స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్ నోటిఫికేషన్ #
ఖాళీల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. స్టెనోగ్రఫీలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు:
- గ్రూప్-సి పోస్టులకు 01-08-2020 నాటికి 30 ఏళ్లు దాటకూడదు.
- గ్రూప్-డి పోస్టులకు 01-08-2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
- ఫీజు: రూ.100
- దరఖాస్తు చేసే విధానం: దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే పంపించాలి.
- చివరి తేదీ: 4 నంబర్, 2020
SSC Stenographer పరీక్ష విధానం
ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో 3 విభాగాలు ఉంటాయి.
- జనరల్ ఇంటలిజెన్స్
- జనరల్ అవేర్‌నెస్
- జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్
ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
# స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్ నోటిఫికేషన్ #
మొత్తం ప్రశ్నలు: 200; మొత్తం మార్కులు: 200; సమయం: 2 గంటలు
0.25 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంది.
స్కిల్ టెస్ట్
స్టెనోగ్రాఫర్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంగ్లీష్/ హిందీ భాషల్లో 10 నిమిషాల డిక్టేషన్ ఇస్తారు.
గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిమిషానికి 80 పదాలు, గ్రూప్-సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాలు రాయాల్సి ఉంటుంది.
డిక్టేషన్‌ను టైప్ చేయడానికి గ్రూప్-డి ఇంగ్లీష్ అభ్యర్థులకు 50 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 65 నిమిషాల సమయం ఉంటుంది.
గ్రూప్-సి ఇంగ్లీష్ అభ్యర్థులకు 40 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 55 నిమిషాల సమయం ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
అభ్యర్థులు SSC రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అంతిమ సెలక్షన్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు.
పూర్తి వివరాలకు: https://ssc.nic.in/ ను చూడండి.
బ్యాంకు జాబ్స్: IBPS క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్