What is the right time to start investing?

right time to invest?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం ఇన్వెస్టింగ్ ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసుకుందాం. # What is the right time to start investing? #

 ‘The best time to invest was yesterday. The next best time is now.’ ప్రసిద్ధమైన ఈ నానుడి గురించి మీరు వినే ఉంటారు.

దీని అంతరార్థం ఏమిటంటే.. “మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి” అని.

చెప్పడానికి ఇది సింపుల్‌గానే ఉన్నా… దీనిని ఆచరించడం అంత సులువు కాదు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది.

ఉదాహరణకు ఇప్పటికే మీకు పీకల్లోతు అప్పులు ఉన్నాయనుకోండి. ఆ అప్పులు తీర్చడమే మీ మొదటి ప్రాధాన్యం అవుతుంది. అలా కాకుండా మీకు మంచి ఆదాయం వస్తూ… పొదుపు చేయడానికి… పెట్టుబడులు పెట్టడానికి వీలవుతోంది అనుకోండి. వెంటనే మీరు సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.

వీలైనంత త్వరగా..

మనలో చాలా మందికి ఉండే ఒక అపోహ ఏమిటంటే… ‘ఇన్వెస్టింగ్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది’ అని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మీ దగ్గర ఉన్న చాలా చిన్న మొత్తం సొమ్ముతోనే క్రమం తప్పకుండా ఇన్వెస్టింగ్ ప్రారంభించవచ్చు.

ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే… మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది కాదు.. ఎంత త్వరగా ఇన్వెస్టింగ్ ప్రారంభించారన్నదే.

దీనిని సులువుగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం!

రమేష్‌, సురేష్‌ అనే ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు. రమేష్‌ వయస్సు 25 సంవత్సరాలు. సురేష్ వయస్సు 35 సంవత్సరాలు. ఇద్దరూ తమ 55వ ఏట రిటైర్ అయి హాయిగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వారు ఇప్పటి నుంచే ఇన్వెస్టింగ్ చేయడం ప్రారంభించారు.

రమేష్ పరిస్థితి:

25 ఏళ్ల రమేష్‌ ఇప్పటి నుంచే ప్రతి నెలా రూ.10,000 చొప్పున 12 శాతం వడ్డీ వచ్చే స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు.

ఇలా క్రమంతప్పకుండా 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేశాడు. ఫలితంగా రిటైర్ అయ్యే నాటికి అతనికి రూ.3,52,99,138 సమకూరింది. అంటే సుమారుగా రూ.3.5 కోట్లు అతని చేతికి అంది వచ్చాయి.

సురేష్ పరిస్థితి:

సురేష్ తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. అయితే రమేష్‌లా కాకుండా ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఇన్వెస్ట్ చేశాడు.

ఇలా 20 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేశాడు. ఫలితంగా రిటైర్ అయ్యే నాటికి అతని చేతికి రూ.1,99,82,958 అందాయి. అంటే సుమారు రూ.2 కోట్లు మాత్రమే అతనికి సమకూరాయి.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే… రమేష్‌ కంటే సురేష్ రెట్టింపు డబ్బును ఇన్వెస్ట్ చేశాడు. కానీ లేట్‌గా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించడం వల్ల…. రమేష్‌ కంటే చాలా తక్కువ డబ్బు మాత్రమే సంపాదించగలిగాడు.

ఈ ఉదాహరణను బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే.. “మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి” అని.

NOTE: ఇన్వెస్టింగ్ అనేది Onetime affair కాదు. మనం చాలా చిన్న మొత్తం సొమ్ముతో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించినా ఫర్వాలేదు. కానీ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మన గోల్స్‌ను రీచ్‌ కాగలుగుతాము. కలలు నెరవేర్చుకోగలుగుతాం.

NOTE: ఇన్వెస్టింగ్ ప్రారంభించే ముందు ఒక కీలక విషయం గుర్తించుకోండి. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో లేదా అధిక లాభం వస్తుందనే ఆశతో తప్పుడు మార్గాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామంటూ ఇచ్చే మోసపూరిత ప్రకటనలు చూసి మభ్యపడవద్దు. మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకుని సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి.

Click here: పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా?

Click here: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?