WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?

WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?

స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే ప్రధాన ఆర్థిక సాధనాలు ఏమిటి?

స్టాక్ మార్కెట్‌లో ప్రధానంగా నాలుగు ప్రధాన ఆర్థిక సాధనాలు (Financial instruments) ట్రేడవుతాయి. అవి:

  • బాండ్లు
  • షేర్లు
  • డెరివేటివ్స్
  • మ్యూచువల్ ఫండ్స్‌

# WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET? # masterfm#

BONDS (బాండ్స్‌) :

కంపెనీలు ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటే అందుకు చాలా ఆర్థిక వనరులు కావాలి.  ఇందుకోసం కంపెనీలు ఎంచుకునే ఓ మార్గమే ‘బాండ్స్’.

కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరిస్తాయి. అందుకు ప్రతిగా ఓ బాండ్ రాసి ఇస్తాయి. ఈ BONDలో face valueతో పాటు, రుణంగా తీసుకున్న డబ్బు, కూపన్ రేటు, కంపెనీ చెల్లించాల్సిన వడ్డీరేటు, మొత్తం డబ్బు తిరిగి చెల్లించేందుకు ఉన్న గడువు (మెచ్యూరిటీ తేదీ) ఇలా అన్ని వివరాలు ఉంటాయి. 

సులువుగా అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ చూద్దాం:

రవి ఓ కంపెనీ నడుపుతున్నాడు అనుకుందాం. అతను కొత్తగా ఓ ప్రాజెక్టు ప్రారంభిద్దాం అనుకున్నాడు. అందుకోసం తన స్నేహితుడైన శ్రీను దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్లలో తీరుస్తానని, అప్పటి వరకు ప్రతి ఏటా 5 శాతం చొప్పున్న వడ్డీ చెల్లిస్తానని రవి ఓ Receipt రాసి శ్రీనుకి ఇచ్చాడు. ఈ Receiptనే ‘బాండ్’ అనవచ్చు.

దీనినే కొంచెం రివర్స్‌లో అర్థం చేసుకుంటే… శ్రీను తన స్నేహితుని కంపెనీకి రుణం ఇవ్వడం ద్వారా ‘బాండు’ను కొనుగోలు చేశాడు అని స్పష్టం అవుతుంది.

మీరు కూడా మీ డబ్బుని కంపెనీలకు రుణంగా ఇచ్చి మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే, తప్పకుండా బాండ్స్‌ను ఓ పెట్టుబడి సాధనంగా వినియోగించుకోవచ్చు. వీటిలో కొన్ని పన్ను రహిత బాండ్లు కూడా ఉంటాయి. ఏదేమైన బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు మీ వ్యక్తిగత సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం చాలా ఉత్తమం.

SHARES (షేర్లు):

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అనేది డబ్బు సంపాదనకు మరో ముఖ్యమైన మార్గం.

ఉదాహరణకు శరత్‌ అనే వ్యక్తి ABC అనే కంపెనీకి చెందిన ఓ షేర్ కొన్నాడనుకుందాం. వెంటనే అతను ఆ కంపెనీలో ఓ shareholder అయిపోతాడు. అంటే ownership వస్తుంది. అతనికి ఓటింగ్ హక్కు* కూడా సంక్రమిస్తుంది.

ఇక్కడ కంపెనీకి మంచి లాభాలు వచ్చాయంటే, శరత్ కొన్న షేర్ విలువ పెరుగుతుంది. లేదా కంపెనీకి నష్టాలు వస్తే, ఆ షేర్ విలువ తగ్గుతుంది.

Mutual Funds (మ్యూచువల్ ఫండ్స్‌):

బాండ్స్‌లో, షేర్ మార్కెట్‌లో పరోక్షంగా ప్రవేశించేందుకు ఉపకరించే పెట్టుబడి సాధనమే మ్యూచువల్ ఫండ్స్‌. ఇందులో చాలా మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సేకరించి, ఆ భారీ మొత్తాన్ని పలు financial instrumentsలో పెట్టుబడిగా పెడతారు. ఈ మ్యూచువల్ ఫండ్‌ని అత్యంత అనుభవగ్యులైన, ప్రొఫిషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినవారికి SHARES ఏమీరావు. వారికి UNITS కేటాయించబడతాయి. వీటికి కూడా షేర్లలానే ఓ విలువ ఉంటుంది.

ఈ యూనిట్ల విలువ పెరిగినప్పుడు లేదా డివిడెండ్స్ పంపిణీ చేయబడినప్పుడు పెట్టుబడి పెట్టినవారికి డబ్బు (లాభం) చేకూరుతుంది.

Derivatives (డెరివేటివ్స్‌):

షేర్లు లాంటి financial instrumentsలో ఒడుదొడుకులు చాలా ఎక్కువ. అందువల్ల షేర్ల విలువ ఫిక్స్‌డ్‌గా ఇంత ఉంటుందని మనం చెప్పలేము. ఇలాంటి సందర్భంలో ‘డెరివేటివ్స్’ చాలా హ్యాండీగా ఉంటాయి.

అంటే మీరు ఈ రోజు నిర్ణయించే ధర వద్ద భవిష్యత్తులో వ్యాపారం చేయడానికి ఈ డెరివేటివ్స్ అవకాశం చేకూరుస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు ఒక నిర్దిష్ట స్థిర ధరకు షేర్లు లేదా ఇతర financial instruments కొనడానికి లేదా అమ్మడానికి ముందుగానే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు.

NEST CHAPTER: What is SEBI? What does the SEBI do?

PREVIOUS CHAPTER: HOW TO INVEST IN STOCK MARKET?

Start From Scratch: Basics of the stock market for beginners?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?