మనిషి ఏ పని చేసినా ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఆ ఫోన్కు కొంత రెస్ట్ ఇచ్చేది ఛార్జింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా.. ఛార్జింగ్ ఎప్పుడవుతుందని ఆ ఫోన్వైపు చూస్తూనే ఉంటారు. గంటలు గంటలు ఛార్జింగ్ అవుతుంటే విసుక్కుంటారు. అలాంటి కష్టాలను తొలగించేందుకు స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కొత్త మొబైల్ను ఆవిష్కరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుందట! # 5నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! #
200W
ఇటీవలే Xiaomi కొత్త స్మార్ట్ఫోన్కు సంబంధించిన కీలక వార్త బయటకువచ్చింది. ఈ కొత్త ఫోన్లో 200W fast charging సదుపాయం ఉండే అవకాశముంది. దీనికోసం Xiaomi కొత్త టెక్నాలజీని రూపొందిస్తోందట.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న MI 10 ULTRAలో 120W బ్యాటరీ ఉంది. అంటే 23నిమిషాల్లో ఈ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. 15 నిమిషాల్లోనే టార్గెట్ను రీచ్ అవ్వడానికి Xiaomi ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
విడుదల ఎప్పుడు?
వచ్చే ఏడాది ఓ foldable phone ని విడుదల చేస్తోంది Xiaomi. అందులో ఈ కొత్త టెక్నాలజీని యాడ్ చేసే యోచనలో Xiaomi ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇంత వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్లో ‘బ్యాటరీ లైఫ్’ పరిస్థితి ఏంటనేది వేచి చూడాల్సిందే.
– VISWA (WRITER)
Click here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?
Click here: ఈ Whatsapp toolను మీరు చూశారా?