పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా?

savings vs investments

హాయ్ ఫ్రెండ్స్ welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం పొదుపు చేయాలా? లేదా ఇన్వెస్ట్‌ చేయాలా? అనేది క్లారిటీగా తెలుసుకుందాం. # పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా? #

“ధనం మూలం ఇదం జగత్‌” 

ధనమే అన్నింటికీ మూలం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ధనముంటేనే మన ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని వారు తేల్చి చెప్పారు.

సరే మనం ప్రతి రోజూ ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాం. మరి ఆ చిన్న మొత్తంతోనే తన జీవిత అవసరాలు తీరిపోతాయా? మన కలలు నెరవేరిపోతాయా?

“కచ్చితంగా నెరవేరవు!” అని మన అంతరాత్మ చెబుతోంది కదా!  అందుకే మన భవిష్యత్ అవసరాల కోసం, మన కలలు నెరవేర్చుకోవడం కోసం “పొదుపు” చేయాలి. మరి పొదుపు చేస్తేనే సరిపోతుందా అంటే సరిపోదు. దాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మన కలలు నెరవేరుతాయి.

ఒక ఉదాహరణ చూద్దాం:-

రాము ఒక ప్రైవేటు ఉద్యోగి. అతని వయస్సు ప్రస్తుతం 30 ఏళ్లు. యాభై ఏళ్లకు రిటైర్‌ అయి, హాయిగా జీవితం గడపాలని అతని ఆలోచన. అందుకే అతను ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.20,000/- చొప్పున పొదుపు చేశాడు. ఇలా 20 ఏళ్లపాటు అతను పొదుపు చేశాడు.

(NOTE: ఇక్కడ లెక్క కోసం అతని జీతం స్థిరంగా ఉందని అనుకుందాం. అలాగే ప్రతి నెలా అతని ఖర్చులు, పొదుపు చేస్తున్న ధనం కూడా స్థిరంగానే ఉన్నాయని ఊహిద్దాం. – నిజానికి అలా ఉండదని మీకు బాగా తెలుసు.)

Scenario 1:

రాము ప్రతి నెలా రూ.20,000/- చొప్పున పొదుపు చేశాడు. (కానీ అతను ఆ డబ్బును ఎక్కడా invest చేయలేదు.)

దీని ప్రకారం, ప్రతి సంవత్సరం అతను పొదుపు చేసే ధనం రూ.2,40,000/-

అంటే 20 ఏళ్లకు రాము చేసిన మొత్తం పొదుపు రూ.48,00,000/- (అక్షరాల 48 లక్షల రూపాయలు) మాత్రమే!

Scenario 2:

రాము ప్రతి నెలా రూ.20,000/- చొప్పున 12 శాతం వడ్డీ వచ్చే ఓ స్కీమ్‌లో పొదుపు చేశాడు.

ఇలా అతను 20 ఏళ్లపాటు ఆ స్కీమ్‌లో తన డబ్బును పెట్టాడు.

20 ఏళ్ల తరువాత అతనికి రూ.1,99,82,958/- చేతికి అందాయి. అంటే సుమారు రూ.2 కోట్లు వచ్చాయి.

Scenario-1తో Scenario-2ని పోల్చి చూస్తే… రాము తాను పొదుపు చేసిన దాని కన్నా…. సరైన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సుమారుగా రూ.1.5 కోట్లు అదనంగా సంపాదించగలిగాడని స్పష్టంగా తెలుస్తోంది.

ఇన్వెస్ట్‌మెంట్ వల్ల కలిగే లాభాలు

కేవలం పొదుపు మాత్రమే చేయడం వల్ల మనం సంపాదించిన సొమ్ము idle గా ఉండిపోతుంది. అదే సొమ్మును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా wealth జనరేట్ అవుతుంది.

వెల్త్ క్రియేట్ కావడం వల్ల మీ short-term goals, long-term goals తప్పకుండా నెరవేరుతాయి.

ఉదాహరణకు మీరు సొంత ఇళ్లు, కారు కొందామనుకుంటే.. లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఆ కలను నిజం చేసుకోవచ్చు.

షార్ట్ టెర్మ్ గోల్స్… అంటే విహార యాత్రల ఖర్చులు, ఏటా మీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు లాంటి వాటిని కూడా ప్రోపర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారానే సంపాదించుకోవచ్చు.

After retirement life:

నేటి కాలంలో చాలా మంది పిల్లలు… వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను చూడడం లేదన్నది నిష్ఠుర సత్యం. కారణమేమైనా కావచ్చు… కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కనుక… వయసు మీద పడి, పని చేయలేని పరిస్థితుల్లోనూ.. మనం ఎవరిమీదా ఆధారపడకుండా గౌరవంగా జీవించగలుగుతాం.

ఇక్కడ సరైన ప్లాన్ అంటే… మనం డబ్బు సంపాదిస్తున్న సమయంలోనే… సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి. లేదా మంచి వడ్డీ ఇచ్చే సెక్యూర్డ్‌ స్కీమ్‌లో పొదుపు అయినా చేయాలి. అప్పుడు అది మనకు passive income సంపాదించిపెడుతుంది. రిటైర్ అయిన తరువాత ఆ డబ్బే మనం ఎవరిపైనా ఆధారపడకుండా.. గౌరవప్రదంగా జీవించేందుకు దోహదం చేస్తుంది.

ఎమర్జెన్సీ సమయంలో కాపాడుతుంది!

జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. Medical emergency వస్తే, సమయానికి చేతిలో డబ్బులేకపోతే… ఆ కష్టం వర్ణించలేనిది.

అలాగే సడన్‌గా అమ్మాయి పెళ్లి కుదిరింది అనుకుందాం. చేతిలో డబ్బు లేకపోతే ఎలా?

ఇలాంటి సమయంలోనే మనం పొదుపు చేసిన లేదా ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనకు అక్కరకు వస్తుంది.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించి..

Inflation వల్ల రోజురోజుకూ వస్తు, సేవల ధరలు పెరిగిపోతున్నాయి. అంటే భవిష్యత్‌లో మనం సంపాదించిన ధనం విలువ కంటే… వస్తువుల విలువ ఎక్కువ అయిపోతుంది. కనుక భవిష్యత్ అవసరాల కోసం… ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మనం హాయిగా జీవించడం కోసం సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

TAX burden తగ్గించుకునేందుకు

సరైన financial instrumentsలో పెట్టుబడి పెడితే టాక్స్ బర్డన్‌ కూడా బాగా తగ్గించుకోవచ్చు.

The income tax act, 1961 అనేది టాక్స్ ప్లానింగ్‌ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఈ యాక్ట్‌లోని సెక్షన్ 80C మన ఇన్వెస్ట్‌మెంట్‌పై కట్టాల్సిన టాక్స్‌ను న్యాయబద్ధంగా తగ్గించుకోవడానికి ఉపకరిస్తుంది.

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్ స్కీమ్‌ (ELSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), యూనిట్ లింక్డ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ (ULIPs) లాంటి వాటి ద్వారా కూడా టాక్స్ సేవ్ చేసుకోవచ్చు.

మిత్రులారా! చూశారు కదా! మరెందు ఆలస్యం, ఇప్పుడే పొదుపు చేయడం ప్రారంభించండి. వాటిని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోండి.

Note: స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందువల్ల stock market బేసిక్స్ తెలుసుకోండి. ఫండమెంటల్ అనాలసిస్, టెక్నికల్ అనాలసిస్‌ చేయడం నేర్చుకోండి. ఏది ఏమైనా ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని డాక్యుమెంట్లు పూర్తిగా చదవి, అర్థం చేసుకోండి. పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా మీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి.

Click here: stock market trading – Do’s and Don’ts

Click here: మ్యాజిక్‌ నంబర్‌ 72 గురించి తెలుసా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?