వావ్​: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..!

twitter

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించేందుకు సామాజిక మాధ్యమాలు తెగ ప్రయత్నిస్తుంటాయి. తాజాగా Twitter కూడా కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. మరి ట్విట్టర్ లాంచ్ చేసిన ఫీచర్సపై ఓ లుక్కేద్దామా..! # వావ్: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! #

TWITTER FLEET

Twitter విడుదల చేసిన కొత్త ఫీచర్సలో ఎక్కువ మాట్లాడుకుంటున్నది Fleet గురించే. ఇది Instagram ఫీచర్స్తో పోలి ఉంది. మన ట్విట్టర్ ఎకౌంట్ icon కింద ఈ Fleet ఉంటుంది. అయితే ట్వీట్స్లాగా ఇవి permanentగా ఉండవు. వీటిని షేర్ చేయలేము, లైక్ చేయలేము, కామెంట్ కూడా చేయలేము. కానీ Fleet పెట్టిన వారికి డైరక్ట్గా మెసేజ్(DM) చేయగలము. అయితే DM చేయాలంటే, వారిని మీరు, వారు మిమ్మల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్ ఎక్కువసేపు ఉండదు కాబట్టి.. ఆ సమయంలో మీ భావాలు, వెంటనే షేర్ చేస్కోవాలనిపించే ఫొటోలు పెట్టుకోవచ్చు.

TWITTER WARNING

Misinformation అని label చేసిన ట్వీట్లను లైక్ చేసే వారికి ఓ warning పంపిస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ఫలితంగా అలా తప్పుడు సమాచారం అందించే ట్వీట్లపై retweets, likes తగ్గుతాయని భావిస్తోంది. # వావ్: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! #

TWITTER TOPICS

కొద్ది రోజుల ముందు, భారతీయ వినియోగదారుల కోసం Twitter Topicsను తీసుకొచ్చింది ట్విట్టర్. యూజర్స్ తమకు ఇష్టమైనవి తొందరగా గుర్తించేందుకు, అవసరమైన వారిని సులభంగా వెతికి, వారితో interact అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా తమకు ఆసక్తి కలింగే అంశాలకు సంబంధించిన ట్వీట్లు, పోస్టులను యూజర్స్ పొందవచ్చు. ఇది హిందీ, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది.

AUDIO TWEETS

ఈ ఏడాదిలో ఆడియో ట్వీట్స్ను యూజర్స్కు అందుబాటులోకి తెచ్చింది twitter. దీని ద్వారా ఆడియో ట్వీట్స్ చేస్తున్నారు వినియోగదారులు. అయితే ఇది ఇప్పటికీ iOSలోనే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. # వావ్: Twitterలో ఇన్ని కొత్త ఫీచర్సా..! # 

                               – VISWA (WRITER)

click here: Paytm new EMI ఆఫ్షన్ చూశారా?

click here: నిన్ను కలిసే వరకు..

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?