IPO, NFO మధ్య తేడా ఏమిటి?

difference between IPO and NFO?

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఈ ఆర్టికల్‌లో Initial public offering (IPO), A New Fund Offer (NFO) మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.

IPO మరియు NFOలు రెండూ ప్రైమరీ మార్కెట్ ఆఫర్లు. ఇవి చూడడానికి ఒకే రకమైన పెట్టుబడుల మాదిరిగా కనిపించినా, వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది.

సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే… కంపెనీలు తొలిసారి షేర్లు జారీ చేసి, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడాన్ని IPO అనవచ్చు. మ్యూచువల్ ఫండ్‌ స్కీమ్‌లో కొత్తగా ప్రారంభించిన ఫండ్ ఆఫర్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని NFO అంటారు.

IPO మరియు NFO మధ్య ప్రధానమైన తేడాలు:

కంపెనీలు IPO ప్రకటించే ముందు చాలా విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. కీలక  అనుమతులు పొందాల్సి ఉంటుంది. IPO విషయంలో సంబంధిత కంపెనీకి చెందిన పూర్తి వివరాలు ముందుగానే పెట్టుబడిదారులకు ముందే అందుబాటులో ఉంటాయి. కనుక పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అని ముందుగానే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

NFO విషయంలో ఇలా జరగదు. గతంలో ఆ మ్యూచువల్ ఫండ్‌ స్కీమ్‌ performance గురించి అంచనా వేయడానికి ఏమీ ఉండదు. ఆ సంబంధిత ఫండ్‌ మేనేజర్‌ నిర్వహించిన ఇతర పథకాల తీరును, NFOని అందించే ఫండ్‌ హౌస్‌ ఆధారంగా మాత్రమే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

IPOలో ధరల శ్రేణి ముఖ్యపాత్ర వహిస్తుంది. షేర్లను ప్రీమియంతో అందిస్తున్నారా? లేదా? అలాగే డిస్కౌంట్‌ ఏమైనా అందిస్తున్నారా? లాంటి అంశాలను పెట్టుబడిదారులు చూసుకోగలుగుతారు. అలాగే ఆ సంస్థ భవిష్యత్ వృద్ధి అవకాశాలను కూడా అంచనా వేసుకోగలుగుతారు.

NFOలో ముఖ విలువ ఆధారంగా యూనిట్లు కేటాయిస్తారు. దీనితో పథకం ప్రస్తుత విలువ అనేది సూచించబడదు. పెట్టుబడిదారులు NFO సభ్యత్వం పొందిన తరువాత ఆ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ యొక్క పోర్ట్‌ఫోలియో లభిస్తుంది.

అలాగే IPO తరువాత సంబంధిత షేర్లు… సెకెండరీ మార్కెట్‌లో పెట్టుబడిదారుల ఆసక్తి మేరకు ట్రేడవుతాయి.

అదే NFO తరువాత స్కీమ్ యొక్క నికర విలువ (NAV) పోర్ట్‌ఫోలియోలో ఉన్న సెక్యూరిటీల ప్రస్తుత మార్కెట్ విలువను ప్రతిబింబిస్తుంది.

ఇన్వెస్టర్లుగా మనం ఏమి చేయాలి?

ఓ IPOలో పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థ గురించి fundamental, technical analysis చేయండి. కచ్చితంగా మీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి. ఆ తరువాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

NFO విషయానికి వస్తే, అదే రకమైన స్కీమ్‌ల NAV కంటే తక్కువ ముఖ విలువతో యూనిట్లు లభిస్తున్నాయనే కారణంతో వాటిని ఎంపిక చేసుకోకూడదు. ఇది సరైన నిర్ణయం కాదు. ఫండ్ మేనేజర్ల పూర్వపు పనితీరును, ఫండ్ హౌస్ పనితీరును సరిగ్గా అంచనా వేసుకోండి. అప్పుడు మాత్రమే కాస్త సేఫ్‌ జోన్‌లో ఉంటారు.

Click here: IPO అంటే ఏమిటి?

Click here: Bull Market, Bear Market అంటే ఏమిటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?