Different types of markets

different types of financial markets

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం వివిధ రకాల‌ మార్కెట్ల గురించి తెలుసుకుందాం.

ఫైనాన్షియల్ మార్కెట్‌

ఫైనాన్షియల్ మార్కెట్లో… స్టాక్స్‌, డెరివేటివ్స్, బాండ్స్‌ మొదలగువాటి క్రయవిక్రయాలు జరుగుతాయి.  virtual లేదా physical spaceలో ఈ Financial assets ట్రేడ్ జరుగుతుంది.

Debt market

డెట్‌ మార్కెట్‌లో… బాండ్స్‌, డిబెంచర్స్‌ లాంటి debt instruments ట్రేడ్ అవుతాయి. సాధారణంగా ఈ బాండ్స్‌ను, డిబెంచర్స్‌ను… కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేస్తాయి.

ఈక్విటీ మార్కెట్‌

ఈక్విటీ మార్కెట్‌లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్‌ ట్రేడవుతాయి. ఈ మార్కెట్‌లో మీరు ఇంట్రాడే, డెలివరీ ట్రేడ్స్ చేయవచ్చు. అలాగే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్‌ (IPOs)లోనూ, Follow on Public Offers (FPOs)లోనూ పార్టిసిపేట్ చేయవచ్చు.

Money market

మనీ మార్కెట్‌లో ట్రెజరీ బిల్స్ (treasury bills), కమర్షియల్ పేపర్స్‌, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్‌ లాంటి monetary assetsను కొనుగోలు చేయవచ్చు. అయితే మనీ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడులు ఒక సంవత్సరం మించి కొనసాగించలేము.

Capital market

క్యాపిటల్‌ మార్కెట్‌ను ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్‌లుగా విభజించవచ్చు. ఈ క్యాపిటల్ మార్కెట్‌లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌ లాంటి అసెట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే వాటిని దీర్ఘకాలం పాటు hold చేయవచ్చు.

Cash market

క్యాష్ మార్కెట్‌లో real-time basisలో transactions సెటిల్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ అసెట్స్‌ను నగదు కోసం అమ్మివేసి, వాటిని తక్షణమే బయ్యర్‌కి డెలివరీ చేస్తారు.

Futures market

ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ట్రాన్సాక్షన్ సమయంలోనే మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అసెట్ డెలివరీ మాత్రం… మరో తేదీన (later date) జరుగుతుంది. (ఫ్యూచర్స్ మార్కెట్ గురించి వచ్చే ఆర్టికల్స్‌లో మరింత వివరంగా తెలుసుకుందాం.)

Exchange-traded market

ఎక్స్ఛేంజి-ట్రేడెడ్ మార్కెట్ అనేది కేంద్రీకృత మార్కెట్‌. ఇది ప్రామాణిక విధానాల ప్రకారం నడుస్తుంది. ఈ మార్కెట్‌లో ఎక్స్ఛేంజిల ద్వారా ఫైనాన్షియల్ అసెట్స‌్ క్రయవిక్రయాలు జరుగుతాయి.

Over the counter market

ఇవి (decentralized markets) వికేంద్రీకృత మార్కెట్లు. ఈ మార్కెట్లలో buyers మరియు sellers పరస్పరం interact కావచ్చు. అలాగే తమ తమ అవసరాలకు అనుగుణంగా customized productsను కొనుగోలు చేయడం కానీ, అమ్మడంగానీ చేస్తారు. ఈ ట్రాన్సాక్షన్స్‌లో ఎలాంటి మధ్యవర్తుల జోక్యం ఉండదు. లావాదేవీలు కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతాయి.

Click here: Bull Market, Bear Market అంటే ఏమిటి?

Click here: మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?