షేర్ మార్కెట్/స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి?
What is the share market/ stock market? సింపుల్‌గా చెప్పాలంటే షేర్ల క్రయవిక్రయాలు జరిగే ప్రదేశమే షేర్ మార్కెట్.
షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఒక్కటేనా?
స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్‌లు చూడడానికి ఒక్క మాదిరిగానే ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది.
షేర్ మార్కెట్‌లో కేవలం షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతాయి. అదే స్టాక్ మార్కెట్‌లో అయితే షేర్లతో సహా బాండ్స్, డెరివేటివ్స్, మ్యూచ్‌వల్ ఫండ్స్ లాంటి fInancial instruments కూడా ట్రేడ్ అవుతాయి.
What are the stock exchanges?
స్టాక్ ఎక్స్ఛేంజిలు అంటే ఏమిటి?
స్టాక్ ఎక్స్ఛేంజి అనేది కంపెనీల స్టాక్స్, ఇతర సెక్యూరిటీల క్రయవిక్రయాలకు ఒక ప్రాథమిక వేదిక.
స్టాక్ ఎక్స్ఛేంజిల్లో నమోదైన స్టాక్‌లను మాత్రమే కొనడానికి లేదా అమ్మడానికి వీలవుతుంది. సులువుగా అర్థం చేసుకోవాలంటే… ఈ స్టాక్ ఎక్స్ఛేంజిల్లోనే Buyers మరియు Sellers స్టాక్‌ల క్రయవిక్రయాలు జరుపుతుంటారు.
BSE, NSE
భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజిలు:
మీకు తెలుసా! భారతదేశంలో BSE, NSEలతో సహా 23 స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉన్నాయి.
ఉదాహరణకు:
- Hyderabad stock exchange, Hyderabad
- Delhi stock exchange, Delhi
- Metropolitan stock exchange of India
- National stock exchange, Mumbai
- Calcutta stock exchange, Kolkata
ఇలా 23 స్టాక్ ఎక్స్ఛేంజిలు భారత్‌లో ఉన్నాయి.
TYPES OF SHARE MARKET
ప్రధానంగా రెండు రకాల మార్కెట్లు ఉన్నాయి. అవి:
- ప్రైమరీ మార్కెట్ (Primary market)
- సెకండరీ మార్కెట్ (Secondary market)
Primary market (ప్రైమరీ మార్కెట్)
ఒక సంస్థ తన అభివృద్ధికి/అవసరాలకు కావాల్సిన మూలధనాన్ని సేకరించేందుకు ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. దీనినే స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్ట్ కావడం అంటారు.
స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్ట్ అయిన సంస్థ/కంపెనీ మొదటిసారి తన షేర్లను విక్రయానికి పెట్టడాన్ని IPO (Initial Public Offering) అంటారు. దీని ద్వారా investors నేరుగా కంపెనీ షేర్లు కొనుక్కోగలుగుతారు.
Secondary market (సెకండరీ మార్కెట్)
ఇన్వెస్టర్లు ప్రైమరీ మార్కెట్‌లో IPO ద్వారా కొనుకున్న షేర్లను, సెకండరీ మార్కెట్‌లో లాభానికి/ నష్టానికి గానీ విక్రయిస్తారు. వీటిని వేరే ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తారు. వారు వాటిని అమ్మవచ్చు లేదా మరిన్ని కొనుక్కోవచ్చు. అంటే ఇన్వెస్టర్లు తమలో తాము షేర్ల క్రయవిక్రయాలు జరుపుకుంటారు. అయితే క్రయవిక్రయాల్లో షేర్లను జారీ చేసిన కంపెనీ ఎలాంటి జోక్యం చేసుకోదు.
దీనిని సులువుగా అర్థం చేసుకోవాలంటే, ఈ ఉదాహరణ చూడండి.
Abc అనే ఒక సంస్థ ఉంది అనుకుందాం. ఆ సంస్థ మరింతగా అభివృద్ధి చెందాలని నిర్ణయించింది. అయితే అందుకు కావాల్సిన ధనం దాని వద్ద లేదు. అందుకే ఆ సంస్థ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఓ స్టాక్ ఎక్స్ఛేంజిలో నమోదైంది.
తరువాత ఆ సంస్థ IPO (Initial Public Offering) ద్వారా కొంత మొత్తం షేర్లను నేరుగా ఇన్వెస్టర్లకు విక్రయించి ధనాన్ని సేకరించింది. ఇదంతా ప్రైమరీ మార్కెట్‌లో మాత్రమే జరుగుతుంది.
ఇకపై Abc సంస్థ షేర్ల క్రయవిక్రయాలు కేవలం సెకండరీ మార్కెట్‌లో మాత్రమే జరుగుతాయి. అంటే IPO ద్వారా షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లు, వాటిని లాభానికి గానీ/నష్టానికిగానీ ఇతర ఇన్వెస్టర్లకు అమ్ముతారు. ఇలా కొనుకున్నవారు ఆ షేర్లను మరొకరికి అమ్మవచ్చు లేదా మరిన్ని కొనవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సెకండరీ మార్కెట్‌లో జరిగే క్రయవిక్రయాల్లో Abc సంస్థ ఎలాంటి జోక్యం చేసుకోదు.
భారత స్టాక్ మార్కెట్‌లోని స్టాక్ బ్రోకర్లు
భారతదేశంలో షేర్ల క్రయవిక్రయాలు నేరుగా చేయలేము. సాధారణంగా స్టాక్ బ్రోకర్ల లాంటి మధ్యవర్తుల ద్వారా మాత్రమే ఈ లావాదేవీలు నిర్వహించగలుగుతాం. ఈ బ్రోకరేజీ సంస్థలు అందించే సేవలు, వాటికయ్యే రుసులు వేర్వేరుగా ఉంటాయి.
భారతదేశంలోని ప్రముఖ స్టాక్ బ్రోకర్లు (Stock brokers) :
- Zerodha
- Angel Broking
- Motilal Oswal
- ICICI direct
- HDFC securities
- Kotak securities
ఇలా చాలా బ్రోకరేజీ సంస్థలు ఉన్నాయి. stock market/ share market గురించి మంచి అవగాహన వచ్చిన తరువాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ రిస్కుతో కూడుకుని ఉంటుంది. కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు కచ్చితంగా సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.
NEXT CHAPTER : HOW TO INVEST IN STOCK MARKET?/ స్టాక్ మార్కెట్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి?
PREVIOUS CHAPTER: Basics of the Stock market for beginners