స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలి?
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే, ముందుగా మీకు ఓ ట్రేడింగ్ అకౌంట్, Demat అకౌంట్ ఉండాలి. వీటికి మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను కూడా అనుసంధానం (లింక్) చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే అమ్మినవారి ఖాతాలో ‘డబ్బులు’, కొన్నవారి ఖాతాలో ‘షేర్లు’ సజావుగా జమ అవుతాయి. ప్రస్తుతం చాలా బ్రోకింగ్ సంస్థలు 3-in-1 అకౌంట్ సౌకర్యం కల్పిస్తున్నాయి. # HOW TO INVEST IN STOCK MARKET? # masterfm#
NOTE: Demat అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఒకటి కాదు. ఆ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.
What is Trading Account?
ఇన్వెస్టర్లు స్టాక్ ఎక్స్ఛేంజిలో రిజిస్టర్ అయిన ఏదైనా Broking firm వద్ద ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ ట్రేడింగ్ అకౌంట్ ద్వారానే స్టాక్ మార్కెట్లో అందుబాటులో ఉన్న షేర్లను, ఇతర ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్‌ను కొనడానికి, అమ్మడానికి వీలవుతుంది.
Why you need a Demat Account?
Demat అకౌంట్ ఎందుకు ఉండాలి?
ఒకప్పుడు షేర్ల క్రయవిక్రయాలు జరిపేటప్పుడు ‘ఫిజికల్ షేర్ సర్టిఫికేట్’లు ఇచ్చేవారు. ఆ షేర్ సర్టిఫికేట్ buyerకి చేరే సరికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుుడు ఆ సమస్య లేదు. మీరు మీ షేర్లను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపరుచుకోవచ్చు. ఇందుకోసమే మీకు Demat అకౌంట్ తప్పనిసరి.
గమనిక:
- లిస్టెడ్ కంపెనీ సెక్యూరిటీల లావాదేవీల కోసం Demat ఖాతాను SEBI తప్పనిసరి చేసింది.
- అందువల్ల Demat అకౌంట్ లేకుండా మీరు స్టాక్స్ కొనలేరు లేదా అమ్మలేరు.
- అంటే Demat ఖాతా లేకుండా ఈక్విటీలో నేరుగా పెట్టుబడులు పెట్టలేరు.
ఇంతకీ Demat అకౌంట్ అంటే ఏమిటి?
‘Dematerialised Account’నే సింపుల్‌గా ‘Demat అకౌంట్’ అంటారు. దీనిలోనే మీరు కొన్న షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్-ట్రేడెట్ ఫండ్స్ (ETFs), సెక్యూరిటీలు మొదలైనవి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రంగా ఉంటాయి.
ఒక వేళ ఈ షేర్లను, సెక్యూరిటీలను మీరు విక్రయిస్తే, అవి మీ Demat అకౌంట్ నుంచి Debit అవుతాయి.
హెచ్చరిక:
ఎవరో చెప్పారని, స్టాక్ మార్కెట్ బేసిక్స్‌పై సరైన అవగాహన లేకుండా, పెట్టుబడులు పెడితే మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్వయంగా మీకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. అలాగే పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
NEXT CHAPTER: WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?
PREVIOUS CHAPTER: WHAT IS SHARE/ STOCK MARKET?