అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా విరివిగా “మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి”ని ఉపయోగిస్తారు. ఈ సూచీ ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తుంటారు.
పెట్టుబడుల మాంత్రికుడు వారెన్ బఫెట్ ఈ “మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి”ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని వారెన్ బఫెట్ ఇండికేటర్‌గా పిలుస్తుంటారు.
ఇంతకీ మార్కెట్ క్యాపిటలైజేషన్ – జీడీపీ నిష్పత్తి అంటే ఏమిటి?
సూత్రం:
Market capitalization to GDP = (SMC/GDP) X 100
SMC = Stock market capitalization
GDP = Gross Domestic Product
మార్కెట్ క్యాప్ – జీడీపీ నిష్పత్తి = (మార్కెట్ క్యాపిటలైజేషన్/ జీడీపీ విలువ) x 100
బఫెట్ ఇండికేటర్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
సాధారణంగా మార్కెట్ ఓవర్ వాల్యూడ్‌గా ఉందా లేదా అండర్ వ్యాల్యూడ్‌గా ఉందా అనేది తెలుసుకునేందుకు ఈ ఇండికేటర్‌ను ఉపయోగిస్తారు.
మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి 100 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని ఓవర్ వాల్యూడ్‌గా పరిగణిస్తారు.
మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి 100 శాతం కంటే తక్కువగా ఉంటే దాన్ని అండర్ వాల్యూడ్‌గా పరిగణిస్తారు.
వాస్తవానికి దీన్ని ఓ తంబ్ నియమంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క సూచీ కూడా మార్కెట్లను కచ్చితంగా అంచనా వేయలేదు.
భారత్‌లో బఫెట్ ఇండికేటర్ పనిచేస్తుందా?
బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ బఫెట్ ఇండికేటర్‌ను బాగా ఉపయోగిస్తారు. అయితే ఇంకా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం వ్యాపారాలు స్టాక్ ఎక్స్ఛేంజిల్లో లిస్ట్ అయి ఉండవు.
ముఖ్యంగా భారత్‌లో ఎక్కువగా చిన్నచిన్న వ్యాపారాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కాలేదు. కనుక స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దేశంలో జరిగే మొత్తం వ్యాపారాన్ని ప్రతిబింబించదు.
అందుకే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ బఫెట్ ఇండికేటర్‌ను ఉపయోగించి.. స్టాక్ మార్కెట్లను సరిగ్గా అంచనా వేయలేము.
Click here: Bull Market, Bear Market అంటే ఏమిటి?
Click here: The key players in the stock market