డీలిస్టింగ్ అంటే ఏమిటి?

what is delisting?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm.

ఈ ఆర్టికల్‌లో మనం డీలిస్టింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ డీలిస్టింగ్ ప్రభావం మదుపరులపై ఎలా ఉంటుందో కూడా చర్చిద్దాం.

ఒక కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజిలో నమోదు కావడాన్ని లిస్టింగ్ అంటారు. దీనికి రివర్స్‌లో అంటే… స్టాక్ ఎక్స్ఛేంజిలో ఒక కంపెనీకి చెందిన షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేయడాన్ని డీలిస్టింగ్ అంటారు.

డీలిస్టింగ్ రెండు రకాలు:

  1. Voluntary delisting
  2. Compulsory delisting

Voluntary delisting:

ఒక కంపెనీ voluntaryగా స్టాక్ ఎక్స్ఛేంజి నుంచి తన షేర్లను డీలిస్ట్‌ చేయవచ్చు. దీనికి ఆ కంపెనీకి సంబంధించిన విలీనాలు, కొనుగోళ్లు లేదా ప్రమోటర్ల నిర్ణయం… ఇలా ఏదైనా కారణం కావచ్చు.

ఒక కంపెనీ తన షేర్లను డీలిస్టు చేసే అవకాశం పొందాలంటే… ఏదైనా స్టాక్‌ ఎక్స్ఛేంజిలో లిస్ట్‌ అయి కనీసం మూడేళ్లపాటు ట్రేడింగ్ చేసి ఉండాలి. లేకుంటే వాటిని డీలిస్టింగ్‌ చేయడానికి కుదరదు.

బోర్డు సమావేశంలో వాటాదార్ల అనుమతితో voluntary delisting ప్రక్రియ మొదలవుతుంది. తరువాత మర్చెంట్ బ్యాంకర్‌ను నియమించి స్టాక్ ఎక్స్ఛేంజి నిబంధనలు పాటిస్తూ డీలిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Compulsory delisting:

స్టాక్ ఎక్స్ఛేంజీలు… నిబంధనలను పాటించని కంపెనీలను డీలిస్టింగ్ చేయడాన్ని compulsory delisting అంటారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీ పత్రికా ప్రకటన ఇస్తుంది. ఈ విధానంలో స్టాక్ ఎక్స్ఛేంజి నియమించిన నిపుణులు సంబంధిత కంపెనీకి చెందిన షేరు ధరను లెక్కగడతారు. ఈ ధర ప్రకారం… మదుపరులు తమ షేర్లను ప్రమోటర్లకు విక్రయించి నగదు పొందవచ్చు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కనీసం ఒక్క ఎక్స్ఛేంజిలోనైనా షేర్లు నమోదై ఉంటే… మదుపర్ల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రమోటర్లకు ఉండదు.

Compulsory delisting ఎప్పుడంటే..
  1. లిస్టింగ్ నిబంధనలను కనీసం ఆరు నెలలపాటు పాటించనప్పుడు
  2. గత కొంతకాలంగా షేర్ల కనీస ట్రేడింగ్ పరిమాణం నమోదుకానప్పుడు
  3. కంపెనీ ప్రమోటర్ల, డైరెక్టర్ల ట్రాక్ రికార్డ్ మంచిగా లేనప్పుడు
  4. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు, అవకతవకలకు పాల్పడినప్పుడు
  5. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేసినప్పుడు
  6. మోయలేని రుణభారంతో కనీస వ్యాపార కార్యక్రమాలు చేయలేని స్థితిలో కంపెనీ ఉన్నప్పుడు compulsory delisting చేస్తారు.
ధర ఎలా నిర్ణయిస్తారంటే..
  • ట్రేడింగ్ జరిగే షేర్లకు 26 వారాల సరాసరి (వెయిటెడ్ ఏవరేజ్‌) ధరను లెక్కిస్తారు. దీనికి ఎక్కువ పరిమాణంలో ట్రేడింగ్ జరుగుతున్న స్టాక్‌ ఎక్స్ఛేంజిని ఎంచుకుంటారు.
  • ట్రేడింగ్ జరగని షేర్లకు ఆడిటర్లు SEBI నిబంధనల ప్రకారం ధరను నిర్ణయిస్తారు.
  • తరువాత మదుపర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ టెండర్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది.
  • ఇన్వెస్టర్లు రివర్స్ బుక్ బిల్డింగ్ పద్ధతి ప్రకారం బిడ్లు దాఖలు చేస్తారు.
  • లావాదేవీలు పారదర్శకంగా జరిగేందుకు ఎస్క్రో అకౌంట్ ద్వారా లావాదేవీలు జరుపుతారు.
  • ప్రమోటర్లు ఆఫర్ ప్రకటించిన తరువాత ఎస్క్రో అకౌంట్‌లో నిర్ణయించిన ధర ప్రకారం నిధులను లెక్కించి వాటిని ఆ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
  • ఆఫర్ విజయవంతంగా పూర్తయితే ఇన్వెస్టర్లకు వారి షేర్లకు సరిపడా నగదు వారి ఖాతాలో జమ అవుతుంది.

SEBI డీలిస్టింగ్ నిబంధనల ప్రకారమే ఈ వ్యవహారమంతా జరుగుతుంది.

రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రక్రియలో పాల్గొనని మదుపరులకు…. తమ వాటాలను ప్రమోటర్లకు విక్రయించే అవకాశం ఉంటుంది. బిడ్డింగ్ ప్రక్రియలో ఖరారైన ధరకు… డీలిస్టింగ్ ముగిసిన తేదీ నుంచి ఏడాది వరకు ఈ అవకాశం ఉంటుంది.

తిరిగి లిస్ట్ కావాలంటే

స్టాక్ ఎక్స్ఛేంజి నుంచి ఒకసారి డీలిస్టింగ్ అయిన కంపెనీ తిరిగి లిస్ట్ కావాలంటే 5 నుంచి 10 సంవత్సరాల తరువాత మాత్రమే అవకాశం ఉంటుంది. Voluntary delistingకు వెళ్లిన కంపెనీలు తిరిగి లిస్ట్ అయ్యేందుకు కనీసం 5 ఏళ్లు, compulsory delistingకు వెళ్లిన కంపెనీలు తిరిగి లిస్ట్ అయ్యేందుకు కనీసం 10 ఏళ్లు ఆగాల్సిందే.

Click here: మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?

Click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?