వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు

warreb buffett investment strategy

స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వారందరికీ ఆదర్శం వారెన్ బఫెట్‌. ఆయన అనుసరించిన వ్యూహాలు… చెప్పిన సూత్రాలు… మనం కూడా పాటిస్తే, కచ్చితంగా విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారేందుకు అవకాశం ఉంటుంది.

స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అయితే తీవ్ర ఆటుపోట్లు, ఒడుదొడుకులు ఉండే ఈ స్టాక్ మార్కెట్‌లో సరైన వ్యూహాలు అనుసరిస్తే, కచ్చితంగా సంపద సృష్టించవచ్చని నిరూపించారు వారెన్ బఫెట్‌. అందుకనే ఆయనను పెట్టుబడి మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి ఆయన చెప్పిన పెట్టుబడి సూత్రాలు గురించి మనమూ తెలుసుకుందామా?

సూత్రం 1:

“Rule No 1: Never lose money
Rule No 2: Never forget rule No.1.”
                             – Warren Buffett

దీని అర్థం ఏమిటంటే, ఒక పెట్టుబడిదారుడుగా మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అవి:

రూల్ నెంబర్‌ 1: మనం ఎన్నడూ సంపదను పోగొట్టుకోకూడదు.

రూల్ నెంబర్‌ 2: సంపదను పొగొట్టుకోకూడదనే రూల్‌ నెం.1ను ఎప్పుడూ మర్చిపోకూడదు.

సూత్రం 2:

“మనకు అవగాహన లేని వ్యాపారాల జోలికి పోకూడదు. కేవలం మీకు అవగాహన ఉన్న రంగాలనే ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పెట్టుబడిని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుస్తుంది. సంపదను కూడా సృష్టించగలుగుతారు” అని వారెన్ బఫెట్ సూచిస్తుంటారు.

సూత్రం 3:

మంచి పోటీతత్వంతో మెరుగైన పనితీరును కనబరిచే కంపెనీలు త్వరగా వృద్ధి చెందుతాయి. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల, మీరు పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీరు తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే సంస్థలు, లేదా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న బ్రాండ్ల కంపెనీలను గుర్తించి, వాటిలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

సూత్రం 4:

కొన్ని సందర్భల్లో మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని బఫెట్ సూచిస్తుంటారు.

సూత్రం 5:

అద్భుతమైన కంపెనీ యొక్క షేర్లను సమంజసమైన ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కానీ అంతగా పనితీరు కనపరచని కంపెనీ షేర్లను మాత్రం…. అవి ఎంత మంచి ధరకు లభించినా కొనుగోలు చేయకూడదని బఫెట్ సూచిస్తున్నారు.

సూత్రం 6:

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంది స్టాక్ మార్కెట్ అనాలసిస్ చేస్తుండడం గమనిస్తూ ఉన్నాం. నిజానికి వారికున్న క్వాలిఫికేషన్ గురించి మీరు ఎప్పుడైనా ఆరా తీసారా? కనీసం ఆలోచించారా? లేదుకదా వారికున్న పాపులారిటీని అనుసరించి, మనం కూడా వారిని అనుసరిస్తుంటాం. కానీ ఇది సరైన విధానం కాదు. సోషల్ మీడియాలో చెప్పేవారి సూచనలను గుడ్డిగా నమ్మకూడదు.

వారెన్ బఫెట్ ఏమి చెబుతారంటే, “స్టాక్ మార్కెట్‌ను కచ్చితంగా అంచనా వేయడం ఏ ఒక్కరి వల్లా కాదు. అందువల్ల మార్కెట్‌ను అంచనా వేయడం మానేయండి. వడ్డీరేట్లు, దేశ ఆర్థిక పరిస్థితులు, ఎన్నికలు మొదలైనవి… మార్కెట్‌పై చూపే ప్రభావం  గురించి కూడా ఆలోచించకండి. మీరు కేవలం కంపెనీకి సంబంధించిన ఆర్థిక విషయాలను, దాని భవిష్యత్‌ అంచనాలను, విలువలను విశ్లేషించండి. అవన్నీ అనుకూలంగా ఉంటేనే ఆ కంపెనీ షేర్లను కొనడం లేకుంటే అమ్మడం చేయండి.”

సూత్రం 7:

వారెన్ బఫెట్… పెట్టుబడుల విషయంలో over diversification వద్దు అని చెబుతుంటారు.

నష్టభయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా మీ పెట్టుబడిని diversification చేయడం మంచిదే. అయితే అది కేవలం 5 నుంచి 10 కంపెనీల షేర్ల వరకే పరిమితం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆయా కంపెనీ గురించి ట్రాక్ చేయడానికి, మరింతగా వాటిపై రీసెర్చ్ చేయడానికి వీలవుతుంది.

ఒక కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఆశించిన స్థాయిలో మనకు రాబడి వస్తుందని వారెన్ బఫెట్ చెబుతుంటారు.

సూత్రం 8:

“మీరు చెల్లించేది ధర… మీకు దక్కేది విలువ.”

సూత్రం 9:

ఒకవేళ మీరు పెట్టుబడిదారుడు అయితే… సంబంధిత కంపెనీలో ఏం జరుగుతుందో నిత్యం ట్రాక్ చేస్తూ ఉండాలి.

ఒక వేళ మీరు స్పెక్యులేటర్ అయితే… కంపెనీ షేరు ధర ఎలా ఉండబోతోంది అన్నదానిపై దృష్టి కేంద్రీకరించాలి.

సూత్రం 10:

బఫెట్ దృష్టిలో విజయవంతమైన పెట్టుబడిదారుడు అంటే… “మిగతావారు అంతా మార్కెట్‌లో చురుగ్గా పాల్గొంటూ ఉంటే కొంచం భయంగా ఉండేవాడు. అందరూ భయంతో దూరమవుతూ ఉంటే, ఉత్సాహంగా మార్కెట్‌లో పాల్పొనేవాడు.”

సూత్రం 11: ఎవరైతే సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటూ… తప్పుడు నిర్ణయాలను బాగా తగ్గించుకుంటారో… వారే సంపద సృష్టించగలుగుతారని వారెన్ బఫెట్ గట్టిగా నమ్ముతారు.

వారెన్ బఫెట్ చెప్పిన ఈ కీలక సూత్రాలతో పాటు ఎవరైతే వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి, ధైర్యంగా, ఓపికతో ఉంటారో వారు మాత్రమే పరిపూర్ణమైన పెట్టుబడిదారుడిగా ఎదగగలుగుతారు.

Click here: వారెన్‌ బఫెట్ ఇండికేటర్‌ గురించి మీకు తెలుసా?

Click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

 

 

 

 

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?