ఇండియాలో 1+ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మొబైల్ నుంచి వచ్చే కొత్త అప్డేట్స్, వర్షెన్స్ కోసం వినియోగదారులు నిత్యం ఎదురుచూస్తూ ఉంటారు. కొత్తగా 1+ నార్డ్ ఎన్ 100, 1+ నార్డ్ ఎన్10 5జీ మొబైళ్లను సిద్ధం చేస్తోందీ సంస్థ. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లను సోమవారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. యూరోప్, అమెరికాలో వీటిని రిలీజ్ చేస్తారని సమాచారం. # 1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు? #
1+ నుంచి వచ్చిన మొబైల్స్‌లో ఇదే అత్యంత చౌకగా ఉంటుందని తెలుస్తోంది. 1+ నార్డ్ ఎన్100 ధర 199యూరోలు(రూ. 17,400) ఉంటుందని లీక్ అంచనా.
1+ నార్డ్ ఎన్100 ఫీచర్స్(అంచనా)?
1+ నార్డ్ ఎన్100… 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభించనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజెన్ ఓఎస్‌తో ఇది విడుదలకానుంది. డిస్ప్లే 6.52 ఇంచ్ హెచ్డీ+ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎమ్ఏహెచ్. ట్రిపుల్ రేర్ కెమెరా దీని సొంతం. ప్రైమరీ సెన్సర్‌కు 13 మెగా పిక్సెల్ ఉండొచ్చు. 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కమెరా ఉంటుంది. 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్పిన్ ఉండే అవకాశముంది.
నవంబర్ 10 తర్వాత నుంచి ఈ మొబైల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఫీచర్స్, విడుదల తేదీపై సంస్థ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Click here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?
Click here: ఈ మాట అంచున నిశ్శబ్దం