browsersను సంప్రదించింది Avast. సమస్యను పరిశీలిస్తున్నామని ఆయా సంస్థలు వెల్లడించాయి.
Click here: Oppo Find X3 Pro ఇలా ఉంటుందా?
Click here: వార్షిక నివేదిక అంటే ఏమిటి?