అజీవిక మతం
క్రీ.శ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన అవైదిక మతాల్లో అజీవిక మతం ఒకటి. మకరిగోసాలపుత్త ఈ మత స్థాపకుడు. ఇతను వర్ధమాన మహావీరుడి సహచరుడు. ఇరువురు ఆరేళ్ళపాటు కలిసి జీవించి తర్వాత విభేదాలతో విడిపోయారు. అజీవిక మతము ‘నియతి’ (తలరాత/ destiny) సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. మౌర్యుల తర్వాత క్రీ.పూ.2వ శతాబ్దంలో ఈ మతం అంతరించింది. #Makkaligosa – Life and Philosophy#
ఛార్వాక/లోకాయుత
క్రీ.పూ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన అవైదిక ఉద్యమాల్లో చార్వాక మతం ఒకటి. దీనిని అజీతకేశకంబలి స్థాపించారు. ఇది భౌతికవాదాన్ని మరియు నాస్తికవాదాన్ని బోధిస్తుంది. దేవుడిని, జన్మ-పునర్జన్మలను, మోక్షము మరియు స్వర్గం-నరకం లాంటి వాటిని ఛార్వాకులు తిరస్కరించారు. #Ajita Kesakambali – Life and Philosophy#
షడ్దర్శనాలు
సాంప్రదాయ వైదికమతము మరియు సాంప్రదాయేతర బౌద్ధ, జైన మతాల మధ్య తాత్విక చర్చల ఫలితంగా ప్రాచీన భారతదేశంలో ఆరు నూతన తత్వాలు (philosophies) ప్రారంభమయ్యాయి. వీటినే షడ్దర్శనాలు అంటారు. వీటికి సంబంధించిన సమాచారమును ఈ క్రింది పట్టికలో ఇవ్వడమైనది. #Six Classical Philosophies (Shaddarshanas)#
దర్శనము పేరు | స్థాపకుడు | ప్రాధాన్యత |
సాంఖ్య | కపిలుడు | నాస్తికవాద తత్త్వము బోధిస్తుంది. |
యోగ | పతంజలి | యోగాలోని అష్టాంగమార్గాలు పాటించడం ద్వారా మోక్షము సిద్ధిస్తుందని చెబుతుంది. అవి: 1. యమ, 2. నియమ, 3. ఆసనాలు,
4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యాన, 8. సమాధి. |
వైశేషిక | కణాదుడు | ఇది పరమాణు సిద్ధాంతాన్ని (Atom Theory) తెలియజేస్తుంది. |
న్యాయ | గౌతముడు | |
పూర్వమీమాంస | జైమిని | వేదాల ఆధిపత్యాన్ని అంగీకరిస్తుంది. |
ఉత్తరమీమాంస/ వేదాంత | బాదరాయణుడు | బాదరాయణుడు బ్రహ్మసూత్రాలు లేదా
వేదాంత సూత్రాలు అనే గ్రంథం వ్రాశాడు. |