బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ!

bank loan

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం అందుబాటులో ఉన్నా, లేకున్నా కూడా రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. # బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ! #

ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది?

రూ.2 కోట్లు మించని విద్యా రుణాలు, గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు, MSME రుణాలు, consumer durable loansకు ఈ పథకం వర్తిస్తుంది.

సుప్రీం ఆదేశాలతో…

బ్యాంకు రుణాలపై మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వీలైనంత త్వరగా మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు రుణాల విషయంలో వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ) మాఫీ కానుంది. ఈ నిర్ణయం ఫలితంగా కేంద్రంపై రూ.6,500 కోట్లు మేరకు భారం పడనుంది.

మార్గదర్శకాలు

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, మారటోరియం కాలానికి, చక్రవడ్డీ నుంచి  సాధారణ వడ్డీని తీసివేయగా వచ్చిన మొత్తాన్ని, బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాలో జమ చేయాలి. బ్యాంకులపై పడిన ఈ భారాన్ని కేంద్రమే భరిస్తుంది.

కండిషన్స్ అప్లై అవుతాయ్‌!

ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రుణగ్రహీత ఖాతా నిరర్థక ఆస్తిగా ప్రకటించబడి ఉండకూడదు. అలాంటి రుణగ్రహీతలకు మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీ సౌలభ్యం  వర్తిస్తుంది.

ఇదీ చదవండి: జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు

ఇదీ చదవండి: జియో 5G ఫోన్‌ – అదిరిపోయే ప్లాన్‌!

READ THIS: HOW TO INVEST IN STOCK MARKET

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?