తెలుగు సాహిత్యం

siva arjuna war

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?

అర్జునుడు… తిరుగులేని పోరాట యోధుడు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి వారిని ఓడించిన మహాయోధుడు. సమస్త ధనుర్వేదం తెలిసిన సవ్యసాచి. మరి అలాంటి వీరుడు ఒకరి చేతిలో ఓడిన విషయం చాలా మందికి తెలియదు. ఎంతటి వీరుడికైనా గర్వం తలకెక్కితే ఓటమి తప్పదు అంటారు. మానవమాత్రులకే అంత ఉన్నప్పుడు.. సకల జగత్తును కాపాడే దేవాదిదేవుడికి ఎంత ఉండాలి. లోకంలో నన్ను మించిన విలుకాడు లేడు అనుకున్న అర్జునుడికి అదే […]

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా? Read More »

srikrishna

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?

శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా? సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే. నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా  శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా? Read More »

abhimanyu

అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

గెలుపు.. ఏదైనా సాధించాలనే ఉత్సాహాన్నిస్తే, ఓటమి.. హేళన చేస్తుంది. కానీ ఓటమికి తెలియదు. మనిషి తలచుకుంటే గెలుపు పెద్ద లెక్క కాదని. “ఇలాంటి మాటలు చాలా విన్నాం.. చేయడమే కష్టం” అంటారా? అయితే ఈ 16 ఏళ్ల యువకుడి కథ తెలుసుకుందాం రండి.. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ # ఇతను లేకుండా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని చెప్పలేం. అది మరెవరో కాదు అర్జునుడి కుమారుడు ‘అభిమన్యుడు’. పద్మవ్యూహం… ఒక రోజు గర్భవతిగా ఉన్న భార్య

అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ Read More »

waiting for love

వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా…

పెదవి దాటని మాట విభేదాలు కూడా ఇద్దరిని దగ్గర చేస్తాయనడానికి మన పరిచయమే ఉదాహరణ అనుకుంటాను. మొదటి పరిచయమే ఇద్దరి మధ్య భగ్గుమనేంత వైరం. కానీ మాటల్లో మాత్రం తేనె పూసిన కత్తిలా సుతి మెత్తని పలకరింపులు. తలచుకుంటేనే గమ్మత్తుగా ఉంది కదూ… రానియ్యి చూసుకుంటా… # వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… # ” మీ ఊరి పంచాయతీలో ఆడిట్ కోసం ఓఅబ్బాయిని వేశారంట… చూడడానికి బాగానే ఉన్నాడు గానీ.. మహా చండ శాసనుడంట.

వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… Read More »

indian marriage

పెళ్లి అంటే…

పెళ్లంటే ఒక పవిత్రమైన బాధ్యత! యువతీ యువకులంతా అలాగే భావించాలి. ఎందుకంటే అనాగరిక సమాజం నుంచి మానవుడు పరిపక్వత పొంది ఈ సమాజాన్ని నిర్మించుకున్నాడు. తన స్వేచ్చకు తానే హద్దులు ఏర్పాటుచేసుకున్నాడు. వాటిలో ప్రధానమైనది ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఈ సంప్రదాయమే మానవ మనుగడకు అత్యంత కీలకం. దీన్నే ఆచారంగా చేసుకున్నాడు. తాను పాటించిన విధానాన్నే భావితరాలకు అందించాడు. # పెళ్లి అంటే # వివాహంపై గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ చోటుచేసుకోవు. వధూవరులు

పెళ్లి అంటే… Read More »

సుమతీ శతకం

బద్దెన సుమతీ శతకము

సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము # పద్యం: అక్కరకు రానిచుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ!   తాత్పర్యం: అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి.

బద్దెన సుమతీ శతకము Read More »

second chance love story

సెకెండ్ ఛాన్స్‌

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. సాధారణంగా జీవితంలో రెండో ఛాన్స్ రాదని.. ఒకసారి కోల్పోయింది మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అని అంటారు. నాకు ఆ సెకెండ్ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నుంచి కారు బయటకు తీస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న నర్సరీలు… “గుడ్ మార్నింగ్‌….” అంటూ పలకరించాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, పువ్వులు… “ఎక్కడికి వెళ్తున్నావోయ్…?” అంటూ ప్రశ్నించాయ్. చిరునవ్వే నా సమాధానమైంది. # సెకెండ్ ఛాన్స్‌ # కడియం నుంచి రాజమండ్రి

సెకెండ్ ఛాన్స్‌ Read More »

grandma love

మా అమ్మమ్మ

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ # ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ

మా అమ్మమ్మ Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?