హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Different types of companies గురించి తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు చేసే కంపెనీలు పలు రకాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయా అన్నదాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు.
ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు
ఓ కుటుంబం ఆధ్వర్యంలో లేదా కొంత మంది వ్యక్తులు భాగస్వామ్యంతో నడిచే కంపెనీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటారు. ఇవి తమ ఆర్థికపరమైన సమాచారాన్ని బహిరంగపరచాల్సిన అవసరం లేదు. కేవలం ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీగా ఉంటాయి.
ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు సాధారణ ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు అనుమతులు లేవు. కనుక ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో తమ షేర్లను ట్రేడ్ చేయలేవు.
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో పెద్ద సంఖ్యలో మదుపరులు వాటాదారులుగా ఉంటారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి చెందిన షేర్లను స్టాక్ మార్కెట్‌లో కొనడం ద్వారా ఇన్వెస్టర్లు… ఆ కంపెనీలో భాగస్వాములు అవుతారు.
బహుళజాతి సంస్థలు (Multinational Companies)
ఓ పెద్ద కంపెనీ తన కార్యకలాపాలాను వివిధ దేశాల్లో జరుపుతూ, ప్రధాన వ్యవహారాలన్నీ ఒక దేశం నుంచే సమన్వయం చేస్తుంటే దానిని మల్టీ నేషనల్ కంపెనీ (MNC) అనవచ్చు. ఇక్కడ కొంచెం టెక్నికల్‌గా మాట్లాడుకుంటే, ఒక కంపెనీ తన ఆదాయంలో 25 శాతం వరకు ఇతర దేశాల్లో జరిపే కార్యకలాపాల ద్వారా సముపార్జిస్తుంటే దాన్ని మల్టీ నేషనల్ కంపెనీ అనవచ్చు.
దేశీయ కంపెనీలు
ఒక కంపెనీ తన కార్యకలాపాలను ఒక దేశానికి లేదా ప్రదేశానికి మాత్రమే పరిమితం చేకుంటే దాన్ని దేశీయ కంపెనీ అనవచ్చు. అంటే ఆ కంపెనీ తన కార్యకలాపాలను కేవలం ఒక నగరానికే పరిమితం చేయవచ్చు. లేదా ఒక రాష్ట్రం పరిధి మేరకు దాని వ్యాపార, వ్యవహారాలను విస్తరించవచ్చు. లేదా కేవలం ఒక దేశం వరకు మాత్రమే తన వ్యాపారాన్ని పరిమితం చేసుకోవచ్చు.
షేర్ హోల్డింగ్ విధానం:
ఓ కంపెనీకి చెందిన షేర్లను వివిధ వర్గాలకు… ఎంత శాతం మేరకు కేటాయించారన్నది తెలిపేదే షేర్ హోల్డింగ్ విధానం. ఈ షేర్ హోల్డింగ్ యొక్క సమాచారం సదరు కంపెనీ వైబ్‌సైట్‌లో, దాని వార్షిక నివేదికలో లేదా ఇతర ఫైనాన్సియల్ వెబ్‌సైట్లలో దొరుకుతుంది.
దీనిలో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. అవి:
- ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్
- పబ్లిక్ షేర్ హోల్డింగ్
సాధారణంగా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్‌మెంట్‌లోని కీలక వ్యక్తులు ప్రమోటర్లుగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మేనేజ్‌మెంట్‌లోని కీలక వ్యక్తులు, వారి బంధువర్గం, డైరెక్టర్లు ప్రమోటర్ గ్రూప్ కిందకు వస్తారు.
పబ్లిక్ షేర్ హోల్డర్లు అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, విదేశీ సంస్థలు, సాధారణ ఇన్వెస్టర్లు. వీరందరి యొక్క పెట్టుబడిని పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం వ్యవస్థ ఆర్థికమంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SEBIలు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తుంది.
Click here: IPO అంటే ఏమిటి?
Click here: చిత్రగ్రీవుని తెలివి