యావత్తు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ (DHARANI PORTAL) పారదర్శకంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ చరిత్రలోనే విప్లవాత్మక అడుగులు వేస్తూ అక్టోబరు25న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధరణి పోర్టల్ను ప్రారంభించారు. ఆరంభంలో కొన్ని బాలారిష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సాంకేతికంగా ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో సిద్ధమై సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. # ధరని పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో #
ధరణి ప్రజల దరికి చేరిన సందర్భంగా అసలు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే masterfm అందిస్తోంది ధరణి పోర్టల్ గురించి పూర్తి సమాచారం. పోర్టల్లో మూడు భాగాలున్నాయి 1. డాటా పోర్టల్ 2. పిటిషనర్ పోర్టల్ 3. డిపార్ట్మెంట్ పోర్టల్.
డాటా పోర్టల్
దీనిలో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూముల సమగ్ర సమాచారం పొందుపరిచారు. తద్వారా ప్రపంచలో ఎక్కడున్నా రాష్ట్రంలోని భూమి వివరాలు అరచేతిలో ఒక్క క్లిక్తో పొందవచ్చు.
పిటిషనర్ పోర్టల్
భూ యజమాని లేదా అమ్మకందారు, కొనుగోలుదారులు, వారసులు భూ లావాదేవీల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొత్తం ఈ విభాగంలో ఉంది. ఈ విభాగంలో స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ చెల్లించే వరకు అన్ని ఆప్షన్లూ ఉంటాయి.
డిపార్ట్మెంట్ పోర్టల్
తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు, ఇతర అధికారులకు మాత్రమే కనిపించే విభాగం ఇది. పిటిషనర్ చలాన్ చెల్లించిన తర్వాత దరఖాస్తు తహసీల్దారు కార్యాలయానికి చేరినప్పటి నుంచి హక్కు పత్తాలు కొనుగోలుదారు లేదా వారసుల చేతికి వచ్చే వరకు ప్రక్రియ అంతా ఈ పోర్టల్లోనే జరుగుతుంది.
స్లాట్ బుక్చేసుకోవడమెలా…?
ధరణి పోర్టల్ ఓపెన్ చేయగానే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అనే రెండు ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. అందులో మొదటిది అగ్రికల్చర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే పేజీలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నెంబర్ నమోదు చేయాగనే చరవాణికి పాస్వర్డ్ వస్తుంది. దానిని నమోదు చేయాలి. తర్వాత కింద ఉన్న ఖాళీలు నింపాలి. అక్షరాలు, క్యాప్చాను ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీ బటన్ క్లిక్ చేయాలి. వచ్చిన ఓటీపీని కింది గడుల్లో నింపాలి. ఓటీపీ నమోదు చేయాలగానే సిటిజన్ డ్యాష్బోర్టు పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఏడు ఆప్షన్లు కనిపిస్తాయి.
రిజిస్ట్రేషన్ కోసం
రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు మొదటి ఆప్షన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. వెంటనే పక్కన వచ్చే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎంచుకోవాలి. దానిలో మనకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి. చివరగా పట్టాదారు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫెచ్ బటన్ క్లిక్ చేయాలి. పీపీబీ నెంబర్పై ఆస్తి వివరాలు కనిపిస్తాయి. జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నెంబర్ తదితర పూర్తి వివరాలు వస్తాయి. ఆ భూమిలో ఎంతమేర బదలాయించుకుంటున్నారో వివరాలు నమోదు చేయాలి. ఒకేసారి ఒకటికి మించి సర్వే నెంబర్లు ఎంపిక చేసుకోవచ్చు. చివరగా ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయాలి.
సరిహద్దుల నమోదు తర్వాత వచ్చే ఫోర్ బౌండరీ డీటెయిల్స్లో అమ్మాల్సిన భూమికి నాలుగు దిక్కులా ఉన్న హద్దుల వివరాలు పేర్కొనాలి. సెల్లార్ వివరాల పేజీలో పట్టాదారు వివరాలు కనిపిస్తాయి. తర్వాత భూ యజమాని వివరాలు, చిరునామా కనిపిస్తుంది. చివరగా సేవ్ అండ్ కంటున్యూ క్లిక్ చేయాలి. తర్వాత కొనుగోలు చేసే వారి వివరాలు నింపాలి. తర్వాత పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్ సమ్మరీ పేజీలో రసీదును క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం నమోదు చేసిన పూర్తి వివరాలు కనిపిస్తాయి.
లావాదేవీలకు సంబంధించి ఎంత చెల్లించాలో కూడా చూపిస్తుంది. అన్నీ సరిచూసుకున్నాక ఎస్ ఆప్షన్ను క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ కి వెళ్లాలి.దానిలో అన్ని వివరాలు నమోదు చేసుకుని సరిచూసుకుని చలాన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ ఎంచుకుంటే గేట్వే వస్తుంది. దీనిని ఆన్లైన్లో లేదా ఫ్రింట్ తీసుకెళ్లి ఎస్బీఐ బ్యాంకులో నేరుగా సొమ్ము కట్టాలి.
సాక్ష్యుల వివరాలు పేమెంట్ చెల్లించిన తర్వాత మరలా ఫ్రీ రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లి విట్నెస్ వివరాలు నమోదు చేయాలి. కనీసం ఇద్దరు సాక్ష్యులుండాలి. తర్వాత డాక్యుమెంట్ డీటెయిల్స్లో అఫిడవిట్-1,2, ఫారం 60య61ను అప్లోడ్ చేయాలి. తర్వాత వరుసగా కనిపించే డాక్యుమెట్లు నింపాలి. అన్నీ సరిచూసుకున్నాక చివరగా స్లాట్ బుకింగ్ ఆప్షన్కు వెళ్తుంది. దీనిలో అన్ని వివరాలు కనిపిస్తాయి. పక్కన ఉన్న కాలెండర్లో తేదీ, సమయం ఖాళీగా ఉందో చూపిస్తుంది. మనకు అనువైన సమయం ఎంచుకుని బుక్స్లాట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
స్లాట్బుక్ అయిన తర్వాత ప్రింట్ రిసిప్ట్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. భూమి వివరాలన్నీ ఒకే చోట హోం పేజీలో అగ్రికల్చర్ ఆప్షన్ ఎంచుకున్నాక మొత్తం ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటిది స్లాట్బుకింగ్. మిగతావి రాష్ట్రంలోని భూముల వివరాలు తెలియజేస్తాయి. ఏయే రకం భూములు ఎంతమేర ఉన్నాయో కనిపిస్తుంది.
మీ భూమి వివరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు
భూమి వివరాలు
మీ భూమి వివరాలు తెలుసుకోవడం ఎలా..? రాష్ట్రంలో భూములున్నవారు ఎవరైనా ఇక్కడ తెలుసుకోవచ్చు. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్ ఆధారంగా భూమి వివరాలు కనబడతాయి. ప్రొహిబెటెడ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు నిషేదించిన భూములకు అనగా… దేవాదాయ. వక్ఫ్, అసైన్డ్, అటవీ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూముల వివరాలు ఇందులో ఉంటాయి.
ధరణి ఆపరేటర్ వివరాలు తనిఖీ చేసిన అనతరం తహసీల్దారు… కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలు, ఫొటోలు తనిఖీ చేస్తారు. ఒప్పందం ఆధరంగా కొత్త ఖాతాలు గాని… సర్వే నంబర్లను సృష్టిస్తారు. ఆ పత్రాలను డీఈవోకు పంపిస్తారు. అక్కడ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూమిపై హక్కు పత్రాలు యజమాని చేతికి వస్తాయి… ఇది ధరణి పోర్టల్ సమగ్ర స్వరూపం…
Click here for: DHARANI PORTAL
ఇదీ చూడండి: 1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు?