The key players in the stock market

the key players in the stock market

స్టాక్‌ మార్కెట్ బేసిక్స్‌లో భాగంగా మనం కీ ప్లేయర్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే SEBI గురించి చర్చించాం. ఇప్పుడు మిగతా కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.# The key players in the stock market #

డిపాజిటరీలు (Depositories)

డిపాజిటరీ అనేది మీ స్టాక్స్‌ యొక్క డీ మెటీరియలైజ్డ్‌ షేర్‌ సర్టిఫికేట్లను ఓప్రత్యేక ఖాతాలో స్టోర్‌ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆ ప్రత్యేకమైన ఖాతానే Demat account అంటారు. ఇందులోనే మీ యొక్క షేర్ సర్టిఫికేట్లు ఎలక్ట్రానిక్ ఫార్మెట్‌లో భద్రంగా ఉంటాయి. # The key players in the stock market #

ప్రస్తుతం భారతదేశంలో రెండు డిపాజిటరీలు పనిచేస్తున్నాయి. అవి

  1. నేషనల్ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (NSDL)
  2. సెంట్రల్ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (CDSL)

Depository participants

డిపాజిటరీ పార్టిసిపెంట్‌ (DP) ఒక రిజిస్టర్డ్ ఏజెంట్‌. అతను మీకు, డిపాజిటరీకి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తాడు. ఒక ఇన్వెస్టర్‌గా, మీరు డిపాజిటరీతో నేరుగా Demat account ఓపెన్‌ చేయలేరు. దీనికి కచ్చితంగా డిపాజిటరీ పార్టిసిపెంట్‌ (DP) మధ్యవర్తిత్వం ఉండాలి. వీరి ద్వారానే మీ అన్ని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది.

స్టాక్‌ బ్రోకర్లు (stock brokers)

స్టాక్ మార్కెట్‌లో ప్రధాన పాత్ర స్టాక్ బ్రోకర్లది. ఈ స్టాక్‌ బ్రోకింగ్ సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజిలలో ట్రేడింగ్ సభ్యులుగా నమోదు అవుతాయి. సాధారణంగా అవి మీ లాంటి ఇన్వెస్టర్లకు/ ట్రేడర్లకు మరియు ఎక్స్ఛేంజిలకు మధ్య లింక్‌గా పనిచేస్తాయి. # The key players in the stock market #

బ్రోకరేజీ సంస్థలకు ఉదాహరణ:

ICICIDirect, Upstox, ఏంజెల్ బ్రోకింగ్, కోటక్ సెక్యూరిటీస్, షేర్‌ఖాన్‌ లాంటివి.

స్టాక్‌ మార్కెట్‌లో మీరు షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా.. కచ్చితంగా ఓ స్టాక్‌ బ్రోకర్‌ వద్ద ట్రేడింగ్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది.

ఈ ట్రేడింగ్ అకౌంట్… మీరు స్టాక్స్‌ లేదా ఏదైనా కంపెనీ సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి వీలుకల్పిస్తుంది. అయితే ఇలాంటి లావాదేవీలకు గాను స్టాక్‌బ్రోకర్లు కొంత ఫీజు వసూలు చేస్తారు. దీనినే బ్రోకరేజ్‌ అంటారు.

Investors and Traders

స్టాక్‌ మార్కెట్‌లో మీరు వర్తకం చేసినట్లుగానే, అనేక మంది ఇతర ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఈ వ్యక్తిగత పెట్టుబడిదారులతో పాటు అనేక సంస్థలు కూడా స్టాక్స్‌ కొనుగోలు, అమ్మకాలను చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాయి.

Institutional investors (సంస్థాగత పెట్టుబడిదారులు)

ఇక్కడ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ సంస్థలుగా మనం గుర్తించాలి. అయితే వీటిని టెక్నికల్‌గా institutional investors (సంస్థాగత పెట్టుబడిదార్లు)గానే పిలుచుకుంటాం. వీరు ఆర్థికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. కాబట్టి వీరు స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేయగలిగే పరిస్థితులు కూడా ఉంటాయి.

అయితే జాతీయత ఆధారంగా ఈ సంస్థాగత పెట్టుబడిదారులను 2 కేటగిరీలుగా వర్గీకరించారు.

  1. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs)
  2. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs)

Domestic AMCs

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCs) క్లయింట్ల నుంచి నిధులు సేకరించి, వాటిని ఫైనాన్సియల్ మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడుతుంటాయి.

ఈ Domestic AMCsకి మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు కూడా ఉంటాయి. ఉదాహరణకు ప్రుడెన్షియల్‌ మ్యూచువల్ ఫండ్‌ హౌస్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్ హౌస్‌

Retail ( Indian/NRI/OCI)

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే మన లాంటి వ్యక్తులను రిటైల్ ఇన్వెస్టర్లు అంటారు. అయితే ఈ ఇన్వెస్టర్ల నివాస స్థానం అనుసరించి వీరిని మూడు కేటగిరీలుగా విభజించారు.

  1. రెసిడెంట్ ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు
  2. నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు (NRI)
  3. ఓవర్సిసీ సిటిజన్ ఆఫ్ ఇండియా రిటైల్ ఇన్వెస్టర్లు (OCI)

HNIs

రూ. 2 కోట్లను మించి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారిని లేదా ట్రేడింగ్ చేసే వారిని High Net worth Individuals (HNIs) అంటారు. # The key players in the stock market #

క్లియరింగ్ కార్పొరేషన్స్‌

భారతదేశంలో రెండు ప్రధాన క్లియరింగ్ కార్పొరేషన్లు ఉన్నాయి. అవి

  1. నేషనల్ సెక్యూరిటీ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (NSCCL)
  2. ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ICCL)

NSCCL అనేది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) యొక్క అనుబంధ సంస్థ.

ICCL అనేది బొంబే స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) యొక్క అనుబంధ సంస్థ.

ఇంతకీ ఈ క్లియరింగ్ కార్పొరేషన్లు ఏమి చేస్తాయి?

క్లియరింగ్ కార్పొరేషన్ల పని విధానం సులభంగా తెలుసుకునేందుకు ఈ కింది ఉదాహరణ చూద్దాం.

నందు xyz అనే కంపెనీకి చెందిన ఒక షేర్‌ను రూ.200లకు కొందామనుకున్నాడు. అదే సమయంలో పార్థు అదే కంపెనీకి చెందిన ఒక షేర్‌ను రూ.200 లకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. దీనితో నందు buy ఆర్డర్‌ పెట్టడం, పార్థు sell order పెట్టడం ద్వారా ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది.

అంటే ఇక్కడ నందు ట్రేడింగ్ అకౌంట్ నుంచి రూ.200 డెబిట్ అయ్యి, పార్థు అకౌంట్‌లో క్రెడిట్ అయ్యింది. అలాగే xyz షేర్‌ పార్థు డీమాట్ అకౌంట్‌ నుంచి డెబిట్ అయ్యి, నందు డీమాట్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇదంతా క్లియరింగ్ అండ్ సెటల్మెంట్ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. క్లియరింగ్ కార్పొరేషన్లు ఈ ప్రక్రియనంతా పూర్తి చేస్తాయి.

క్లియరింగ్ కార్పొరేషన్ల ముఖ్య ప్రాథమిక విధులు:

  • ఒక స్టాక్‌ కొనుగోలు చేసేందుకు buyers ఖాతాలో సరిపడేంత ఫండ్స్ ఉన్నాయా? లేదా? చూస్తాయి. అదే సమయంలో seller ఖాతాలో విక్రయించడానికి ఉద్దేశించిన స్టాక్స్ ఉన్నాయా? లేదా? అని క్లియరింగ్ కార్పొరేషన్లు చెక్ చేసి నిర్ధరణ చేస్తాయి. ఫలితంగా డిఫాల్ట్‌లను సమర్థవంతంగా నిరోధించడానికి వీలవుతుంది.
  • అలాగే చెల్లించిన ఫండ్స్, అసెట్స్ సజావుగా సరైన ఖాతాకు బదిలీ చేయబడేలా చూస్తాయి.

బ్యాంకులు

స్టాక్‌ మార్కెట్ లావాదేవీల్లో బ్యాంకుల పాత్ర చాలా కీలకమైనది. ఇందు కోసం మీరు మీ డీమాట్, ట్రేడింగ్ అకౌంట్‌లను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

స్టాక్స్ కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకున్నప్పుడు, మీ బ్యాంకు ఖాతాలోని నిధులు మీ ట్రేడింగ్ అకౌంట్‌లోకి బదిలీ చేయబడతాయి. ఫలితంగా మీరు సజావుగా స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరుపుకోవడానికి వీలవుతుంది.

హెచ్చరిక: ఎవరో చెప్పారని, స్టాక్‌ మార్కెట్ బేసిక్స్‌పై సరైన అవగాహన లేకుండా, పెట్టుబడులు పెడితే మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్వయంగా మీకు స్టాక్ మార్కెట్‌ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. అలాగే పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.

PREVIOUS CHAPTER: Whar is SEBI? సెబీ అంటే ఏమిటి? 

CLICK HERE: Basics of the Stock market for beginners

CLICK HERE: HOW TO INVEST IN STOCK MARKET?

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?