ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్‌ వర్సెస్‌ డిస్కౌంట్‌ బ్రోకర్‌

full-service broker versus discount broker

హాయ్‌ ఫ్రెండ్స్! Welcome to masterfm.

ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్ మార్కెట్‌లోని ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్లకు, డిస్కౌంట్ బ్రోకర్లకు మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు కావాల్సిన Demat account, trading account సేవలను అందించే వాటిని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంటారు. ఇవి వినియోగదారులకు పలు సేవలు అందిస్తుంటాయి. వాటిలో కొన్ని సాధారణ, కొన్ని ప్రత్యేక సేవలు కూడా ఉంటాయి.

మీకో విషయం తెలుసా? 2010 కంటే ముందు కేవలం రెగ్యులర్ (ఫుల్‌ సర్వీస్‌) స్టాక్ బ్రోకర్లు మాత్రమే ఉండేవారు. ఆన్‌లైన్‌లో సేవలందించే డిస్కౌంట్ బ్రోకర్లు అప్పటికి లేరు.  కానీ తరువాత టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా  ఫుల్‌ సర్వీస్‌ బ్రోకింగ్ సంస్థలతో పోటీపడేంతగా డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు దూసుకొచ్చాయి.

డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు

డిస్కౌంట్ బ్రోకర్లను ఆన్‌లైన్ బ్రోకర్లు అని కూడా పిలుస్తారు. ఈ డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు అందించే సేవలు చాలా పరిమితంగా ఉంటాయి. అలాగే వారు వసూలు చేసే రుసుములు కూడా సాధారణంగా తక్కువగానే ఉంటాయి. అందుకే సాధారణ ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకింగ్ సంస్థలు

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకింగ్ సంస్థలు… పలు బ్రాంచీలు, సిబ్బందిని కలిగి ఉంటాయి. ఈ సంస్థలు సాధారణ సేవలతో పాటు, ప్రత్యేక సేవలు కూడా అందిస్తుంటాయి.

స్టాక్ బ్రోకర్లు అందించే సేవలు
  • Demat, trading accounts తెరవడం
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ట్రేడింగ్‌కు అవకాశం కల్పించడం చేస్తాయి.
  • అలాగే ఫోన్ ద్వారా కూడా ట్రేడింగ్ చేసే అవకాశం కల్పిస్తాయి.
ప్రత్యేక సేవలు

పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌, ప్రత్యేక ఆర్థిక సేవలు అందిస్తాయి. లీవరేజ్ అందిస్తాయి.

లీవరేజ్‌: ట్రేడర్లకు.. వారి వద్ద ఉన్న డబ్బు కంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కొనుగోలు చేసేందుకు ఈ బ్రోకింగ్ సంస్థలు అవకాశం కల్పిస్తాయి. దీనినే లీవరేజ్‌ అంటారు. అయితే ఈ లీవరేజ్ అనేది ఆయా బ్రోకింగ్ సంస్థలను బట్టి మారుతుంటుంది.

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకింగ్ సంస్థలు వర్సెస్ డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు

అంశంఫుల్‌ సర్వీస్‌ బ్రోకింగ్ సంస్థలు అందించే సేవలుడిస్కౌంట్ బ్రోకర్లు అందించే సేవలు
పెట్టుబడి సాధనాలువివిధ రకాల financial instruments అందుబాటులో ఉంటాయిపెట్టుబడి సాధనాలు పరిమితంగా ఉంటాయి.
రీసెర్చ్ఇన్వెస్టర్లకు రీసెర్చ్ డేటా, షేర్ల సిఫారసులు అందిస్తాయి.రీసెర్చ్‌, షేర్ల సిఫారసులు లాంటివి ఏమీ అందించవు.
ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్, ట్రేడింగ్ టూల్స్ ఉంటాయి. వీటి ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తారు.ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. కానీ ట్రేడింగ్ టూల్స్ ద్వారా ప్రత్యేక సేవలు అందించడం లాంటివి ఉండవు.
బ్రోకరేజ్ రుసుముబ్రోకరేజ్ రుసుము ఎక్కువగా ఉంటుంది. అయితే ఆయా సంస్థలను అనుసరించి ఈ రుసుము మారుతూ ఉంటుంది.బ్రోకరేజ్ రుసుము తక్కువగా ఉంటుంది.
రిలేషన్‌షిప్‌ మేనేజర్ సేవలుఈ రిలేషన్‌షిప్ మేనేజర్ల ద్వారా సంస్థలు తమ క్లయింట్లకు ప్రత్యేక సేవలు అందిస్తుంటాయి.ప్రత్యేక సేవలు అందించడం అంటూ ఏమీ ఉండదు.
లీవరేజ్మదుపరులకు లీవరేజ్ కల్పిస్తాయి.సాధారణంగా లీవరేజ్ కల్పించవు. కల్పించినా అది చాలా తక్కువగా ఉంటుంది.
ప్రీమియం సేవలుక్లయింట్లకు పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్, ప్రత్యేక ఆర్థిక సేవలు కల్పిస్తాయి.పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌, ప్రత్యేక ఆర్థిక సేవలు కల్పించవు.

 ప్రస్తుతం డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు అతి తక్కువ బ్రోకరేజీ రుసుమును వసూలు చేస్తూ రెగ్యులర్ (ఫుల్‌ సర్వీస్‌) బ్రోకింగ్ సంస్థలకు సవాల్ విసురుతున్నాయి.

గమనిక: బ్రోకింగ్ సంస్థలు కనీస బ్రోకరేజ్ రుసుము విధించాలన్న ప్రతిపాదనను SEBI తోసిపుచ్చింది. అయితే గరిష్ఠ రుసుము మాత్రం 2.5 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది.

కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించేవారు రెగ్యులర్ (ఫుల్‌ సర్వీస్‌) బ్రోకర్ల వద్ద తమ Demat & trading account తెరవడం మంచిది. ఎందుకంటే ఈ ఫుల్‌ సర్వీస్‌ బ్రోకింగ్ సంస్థలు… తమ క్లయింట్లకు స్టాక్ మార్కెట్‌ పరిశోధన ఫలితాలను, మంచి షేర్లను గురించి సూచనలను, సలహాలను అందిస్తాయి. ఒక ఇన్వెస్టర్‌గా మీ లక్ష్యాలు, అవసరాలకు అనుగుణంగా మంచి స్టాక్ బ్రోకర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

Click here: IPO అంటే ఏమిటి?

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?