IPO అంటే ఏమిటి?

WHAT IS IPO?

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం IPO అంటే ఏమిటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే.. సంస్థలు తొలిసారిగా ప్రజల నుంచి నిధులు సేకరించేందుకు, జారీచేసే పబ్లిక్ ఆఫర్‌ను IPO అంటారు.

నిజానికి సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన నిధులు సమీకరించేందుకు Initial Public Offer (IPO)ను జారీచేస్తాయి. కొన్ని సందర్భాల్లో అప్పటికే కొనసాగుతున్న మదుపర్ల షేర్లను విక్రయించేందుకు కూడా IPOను జారీ చేస్తూ ఉంటాయి.

కంపెనీలు ఎందుకు IPOకి వస్తుంటాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ సంస్థలు ఏయే పద్ధతుల్లో షేర్లను మదుపరులకు జారీ చేస్తాయో తెలుసుకుందాం.

ఒక సంస్థలో ప్రమోటర్లకు ఉండాల్సిన కనీస వాటా గురించి కొన్ని నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలతో పాటు అన్ని నిబంధనలు కూడా కచ్చితంగా పాటించిన కంపెనీలకు మాత్రమే పబ్లిక్ ఆఫర్‌కు వెళ్లేందుకు అర్హత ఉంటుంది.

డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్‌:

IPOకి వెళ్లాలనుకున్న సంస్థలు దానికి సంబంధించిన పూర్తి వివరాలతో డ్రాఫ్ట్‌ ఆఫర్ డాక్యుమెంట్‌ను రూపొందించి, దానిని SEBIకి పంపిస్తాయి. సెబీ ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించి, అన్ని విషయాలు సంతృప్తికరంగా ఉంటే, ఆమోదం తెలుపుతుంది. SEBI ఆమోదం తెలిపాక దాన్ని ఆఫర్ డాక్యుమెంట్‌గా పరిగణిస్తారు.

సంస్థ ఈ ఆఫర్ డాక్యుమెంట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజిలకు, ఇష్యూ రిజిస్ట్రార్‌కు పంపిస్తుంది. అవి కూడా దీనికి ఆమోదం తెలిపితే… కంపెనీ దాన్ని రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్‌గా మదుపరులకు అందుబాటులోకి తీసుకొస్తుంది.

IPOకి దరఖాస్తు చేసే విధానం

మదుపరులు IPOకి దరఖాస్తు చేయాలనుకుంటే, ముందుగా వారి స్టాక్ బ్రోకర్‌ను సంప్రదించి తగిన విధంగా దరఖాస్తు నింపాలి. ప్రస్తుతం online, offlineల్లోనూ IPOకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

IPOలో షేరు ధరను ఎలా నిర్ణయిస్తారు?

IPOలో షేరు ధరను నిర్ణయించేందుకు, సంస్థలు రెండు పద్ధతులను అనుసరిస్తూ ఉంటాయి. అవి:

  1. Book Building Method
  2. Fixed Pricing Method
బుక్ బిల్డింగ్‌ పద్ధతి

ఈ పద్ధతిలో కొంత పరిధిలో షేరు ధరను నిర్ణయిస్తారు. ఆ పరిధిలోనే మదుపరులు తమకు నచ్చిన ధరకు దరఖాస్తు చేస్తారు. ఇష్యూకు వచ్చిన డిమాండ్‌ ప్రకారం చివరిగా ధర నిర్ణయించబపడుతుంది. ఆ ధరకు దరఖాస్తు చేసిన మదుపర్లకు మాత్రమే నిబంధనల ప్రకారం షేర్లు కేటాయించబడతాయి.

Fixed Pricing Method

ఈ పద్ధతిలో IPO ఆఫర్ చేస్తున్నప్పుడే ఒక ధరను నిర్ణయిస్తారు. డిమాండ్‌ను అనుసరించి దరఖాస్తు చేసిన మదుపరులకు, నిబంధనల మేరకు షేర్లు కేటాయిస్తారు.

ఐపీఓ గురించి మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ చూద్దాం:

Xyz అనే కంపెనీ IPO జారీ చేసింది అనుకుందాం. అప్పుడు అది లాట్‌ సైజును, షేర్‌ ధర పరిధిని నిర్ణయిస్తుంది. బుక్‌ బిల్డింగ్ పద్ధతిలో షేర్ ధరను కొంత పరిధి మేరకు నిర్ణయిస్తారు. కనుక మదుపరులు ఆ పరిధిలోనే తమకు నచ్చిన ధరకు దరఖాస్తు చేసుకుంటారు. ఉదాహరణకు కంపెనీ షేర్‌ ధర రూ.100- రూ120 మధ్య ఉంటే, మదుపరులు వాటి మధ్యలోని ఏదో ఒక ధరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే… రిటైల్ మదుపరులు ధరను వేయకుండా కటాఫ్ ధరను ఎంచుకునే అవకాశం ఉంది. మదుపరులు ఈ కటాఫ్ ధరను ఎంచుకోవడం ద్వారా ఇష్యూలో చివరగా నిర్ణయించిన ధరకు షేర్లు కొనేందుకు అంగీకరించినట్లు అవుతుంది.

IPO దరఖాస్తు గడువు

IPO ప్రారంభ, ముగింపు తేదీలను ముందుగానే ప్రకటిస్తారు. కనుక నిర్ణీత గడువులోగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సెబీ నిబంధనల ప్రకారం, IPO కనీసం మూడు రోజులపాటు అందుబాటులో ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రోజులకు మించకూడదు.

బుక్ బిల్డింగ్ పద్ధతిలో అయితే IPO…… 3 నుంచి 7 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ధర పరిధిలో మార్పులు చేస్తే… అదనంగా మరో మూడు రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుంది.

షేర్ల కేటాయింపు ఎలా?

ఇష్యూ బిడ్డింగ్ ముగిసిన రోజు (T) నుంచి 5 రోజుల్లో (trading day+ 5 days) లోగా మదుపరుల Demat Accountలోకి షేర్లు బదిలీ చేయాల్సి ఉంటుంది.

రీఫండ్‌:

IPOలో షేర్ల కేటాయింపు జరగకపోతే… మదుపరి డిపాజిట్‌ చేసిన సొమ్మును తిరిగి అతనికి చెల్లిస్తారు. దీనిని RTGS, ECS, NEFT ద్వారా మదుపరి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఇవేమీ లేకుంటే, సాధారణ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డబ్బును రీఫండ్ చేస్తారు.

లిస్టింగ్

SEBI నిబంధనల ప్రకారం, ఇష్యూ ముగిసిన T+6 daysలో సంబంధిత కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజిల్లో లిస్టింగ్ చేయాల్సి ఉంటుంది*.

మదుపరులు ఏమి చేయాలి?

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారం కనుక మదుపరులు చాలా అప్రమత్తంగా ఉండాలి.

IPO జారీ చేసిన కంపెనీ ఏ రంగానికి చెందిందో, దాని ఆర్థిక పరిస్థితి ఏమిటో, దాని భవిష్యత్‌ అభివృద్ధి ఎలా ఉండబోతోందో ఓ అంచనాకు రావాలి.

అలాగే కంపెనీ ఎందుకు నిధులు సమీకరించాలనుకుంటోంది. ప్రమోటర్ల వాటా ఎంత, రిటైలర్లకు ఎంత కేటాయిస్తున్నారు లాంటి అంశాలను పరిశీలించాలి. సాధారణంగా ప్రమోటర్ల వాటా ఎక్కువగా ఉంటే మంచిది.

ఏది ఏమైనా, IPO ద్వారా షేర్లు కొనే ముందు కంపెనీ ఆఫర్ డాక్యుమెంట్‌ను కచ్చితంగా చదవాలి. Fundamental and Technical analysis చేయాలి. కచ్చితంగా మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోవాలి.

ఫిర్యాదు ఎలా?

IPO తరువాత షేర్ల జారీ విషయంలో జాప్యం, రీఫండ్ రాకపోవడం లాంటివి జరిగితే, వెంటనే సంబంధిత కంపెనీ ఫిర్యాదుల స్వీకరణ అధికారిని సంప్రదించాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఆలస్యం చేయకుండా, SEBIకి ఫిర్యాదు చేయాలి.

Click here: Bull Market, Bear Market అంటే ఏమిటి?

Click here: WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK                          MARKET?

 

 

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?