శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?

srikrishna

శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా?

సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే.

నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా  శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా కన్నీళ్లు పెట్టిన సందర్భం లేదు.

అలాగని ఆయన ఎక్కడైనా సుఖపడ్డాడా? లేదే అసలు శ్రీ కృష్ణుడి పడిన కష్టాలు తెలుసుకుంటే మనకే కన్నీళ్లు వస్తాయి.

దేవకీ వసుదేవులకు చెరశాలలో పుట్టాడు శ్రీ కృష్ణుడు.

పుట్టగానే మేనమామ కంసుడు చంపేందుకు ప్రయత్నించాడు.

తల్లిదండ్రులు చెరశాలలో ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి.

మహరాజు కుమారుడు అయి ఉండి గొల్లగూడెంలో పెరిగాడు.

అక్కడ కూడా ఆయన్ని బతకనివ్వకుండా 30 మంది రాక్షసులను పంపించాడు కంసుడు.

పోనీ పెరిగి పెద్దయ్యాక, పెళ్లిళ్లయ్యాక ఏమైనా సుఖంగా ఉన్నాడా? లేదే. పాండవుల కష్టాలన్నీ  ఆయన కష్టాలే.

krishnarujna

కనీసం కురుక్షేత్ర యుద్ధం అయ్యాక అయినా శ్రీ కృష్ణుడ్ని సుఖంగా ఉండనిచ్చారా? లేదు. చేయని నేరానికి శ్రీ కృష్ణుడ్ని  శపించింది గాంధారి.

పాండవ, కౌరవ సైన్యం కొట్టుకొని చనిపోతే యుద్ధం అనంతరం పాండవులతో సహా శ్రీ కృష్ణుడు గాంధారిని పలకరిద్దామని వెళ్లాడు.

“నువ్వే.. నువ్వే.. నువ్వు దేవుడై ఉండి యుద్ధాన్ని ఆపలేదు. నీ వంశం కూడా నా వంశం లాగే నాశనం అయిపోతుంది?” అని గాంధారి శపించింది.

అప్పుడు కూడా శ్రీ కృష్ణ పరామాత్ముడు కోప పడలేదు.

“తల్లి.. నువ్వు పతివ్రతవు. నువ్వు అంటే నిజమవుతుంది? నేను ఒప్పుకుంటున్నాను. పాండవులను ఏమనకు.. నేను అనుభవిస్తాను” అన్నాడు మహానుభావుడు.

అంతేగానీ ప్రతిశాపం ఇవ్వలేదు. శాపానికి నివారణ ఉపాయం కూడా అడగలేదు. తన వంశం తన కళ్ల ముందు నాశనమైపోవడాన్ని కూడా భరించిన వాడు ఈ లోకంలో శ్రీ కృష్ణుడు కాక మరెవ్వరు!

sri krishna 

మనిషి పడే బాధలు ఆయనకి కాక ఎవరికి తెలుసు? కన్నీళ్లకు ఉన్న విలువ ఆ మహానుభావుడికి కాక మరెవరికి తెలుసు? అందుకే శ్రీ కృష్ణుడ్ని నమ్మిన వారికి చెరగని చిరునవ్వును వరంగా ప్రసాదిస్తాడు ఆయన.

శ్రీ కృష్ణుడి లాంటి గొప్ప ప్రేమికుడు ఈ ప్రపంచంలోనే లేడు. ఆయనను వంటి గురువు లేడు. ఆయనను మించిన రథసారథి లేడు. ‘కన్నా’.. అని పిలిస్తే ఆయన కన్నా రక్షకుడు లేడు.

                                           “కృష్ణం వందే జగద్గురుమ్”

                                                                                               – యుగ (కె.ఎమ్.కె)

ఇదీ చూడండి: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

ఇదీ చూడండి: ఈ మాట అంచున నిశ్శబ్దం

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?