క్రిప్టో కరెన్సీ, నాన్-ఫంగబుల్ టోకెన్స్ (NFTs), డిజిటల్ గోల్డ్ లాంటి న్యూ జనరేషన్ అసెట్ క్లాసెస్‌పై, ఎవ్వరూ ఎలాంటి రికమండేషన్లు చేయకూడదని SEBI కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నిర్దిష్ట సంస్థ నియంత్రణలో లేని ఇలాంటి అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా ప్రమాదమని హెచ్చరించింది. #Cryptocurrency Recommendations are Illegal #
తప్పుడు రికమండేషన్స్
కొంత మంది రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్… క్రిప్టో కరెన్సీ, డిజిటల్ గోల్డ్, NFTలను పెట్టుబడిదారులకు రికమండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సెబీ పేర్కొంది. అయితే ఇది చట్టవిరుద్ధమని, వీటి క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
క్రిప్రో కరెన్సీ ట్రేడింగ్ చేసినా, రికమండేషన్స్ ఇచ్చినా, SEBI act 1992 కింద నేరంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకుంటామని సెబీ హెచ్చరించింది.
ఇన్వెస్టర్స్ తస్మాత్త్ జాగ్రత్త
ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్, NFTs మరియు బిట్ కాయిన్ లాంటి క్రిప్రో కరెన్సీల ట్రేడింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు వేలంవెర్రిగా వీటి ట్రేడింగ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇండియాలో వీటి ట్రేడింగ్ దాదాపు 640 శాతం పెరగడం విశేషం. ఇది ఎంతో ప్రమాదం మరియు ఆందోళన కలిగించే విషయం. అందుకే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సెబీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. # Cryptocurrency Recommendations are Illegal #
ఇదీ చదవండి: డొల్ల కంపెనీలు అంటే ఏమిటి?
ఇదీ చదవండి: What is SEBI?