మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసా?

Why 72 is a magic number?

హాయ్‌ ఫ్రెండ్స్! ఈ రోజు మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసుకుందాం.

“ధనమేరా అన్నింటికీ మూలం. ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం” అని వెనుకటికి ఓ మహానుభావుడు స్పష్టంగా చెప్పాడు. అందువల్ల మనం సంపాదించే సమయంలోనే… భవిష్యత్‌ కోసం కచ్చితంగా పొదుపు చేయాలి.

సరే పొదుపు చేయడం మొదలుపెడతాం. మరి మన డబ్బు ఎన్నాళ్లకు రెట్టింపు అవుతుంది? ఇది మనకు ఉదయించే మొదటి ప్రశ్న.

మ్యాజిక్ నంబర్‌ 72

దీనికి సమాధానం మ్యాజిక్ నంబర్‌ 72 ఇస్తుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ నంబర్‌ 72 మ్యాజిక్ గురించి మొదటిగా చెప్పారని ప్రతీతి.

ఇంతకీ మన డబ్బు ఎన్నాళ్లకు రెట్టింపు అవుతుందో తెలుసుకుందాం. ఇది చాలా సులభం… 72ని వడ్డీరేటుతో భాగిస్తే చాలు… మన డబ్బు ఎన్నాళ్లలో రెట్టింపు అవుతుందో తెలిసిపోతుంది.

ఉదాహరణకు వడ్డీరేటు 9 శాతం అనుకుందాం. అప్పుడు మీ డబ్బు 8 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అది ఎలాగంటే… 72/9=8.

చూశారుగా…ఈ విధంగా  మ్యాజిక్‌ నంబర్‌ 72 ద్వారా మీ డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

(గమనిక: వడ్డీ రేటు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ నంబర్‌ 72 మ్యాజిక్ పనిచేస్తుంది.)

Click here: మా అమ్మమ్మ

Click here: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

Leave a Comment

error: Content is protected !!