UPSC CAPF JOB NOTIFICATION

సాయుధ బలగాల్లో 209 అసిస్టెంట్ కమాండ్‌ పోస్టులు

యూపీఎస్‌సీ ఏటా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అసిస్టెంట్‌ కమాండెంట్స్ పరీక్ష విధానంలో ఎంపికైనవారు కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వహిస్తారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పోస్టులకు రూపొందించడం జరిగింది. # UPSC CAPF JOB NOTIFICATION #

వీరికి గ్రూప్‌-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. అంటే సివిల్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ)తో సమానమైన హోదా కలిగిన పోస్టులివి.

25 ఏళ్లలోపు పట్టభద్రులైన యువత ఈ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు కూడా ఈ పరీక్ష రాయవచ్చు.  ఎంపికైనవారు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్ (CAPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CRPF),

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఫోర్స్ (ITBP), సశస్త్ర సీమా బల్‌ (SSB)లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరు సంబంధిత విభాగంలో అడిషనల్‌ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది.

రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపినవారిని ఉద్యోగం వరిస్తుంది.

 CAPF పోస్టుల వివరాలు

  • మొత్తం పోస్టులు: 209
  • వీటిలో BSF – 78, CRPF – 13, CISF – 69, ITBP – 27, SSB – 22 పోస్టులు ఉన్నాయి.
  • అర్హత:  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • వయస్సు:  01 ఆగస్టు 2020 నాటికి 20 నుంటి 25 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయో పరిమితిలో మూడేళ్ల వరకు సడలింపు ఇచ్చారు.
  • ఆన్‌లైన్ దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫీజు:  మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలినవారు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • పరీక్ష తేదీ: డిసెంబర్ 20.
  • పరీక్ష కేంద్రాలు:  తెలుగు రాష్ట్రాల్లో అయితే… హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి.

ఎంపికైన అభ్యర్థులకు:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంబంధిత విభాగాన్ని అనుసరించి ఏడాది పాటు శిక్షణనిస్తారు. శిక్షణ అనంతరం ఆయా విభాగాల్లో వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరికి (లెవెల్ 10) రూ.50,100 మూలవేతనం అందుతుంది. DA, HRA, అలవెన్సులు కలుపుకుంటే… మొదటి నెల నుంచే వీరు దాదాపు ఒక లక్ష రూపాయల వేతనం పొందుతారు. దీనితోపాటు చాలా తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది.

పూర్తి వివరాల కోసం www.upsc.gov.in, www.upsconline.nic.inలను చూడండి.

ఇదీ చూడండి: APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ వాయిదా

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?