మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?

how to secure your stocks?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm.

ఈ ఆర్టికల్‌లో ఓ మదుపరిగా మనం మన స్టాక్స్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

ఇంతకీ మీరు కొనుకున్న షేర్లు భద్రంగా ఉన్నాయా? అదేంటి మా demat accountలో షేర్లు అన్నీ ఉన్నాయి కదా! అనుకుంటున్నారా? అవును అవి సరిగ్గానే ఉండి ఉంటాయి. కానీ కొన్ని సార్లు మీ షేర్ల భద్రత అనేది ప్రశ్నార్థకం అవుతుంది.

ఎలా అంటారా? మీకు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కుంభకోణం గుర్తుంది కదా!

ఆ కుంభకోణం తరువాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE)… మదుపరులు తమ షేర్లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో చెబుతూ కొన్ని కీలక సూచనలు చేసింది.

నిజానికి మనం ఇలాంటి పాత విషయాలను కొంత కాలం తరువాత మర్చిపోతూ ఉంటాం. కానీ మదుపరులుగా మనం వీటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే మనం షేర్ల రూపంలో దాచుకున్నది మన కష్టార్జితం కనుక.

మదుపరులు తమ షేర్లను, డబ్బును స్టాక్ బ్రోకర్ల వద్ద ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో చెబుతూ NSE చేసిన సూచనలు:

  • కొనుగోలు చేసిన స్టాక్స్‌ అదే విధంగా స్టాక్స్ అమ్మివేయగా వచ్చిన డబ్బు… T+2 రోజుల్లోగా మన ఖాతాలో జమ అయ్యాయో లేదో చూసుకోవాలి.
  • నిజానికి SEBI, ఎక్స్ఛేంజిల ప్రకారం పవర్ ఆఫ్ అటార్నీ తప్పనిసరి కాదు.
  • ఒక వేళ మీరు స్టాక్ బ్రోకర్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలనుకుంటే… ఇచ్చే ముందు స్టాక్ బ్రోకర్‌కు దఖలుపరిచిన అధికారాలు ఏమిటో తప్పనిసరిగా చూసుకోవాలి. అలాగే ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఎంత కాలం చెల్లుబాటు అవుతుందో తెలుసుకోవాలి.
  • మీకో విషయం తెలుసా…. పవర్ ఆఫ్ అటార్నీకి బదులుగా డిపాజిటరీల నుంచి ఈజీయెస్ట్‌ లేదా స్పీడ్‌-ఈ లాంటి వాటి ద్వారా కూడా సెక్యూరిటీలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
  • ట్రేడ్ జరిగిన 24 గంటల్లో కాంట్రాక్ట్‌ నోట్‌ వచ్చిందా లేదా చూసుకోవాలి. అలాగే స్టేట్‌మెంట్ ఆఫ్‌ అకౌంట్‌ను ప్రతీ త్రైమాసికానికి పొందేటట్లు చూసుకోవాలి.
  • మీ సెక్యూరిటీలనుగానీ, మీ సొమ్మును గానీ స్టాక్ బ్రోకర్‌ వద్ద వృధాగా ఉంచవద్దు.
  • మరీ ముఖ్యంగా మార్జిన్ కోసం మీరు ఇచ్చే సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తనఖా పెట్టకుండా చూసుకోండి.
  • ఒక వేళ మీరు రన్నింగ్ అకౌంట్‌ను ఎంచుకుంటే కనుక, మీ స్టాక్ బ్రోకర్‌ మీ అకౌంట్‌ను క్రమానుగతంగా సెటిల్ చేసేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితిల్లోనూ ఇది 90 రోజులు మించకుండా చూసుకోవాలి.
  • క్రమం తప్పకుండా మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును, స్టాక్ బ్రోకర్‌ ఇచ్చే Demat statementను పరిశీలిస్తూ ఉండాలి. ఏమైనా తేడాలు, పొరపాట్లు గమనిస్తే వెంటనే స్టాక్ బ్రోకర్‌ను సంప్రదించి వాటిని సరిదిద్దేలా చూసుకోవాలి.
  • స్టాక్ ఎక్స్ఛేంజిల నుంచి నెలవారీగా వచ్చే సెక్యూరిటీ బ్యాలెన్స్, ఫండ్ బ్యాలెన్స్‌ మెసేజ్‌లను చూస్తుండాలి. ఏమైనా తేడాలు ఉంటే, వెంటనే సంబంధిత సంస్థకు తెలియపరిచి, సరిదిద్దేలా చూసుకోవాలి.
  • కచ్చితంగా మీ సెల్‌ నంబర్, ఈ మెయిల్‌ను స్టాక్ బ్రోకర్ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే వాటిని అప్‌డేట్ చేయాలి. ఫలితంగా మీ అన్ని లావాదేవాల సందేశాలను సమయానికి అందుకోవచ్చు.
  • ఒక వేళ మీరు చేసిన లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు మీకు రాకపోతే, కచ్చితంగా స్టాక్‌ బ్రోకర్‌ లేదా ఎక్స్ఛేంజిలకు ఫిర్యాదు చేయవచ్చు.
  • మరీ ముఖ్యంగా మీ Demat accountలోగానీ, స్టేట్‌మెంట్‌లో గానీ ఏవైనా పొరపాట్లు గమనిస్తే, వెంటనే స్టాక్ బ్రోకర్‌కు తెలియపరచాలి. ఒక వేళ అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే, ఆలస్యం చేయకుండా ఎక్స్ఛేంజిలకు గానీ, డిపాజిటరీకి గానీ ఫిర్యాదు చేయాలి.

NSE చేసినఈ సూచనలను కచ్చితంగా గుర్తుంచుకోండి. అప్పుడు మాత్రమే మీ స్టాక్స్‌ను భద్రంగా చూసుకోగలుగుతారు.

Click here: stock market trading – Do’s and Don’ts

Click here: మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?