కేంద్రప్రభుత్వం స్పెషల్ బారోయింగ్ విండో కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల GST పరిహారాన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విండో కింద ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లను రుణాలుగా ఇచ్చింది.
GST పరిహారం సెస్ కొరత తీర్చేందుకు ఈ విండో ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి GST కౌన్సిల్ కూడా అంగీకరించింది.
కేంద్రం చెల్లించాల్సిన పరిహారానికి బదులుగా రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలు కూడా అంగీకారం తెలిపాయి. ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రెండో విడతగా స్పెషల్ బారోయింగ్ విండో ఎంచుకున్న రాష్ట్రాలకు రుణాలు విడుదల చేసింది.
స్పెషల్ విండో ఎంచుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, గోవా, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. వీటితోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, జమ్ము కశ్మీర్, పుదుచ్ఛేరి కూడా ఈ స్పెషల్ విండో ఎంచుకున్న వాటి జాబితాలో ఉన్నాయి.
Click here: What is SEBI?
Click here: శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?