సెబీ అంటే ఏమిటి? అది ఏమి చేస్తుంది?
సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా)ని 1988లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. SEBI Act of 1992 ద్వారా ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా అవతరించింది. మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ దీని ముఖ్య విధి.
STOCK MARKETలో పెట్టుబడులు పెట్టడం కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. అందువల్ల పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు సెబీ లాంటి ఓ నియంత్రణ సంస్థ ఉండటం అవసరం.
సెబీ ప్రాథమిక లక్ష్యాలు:
- పెట్టుబడిదారుల ప్రయోజనాలు పరిరక్షించడం
- స్టాక్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం
- స్టాక్ మార్కెట్‌ను నియంత్రించడం
హెచ్చరిక:
ఎవరో చెప్పారని, స్టాక్ మార్కెట్ బేసిక్స్‌పై సరైన అవగాహన లేకుండా, పెట్టుబడులు పెడితే మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్వయంగా మీకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. అలాగే పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
PREVIOUS CHAPTER: WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?
Start From Scratch: Basics of the stock market for beginners