Investment psychology

Investment psychology

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న, చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ, తప్పనిసరిగా Investment Psychology గురించి తెలుసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకొని, సంపదను సృష్టించుకోగలుగుతారు. # Investment psychology #

మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని బలమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వాటిని అనుసరించే కొన్ని Bias (పక్షపాత వైఖరులు) కూడా ఉంటాయి. వాస్తవానికి ఈ Bias మనకే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.

Investment Bias:

సాధారణంగా మనం మన స్వంత అభిప్రాయాలను  చాలా బలంగా నమ్ముతూ ఉంటాం. వాస్తవానికి మన అభిప్రాయాలు irrationalగా ఉన్నప్పటికీ, వాటిని మార్చుకోవడానికి ఇష్టపడం. వాస్తవాలు (Facts) మరియు సాక్ష్యాలు (Evidence) కళ్ల ముందు కనిపిస్తున్నా, వాటిని అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోదు. మన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ విషయాన్నీ మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉండం. ఇదే మన Human Psychology. మొత్తానికి ఇలాంటి సైకాలజీ వల్లనే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుని, భారీగా నష్టపోతూ ఉంటాం. # Investment psychology #

మనలో ఉన్న bias ఏమిటో, అవి ఎన్ని రకాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Two big types of Bias

ఒక మంచి ఇన్వెస్టర్‌ రెండు ముఖ్యమైన Bias విడిచిపెడతాడు. అవి:

  1. Cognitive Bias
  2. Emotional Bias

ప్రధానంగా ఈ రెండింటిని కంట్రోల్‌ చేయడం ద్వారా ఇన్వెస్టర్ మంచి సంపదను సృష్టించుకోగలుగుతాడు.

మనల్ని మనమే మోసం చేసుకుంటాం!

మనం ఇన్వెస్ట్‌ చేసే ముందు మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. దానికి కారణం మన సైకాలజీ. మనం వాస్తవమైన డేటాను చూస్తూ కూడా మన నమ్మకాలను వదిలిపెట్టలేక, ఎమోషనల్‌ డెసిషన్స్‌ తీసుకుంటూ ఉంటాం. # Investment psychology #

Cognitive Bias:

మనం కొన్ని established concepts ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. వాస్తవానికి అవి కచ్చితంగా పనిచేస్తాయా? లేదా? అన్నది ఆలోచించం. దీనినే cognitive bias అంటారు.

ఉదాహరణ: మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక దొంగ, పోలీసు దుస్తులు ధరించి చెక్‌పోస్ట్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్న పోలీసులు కూడా అతన్ని పోలీసుగానే భావించి, వదిలేస్తూ ఉంటారు.

ఇక్కడ పోలీస్ యూనిఫాంను పోలీసులే వేసుకుంటారు అనే ఫిక్సిడ్‌ అభిప్రాయమే కొంపముంచింది. దీనినే cognitive bias అంటారు. # Investment psychology #

Confirmation Bias:

మార్కెట్‌లో మనకు చాలా (Information) సమాచారం అందుబాటులో ఉంటుంది. కానీ మనం మన అభిప్రాయాలను బలపరిచే సమాచారాన్ని మాత్రమే నమ్ముతాం. ఏదైనా information మన అభిప్రాయాలకు భిన్నంగా ఉంటే, దానిని మనం నమ్మడానికి మనస్ఫూర్తిగా అంగీకరించలేం. వాస్తవానికి దానిని మనం ignore చేస్తాం. దీనినే Confirmation Bias అంటారు.

“మార్పు”ను అంగీకరించం:

మానవులు మార్పును అంత సులభంగా అంగీకరించరు. పాతది విడిచిపెట్టడానికి మన మనస్సు ఒప్పుకోదు. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణ: మన పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్‌ లేదా ETFలు ఉన్నాయనుకుందాం. వాటిలోని ఒక పర్టిక్యులర్‌ స్టాక్‌ సరిగ్గా perform చేయడం లేదు అనుకుందాం. అయినా దానిని మనం వదిలించుకోము. మళ్లీ దానిపై ఫండమెంటల్‌, టెక్నికల్‌ రీసెర్చ్‌ చేయాలనుకోము. ఎందుకంటే మనం ఎంచుకున్న స్టాక్‌ చాలా మంచిది అని గట్టి నమ్మకం కలిగి ఉంటాం. దానిని మార్చడానికి ఏ మాత్రం ఇష్టపడం. # Investment psychology #

Beneficial Effect:

సాధారణంగా మనలో చాలా మంది ఎలాంటి రీసెర్చ్ చేయకుండా, గుంపులో గోవింద అంటూ, పదిమంది ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే, అందులోనే ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు. దీనినే బెనిఫీషియల్‌ ఎఫెక్ట్‌ అంటారు. కానీ ఇది సరైన విధానం కాదు.

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ ఈ బెనిఫీషియల్‌ ఎఫెక్ట్‌ తప్పు అని నిరూపించారు. సరైన రీసెర్చ్‌ చేసి, ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చని ఆయన నిరూపించి చూపించారు. # Investment psychology #

Emotional Bias:

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగాలు ఉంటాయి. ఇవి ఇన్వెస్ట్‌మెంట్‌ డిసిషెన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి.

Cognitive biasను కొంత వరకు మనం అదుపు చేసుకోగలుగుతాం. కానీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం అనేది అంత సులభం కాదు.

అయితే emotional bias అనేది మరేమంత చెడ్డది కాదు. ఇది చాలా సార్లు మంచినే చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన తండ్రిలానే సైనికుడు అవ్వాలని, దేశానికి సేవ చేయాలను తపించవచ్చు. ఆ భావోద్వేగంతోనే చాలా కృషి చేసి, సైనికుడు అవ్వవచ్చు. ఇది మంచిదేగా.

ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో మాత్రం, emotional biasను కచ్చితంగా అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది.

Loss prevention bias:

మీ పోర్ట్‌ఫోలియోలోని ఒక స్టాక్‌ విలువ పడిపోతున్నప్పటికీ మీరు దానిని అమ్మడానికి సిద్ధంగా ఉండరు. ఎప్పటికైనా అది మంచి లాభాలను ఇస్తుందని భ్రమపడుతూ ఉంటారు. దీనినే loss prevention bias అంటారు. దీని వల్ల మీరు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు.

Endowment Bias:

ఇది anti-loss bias లాంటిదే. ఈ endowment bias ఉన్నవారు తాము హోల్డ్‌ చేస్తున్న స్టాక్‌ చాలా మంచి వాల్యూ ఉన్న స్టాక్ అని భావిస్తూ ఉంటారు. తమ దగ్గర ఏ స్టాక్స్‌ అయితే ఉండవో, “వాటికి అంత విలువ లేదు” అని కూడా అనుకుంటూ ఉంటారు.

తాను హోల్డ్ చేస్తున్న స్టాక్‌ నష్టాల్లో ఉన్నప్పటికీ, దానిని అమ్మరు. అదే సెక్టార్‌లో మంచి లాభాలతో మరో స్టాక్‌ దూసుకెళ్తున్నా కూడా దానిని కొనరు. # Investment psychology #

Overconfidence:

కొంత మందికి overconfidence చాలా ఎక్కువగా ఉంటుంది. తమ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ చాలా కచ్చితమైనదని వారు నమ్ముతూ ఉంటారు. అలాగే తమకున్న సమాచారంతో స్టాక్‌ మార్కెట్‌లో అద్భుతమైన లాభాలు సాధిస్తామని భావిస్తూ ఉంటారు. # Investment psychology #

టైమ్‌ బాగుంటే ఓకే. ఒక వేళ రివర్స్‌ అయితే…..!!!

Reduce Regrets:

సాధారణంగా మనం మనఃస్ఫూర్తిగా Regret అవ్వడానికి ఇష్టపడం. మనమే కరెక్ట్‌ అనుకుంటూ ఉంటాం. అలాగే నష్టపోవడానికి కూడా ఇష్టపడం. వాస్తవానికి మనం నష్టపోతున్నా, నష్టపోతున్న విషయాన్ని కూడా నమ్మడానికి ఇష్టపడం.

Limited attention span:

స్టాక్‌ మార్కెట్‌లో వేలాది స్టాక్స్ ఉంటాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్‌గా ప్రతి ఒక్క స్టాక్‌పైన రీసెర్చ్ చేయడం మన వల్ల కాదు. అందుకే financial media, ముఖ్యంగా న్యూస్‌ పేపర్స్, మ్యాగజైన్స్‌, వెబ్‌సైట్స్‌లో బాగా హైలైట్‌ అయిన స్టాక్స్‌ను కొనుక్కొంటూ ఉంటాం.

Tendency to follow:

సాధారణంగా ఇది మనందరిలో ఉంటుంది. సూపర్ సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్టర్లను మనం ఫాలో అవుతుంటూ ఉంటాం.

అలాగే మనకు ఒక సక్సెస్‌ఫుల్‌ ప్యాటర్న్ (patterns) దొరికింది అనుకోండి. ఇక దానినే మనం ఫాలో అవుతూ ఉంటాం. # Investment psychology #

ఇలా ఎన్నో రకాల bias మనలో ఉంటాయి. వాటిని మనం consciousగా లేదా unconscious కలిగి ఉంటామన్నది నిజం. కానీ మనం కాస్త స్మార్ట్‌గా ఆలోచించి, ఈ biasని వదులుకోగలిగితే, స్టాక్‌ మార్కెట్‌లో సంపద సృష్టించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇదీ చదవండి: మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా?

ఇదీ చదవండి: పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?