నీ స్నేహం… ఓ మధుర ఙ్ఞాపకం
కన్నుల ముందు వెన్నెలలా…
వసంతాన కోయిలలా…
అమ్మ చూపే జాబిలిలా…
నీ స్నేహం…ఓ కమ్మని కావ్యం
సందె పొద్దు సూరీడులా…
సముద్రంలో కెరటంలా…
పసిపాప చిరునవ్వులా…
నీ స్నేహం…ఓ చల్లని సాయత్రం
నా మనసులో మాటలా…
ఎప్పటికీ నిలిచే తోడులా…
నిను వీడని నీడలా…
నీ స్నేహం…ఓ తియ్యని వరం
నీ కోపానికి కారణంలా…
నిను బుజ్జగించే మాటలా…
నీ మంచి కోరే నీవాడిలా…
నీ స్నేహం…ఓ మరపురాని మధుర ఙ్ఞాపకం
– యుగ (కె. ఎం.కె)
Click here: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?
Click here: ఇక 15 నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!