Indian History – In Telugu

History Notes for Compitative exams and Govt Jobs. Like UPSC, APPSC, TSPSC, JL, DL and teacher jobs. And it is useful for UGC NET, State Eligibilty Tests.

మౌర్యానంతర యుగము- యవనులు నుండి కుషాణుల వరకు భారత చరిత్ర (Part-1)

మౌర్యానంతర యుగము/ గుప్తుల పూర్వయుగము (క్రీ.పూ.200 – క్రీ.శ.300) క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 మధ్య గల కాలం భారతదేశ చరిత్రలో అత్యంత విశిష్టమైనది. ఇది రెండు మహా సామ్రాజ్యాలైన మౌర్యసామ్రాజ్యము మరియు గుప్తసామ్రాజ్యాల మధ్య ఉన్న యుగము. రాజకీయ రంగంలో అనైక్యత మరియు అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ రాజకీయేతర రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిన కాలమిది. రాజకీయ చరిత్ర మౌర్యానంతర యుగంలో భారతదేశంలో అనేక విదేశీ మరియు స్వదేశీ రాజ్యాలు అవతరించాయి. ఫలితంగా  దేశంలో రాజకీయ అనైక్యత రాజ్యమేలింది. […]

మౌర్యానంతర యుగము- యవనులు నుండి కుషాణుల వరకు భారత చరిత్ర (Part-1) Read More »

చంద్రగుప్తుడు నుండి అశోకుని వరకు – మౌర్యుల పరిపాలన రహస్యాలు (Part-3)

మౌర్యుల పరిపాలన విధానము   భారతదేశంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృతమైన మరియు సమర్థవంతమైన పరిపాలన మౌర్యుల కాలంలో కనిపిస్తుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రము, మెగస్తనీస్ వ్రాసిన ఇండికా మరియు అశోకుని శాసనాల ద్వారా వీరి పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు. కేంద్రీకృత పాలన (centralised administration) మౌర్యులు అత్యంత కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సర్వాధికారాలు చక్రవర్తి ఆధీనంలో ఉండేవి. చక్రవర్తి అత్యున్నత శాసనాధికారి, కార్యనిర్వాహణాధికారి మరియు న్యాయాధికారి. అనేక రంగాలపైన ప్రభుత్వ నియంత్రణ కొనసాగింది. గనులు -ఖనిజాలు,

చంద్రగుప్తుడు నుండి అశోకుని వరకు – మౌర్యుల పరిపాలన రహస్యాలు (Part-3) Read More »

చంద్రగుప్తుని విజయాలు – అశోకుని ధర్మయాత్రలు (Part-2)

మౌర్యుల రాజకీయ చరిత్ర   చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.321 – 297) చంద్రగుప్త మౌర్యుడు వాయువ్య భారతదేశంపై దండెత్తి అలెగ్జాండర్ నియమించిన గవర్నర్లను అంతం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో సెల్యూకస్ నికేటర్‌తో ఘర్షణ ప్రారంభమైంది. సెల్యూకస్ నికెటర్‌ను ఓడించి చంద్రగుప్తమౌర్యుడు అతని కుమార్తె హెలెనాను వివాహము చేసుకొన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన సంధి ప్రకారం సెల్యూకస్ నికేటర్ పరోపనిసద్ (కాబుల్), అరకోసియ (కాందహార్), గెడ్రొసియ (బెలుచిస్థాన్) మరియు అరియ (హీరట్) లాంటి వాయువ్య ప్రాంతాలను

చంద్రగుప్తుని విజయాలు – అశోకుని ధర్మయాత్రలు (Part-2) Read More »

మౌర్య సామ్రాజ్యం చరిత్ర- పరిపాలన, వారసత్వం (Part-1)

మౌర్య సామ్రాజ్యము భారతదేశ చరిత్రలో వెలసిన తొలి మహాసామ్రాజ్యము. మౌర్యులు భారతదేశాన్నే కాక సమస్త భారత ఉపఖండమును పాలించారు. హర్యంక, శిశునాగ మరియు నందుల కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ మౌర్యుల కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకొంది. #Mauryan Empire# (నోట్‌: మగధ అనేది సామ్రాజ్యం పేరు కాగా, మౌర్య అనేది వంశము పేరు). సామ్రాజ్య విస్తీర్ణము మౌర్య సామ్రాజ్యము పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు మరియు తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. ఉత్తరాన కాశ్మీర్ నుంచి

మౌర్య సామ్రాజ్యం చరిత్ర- పరిపాలన, వారసత్వం (Part-1) Read More »

క్రీ.పూ.6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావం: మకరిగోసాల & అజీత కేశకంబలి జీవితం, దార్శనిక తత్త్వాలు

అజీవిక మతం క్రీ.శ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన అవైదిక మతాల్లో అజీవిక మతం ఒకటి. మకరిగోసాలపుత్త ఈ మత స్థాపకుడు. ఇతను వర్ధమాన మహావీరుడి సహచరుడు. ఇరువురు ఆరేళ్ళపాటు కలిసి జీవించి తర్వాత విభేదాలతో విడిపోయారు. అజీవిక మతము ‘నియతి’ (తలరాత/ destiny) సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. మౌర్యుల తర్వాత క్రీ.పూ.2వ శతాబ్దంలో ఈ మతం అంతరించింది. #Makkaligosa – Life and Philosophy# ఛార్వాక/లోకాయుత క్రీ.పూ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన అవైదిక ఉద్యమాల్లో చార్వాక మతం ఒకటి. దీనిని

క్రీ.పూ.6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావం: మకరిగోసాల & అజీత కేశకంబలి జీవితం, దార్శనిక తత్త్వాలు Read More »

మహావీరుని జీవితం: జైనమతం బోధనలు మరియు ఆధ్యాత్మిక మార్గం

జైనమతం   జైనమతంలో 24 మంది తీర్థంకరులున్నారు. తీర్థంకర అంటే వంతెన నిర్మించువాడు (ford maker) అని అర్థం. మొదటి తీర్థంకరుడు: ఋషభనాథ/ ఆదినాథ ఇతని చిహ్నం ఎద్దు/ వృషభము. సాంప్రదాయం ప్రకారం ఇతనినే జైనమత స్థాపకుడని అంటారు. 22వ తీర్థంకరుడు: ఆరిస్టనేమి/ నేమినాథ ఇతని చిహ్నం శంఖం (conch shell). మొదటి 22 మంది తీర్థంకరులు ఇతిహాస పురుషులు. వీరికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక సమాచారము అందుబాటులో లేదు. 23 మరియు 24వ తీర్థంకరులు మాత్రమే

మహావీరుని జీవితం: జైనమతం బోధనలు మరియు ఆధ్యాత్మిక మార్గం Read More »

బుద్ధుని జీవితంలోని 5 కీలక మలుపులు: ఎలా ఒక రాజ కుమారుడు ప్రపంచాన్ని మార్చాడు?

భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావము   క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక నూతన మతాలు ఆవిర్భవించాయి. ఇరాన్‌లో జొరాస్ట్రియన్ మతం, చైనాలో కన్ఫూషియస్‌ మరియు టావోయిజం, జపాన్‌లో షింటోయిజం మరియు భారతదేశంలో బౌద్ధ, జైన, అజీవిక మొదలైన నూతన మతాలు ఆవిర్భవించాయి. భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో 62 అవైదిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలన్నీ అనాటి సాంప్రదాయ బ్రాహ్మణ ఆధిపత్య సమాజాన్ని, జంతుబలులు మరియు యజ్ఞయాగాలతో కూడిన వైదిక మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటిలో బౌద్ధం, జైనం

బుద్ధుని జీవితంలోని 5 కీలక మలుపులు: ఎలా ఒక రాజ కుమారుడు ప్రపంచాన్ని మార్చాడు? Read More »

భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర

మగధ చక్రవర్తులు భారతదేశంలోని ఇతర జనపదాలను  జయిస్తున్న కాలంలో వాయువ్య భారతదేశంపై (గాంధార రాజ్యం) విదేశీ దాడులు జరిగి, క్రమంగా ఆ ప్రాంతం విదేశీ పాలనలోకి వెళ్ళిపోయింది. ముందుగా పర్షియన్లు, ఆ తరువాత గ్రీకులు గాంధార ప్రాంతాన్ని జయించి పాలించారు. I. పర్షియన్/ ఇరానియన్‌ ఆక్రమణలు క్రీ.పూ.6 మరియు క్రీ.పూ.5 శతాబ్దాల్లో ఇరాన్ పాలకులు వాయువ్య భారతదేశంపైకి దండెత్తి వచ్చారు. సైరస్ అనే ఇరాన్ చక్రవర్తి వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు జయించగా, అతని మనవడైన డేరియస్-I

భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర Read More »

మహాజనపదాలు, మగధ వంశం – మౌర్యులకు ముందు భారత చరిత్ర!

క్రీ.పూ.600-300 మధ్య ఉన్న మౌర్యుల పూర్వ యుగాన్ని బుద్ధుని యుగమని మరియు షోడష మహాజనపదాల యుగమని కూడా అంటారు. ఈ కాలానికి గౌతమ బుద్ధుడు యుగపురుషుడు కాబట్టి దీనిని బుద్ధుని యుగమని, ఈ కాలంలోనే 16 గొప్ప రాజ్యాలు అవతరించడము వలన షోడష మహాజనపదాల యుగమని చరిత్రకారులు అభివర్ణించారు. షోడష మహాజనపదాలు పాళీ భాషలో వ్రాయబడిన అంగుత్తరనికయ అనే బౌద్ధ గ్రంథము షోడష మహాజనపదాలు అనబడే 16 రాజ్యాల యొక్క సమాచారాన్ని ఇస్తుంది. వీటిలో పది రాజ్యాలు

మహాజనపదాలు, మగధ వంశం – మౌర్యులకు ముందు భారత చరిత్ర! Read More »

ఆర్యుల రహస్యాలు: వైదిక నాగరికత విశేషాలు (Part-2)

భారతదేశంలో ఒక మహా నాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. వీరి సాహిత్యంలో వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వాటిలో కొన్ని అభిప్రాయాలను పరిశీలిద్దాం. అవినాష్ చంద్రదాస్, డా. సంపూర్ణానంద్, గంగానాథ్‌ ఝా మరియు డి.యస్.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల ప్రాంతము. ఇది ప్రధానంగా

ఆర్యుల రహస్యాలు: వైదిక నాగరికత విశేషాలు (Part-2) Read More »

error: Content is protected !!