మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? సరైన సమాచారం కోసం వెదుకుతున్నారా? అయితే మీరు సరైన చోటే ఉన్నారు. Masterfm.in మీకు మంచి మార్గదర్శిగా ఉంటుంది. ”Basics of the Stock market for beginners/ స్టాక్ మార్కెట్ ప్రాథమిక అంశాలు” కచ్చితంగా తెలుసుకోండి.
Why invest in the stock market/ share market?
స్టాక్ మార్కెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారమని చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. సరైన షేర్లలో, లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వారికి మంచి లాభాలు వస్తాయి. నిజానికి బంగారం, రియల్ ఎస్టేట్‌ల్లో పెట్టుబడుల కన్నా, దీర్ఘకాలంలో stock market/ share marketలోనే అధిక లాభాలు వస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా చాలా మంది షార్ట్ టెర్మ్ స్ట్రాటజీలు( స్వల్పకాలిక వ్యూహాలు) ఉపయోగించి షేర్ మార్కెట్‌లో లాభాలు సంపాదించాలని ఆశిస్తుంటారు. అయితే స్వల్ప కాలంలో షేర్ మార్కెట్లో అస్థిరత, ఒడుదొడుకులు సహజం. అందువల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ. అయితే దీర్ఘకాలంలో మాత్రం మంచి లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమగ్ర అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే “Basics of the Stock market for beginners/ స్టాక్ మార్కెట్ ప్రాథమిక అంశాలు తెలుసుకోవడం” తప్పనిసరి.
Stock market/ Share market అద్వితీయ ప్రస్థానం
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు స్టాక్ బ్రోకర్లు మర్రిచెట్టు కింద నిల్చొని షేర్ల క్రయవిక్రయాలు జరిపేవారు. ఇది మంచి లాభదాయకంగా ఉండడంతో క్రమేణా స్టాక్ బ్రోకర్లు, పెట్టుబడిదారులు అమాంతంగా పెరిగిపోయారు. దీనితో తగినంత స్థలం లేక వీరంతా పలుచోట్ల గుమిగూడి, బహిరంగా షేర్ల క్రయవిక్రయాలు జరుపుతుండేవారు. చివరికి 1854లో వీరంతా అప్పటి బొంబాయి (నేటి ముంబయి)లోని దలాల్ స్ట్రీట్‌కు పర్మినెంట్‌గా మకాం మార్చారు.
భారతదేశంలోని మొట్టమొదటి స్టాక్ ఎక్స్ఛేంజి – ‘బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE)’. ఇది భారత స్టాక్‌మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్స్ దృక్పథాన్ని కొలిచే parametersల్లో BSE SENSEX ఒకటిగా ఉంది.
NOTE:
- 1875: The native share and stock Brokers Associationని బొంబాయిలోని దలాల్ స్ట్రీట్‌లో ఏర్పాటుచేశారు. ఇదే నేటి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE).
- 1956: Securities Contract Act కింద గుర్తించబడిన మొదటి స్టాక్ ఎక్స్ఛేంజిగా BSE గుర్తించబడింది.
- 1993: NSE ఒక స్టాక్ ఎక్స్ఛేంజిగా గుర్తించబడింది.
- 2000: NSE ఇంటర్నెట్ ట్రేడింగ్‌ని ప్రారంభించింది.
- 2000: NSE డెరివేటివ్స్ ట్రేడింగ్ కూడా ప్రారంభించింది. (Index futures)
- 2001: BSE కూడా డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
చాలా ఏళ్లపాటు BSE, NSEలు బహిరంగంలా షేర్ల క్రయవిక్రయాలు నిర్వహించినా, చివరికి ‘ఆటోమేటెడ్ ట్రేడింగ్ ఎన్విరాన్‌మెంట్’కు మారాయి. ఈ అద్వితీయ ప్రస్థానం భారతీయ స్టాక్‌మార్కెట్ (Indian stock market)కు ఉన్న బలమైన చరిత్రను మనకు తెలియజేస్తుంది.
Do you want to enter the stock market/ share market?
స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారా?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ముందుగా కొన్ని ప్రాథమిక అంశాలు (fundamentals) తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి లాభాలు సంపాందించే అవకాశం ఉంటుంది. నిజానికి stock market fundamentals అర్థం చేసుకోలేనంత సంక్లిష్టమైనవేమీ కాదు. చాలా సులువుగానే వీటిని అవగాహన చేసుకోవచ్చు.
హెచ్చరిక: ఎవరో చెప్పారని, స్టాక్ మార్కెట్ బేసిక్స్‌పై సరైన అవగాహన లేకుండా, stock market/ share marketలో పెట్టుబడులు పెడితే మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్వయంగా మీకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. అలాగే పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
NEXT CHAPTER : What is share market? షేర్ మార్కెట్ అంటే ఏమిటి?