Bull Market, Bear Market అంటే ఏమిటి?

bull market and bear market explained

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం తరచుగా వినే Bull Market, Bear Marketల గురించి తెలుసుకుందాం.

Bull Market (బుల్ మార్కెట్‌):

స్టాక్‌ మార్కెట్ గమనాన్ని సూచించే ప్రధాన సూచీలైన Sensex మరియు Niftyలు లాభాలతో దూసుకుపోతుంటే… దానిని బుల్ మార్కెట్ అంటారు.

బుల్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు… స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తాయని ఆశావాద దృక్పథంతో ఉండి, చాలా Bullishగా ఉంటారు. ఫలితంగా షేర్ల విలువ బాగా పెరుగుతుంది.

Bear Market (బేర్ మార్కెట్‌):

ప్రధాన సూచీలైన Sensex మరియు Niftyలు నష్టాల్లో కదలాడుతూ ఉంటే, దానిని బేర్ మార్కెట్ అంటారు. దీనితో ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టభయం వల్ల తమ షేర్లను అమ్మడానికి మొగ్గు చూపుతారు. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు Bearishగా ఉంటారు.

బేర్‌ మార్కెట్‌లో ఎక్కువ మంది షేర్లు అమ్మివేయడం వల్ల షేర్ల విలువలు చాలా వరకు తగ్గుతాయి.

Bull vs Bear

స్టాక్‌ మార్కెట్ ట్రెండ్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ బుల్‌, బేర్‌ అనే సంకేతాలను వాడతారు.

ప్రస్తుతం బుల్‌ మార్కెట్‌ని ఎద్దుతోనూ, బేర్ మార్కెట్‌ను ఎలుగుబంటితోనూ పోలుస్తున్నారు. దీని వెనుక ఓ కారణం ఉంది.

అది ఏంటంటే… సాధారణంగా ఎద్దులు తమ ప్రత్యర్థులను కొమ్ములతో పైకెత్తి విసిరేస్తాయి. దీనిని ఆధారంగా చేసుకునే… షేర్ల ధరలు బాగా పెరుగుతుండడాన్ని బుల్‌ మార్కెట్‌గా పేర్కొంటున్నారు. సంకేతంగా Bullను చూపిస్తున్నారు.

అలాగే ఎలుగుబంటి తన శత్రువులను పై నుంచి కిందకు పడేసి దెబ్బతీస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని… షేర్ల ధరలు బాగా పతనమవడాన్ని బేర్‌ మార్కెట్‌గా పేర్కొంటున్నారు. సంకేతంగా Bearను చూపిస్తున్నారు.

ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్టర్లలో ఎవరైతే స్టాక్‌ మార్కెట్… లాభాల బాటలో పయనిస్తుందనే ఆశాభావ దృక్పథంతో ఉంటారో… వారిని బుల్స్‌గా పేర్కొంటారు. అలాగే ఎవరైతే మార్కెట్ నష్టపోతుందని భావిస్తుంటారో వారిని బేర్స్ అంటారు.

నిజానికి స్టాక్‌ మార్కెట్‌లో ఎప్పుడూ బుల్స్‌కి బేర్స్‌కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. షేర్ల విలువ బాగా పెరిగి, మార్కెట్ లాభపడితే బుల్స్‌ గెలిచినట్లు… అలాగే షేర్ల విలువ బాగా పతనమై, మార్కెట్‌ నష్టపోతే బేర్స్ గెలిచినట్లు భావిస్తారు.

Click here: What is an index?

Click here: The key players in the stock market

 

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?