ఆధునిక యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంతో అవసరం. దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాలు లీక్ చేస్తున్నాయని ఇటీవలి కాలంలో అనేక appsపై వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో Go SMS Pro చేరింది.
స్మార్ట్ఫోన్లో default గా ఉండే మెసేజింగ్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇందుకోసం Google Play storeలోని అనే మెసేజింగ్ appsను డౌన్లోడ్ చేసుకుంటారు. అదే విధంగా Go SMS Proకు 100మిలియన్ డౌన్లోడ్స్ వచ్చాయి.
అయితే తాజాగా ఈ appకు సంబంధించిన ఓ రిపోర్ట్ బయటకువచ్చింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం Go SMS Pro ద్వారా లీక్ అవుతున్నట్టు తేలింది. ప్రైవేట్ ఫొటోలు, మెసేజ్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు.. ఇలా అన్నీ లీక్ అయిపోతున్నట్టు తెలిసింది. దీంతో Google Play Store ఆ appను తొలిగించింది.
Go SMS Pro ద్వారా పంపించే links, sequential orderలో ఉన్నాయని, లింక్స్ జెనరేట్ చేసే వాళ్లు ఎవరైనా వాటిని సులభంగా పసిగట్టేయవచ్చని ఆ రిపోర్ట్ పేర్కొంది. తద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటపెట్టొచ్చని స్పష్టం చేసింది.
Go SMS Proలో ఫైల్స్, ఫొట్స్, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎదుటి వ్యక్తి వద్ద ఈ app లేకపోతే, సాధారణ SMS ద్వారా ఓ లింక్ను పంపవచ్చు. దాన్ని క్లిక్ చేస్తే బ్రౌజర్లో ఫైల్స్ ఓపెన్ అవుతాయి.
ఈ వ్యవహారంపై Go SMS Pro సంస్థ స్పందించలేదు.
– VISWA (WRITER)
Click here: Netflix బంపర్ ఆఫర్
Click here: పులి – బాటసారి కథ