2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GST వార్షిక రిటర్నుల దాఖలకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు పెంచింది. డిసెంబర్ 31 వరకు GSTR-9, GSTR-9(C) రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది.
నిజానికి అక్టోబర్ 31తో GST రిటర్నుల గడువు ముగియాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల, లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఇంకా సాధారణ వ్యాపార పరిస్థితులు నెలకొనలేదని వ్యాపార వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. దీనితో GST రిటర్నుల గడువును మరో రెండు నెలల వరకు పెంచినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC) పేర్కొంది.
ఇదీ చదవండి: బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ