ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో, భక్తితో ఉండటానికి తనంత తాను విధించుకున్న నియమాల చేత ప్రవర్తిస్తే వేరొకరికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమస్యే ఒకసారి ఆదిశంకరాచార్యుల దగ్గరికి వచ్చింది. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్లి ఒకరు ఇలా అడిగారు. # దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం #
“మీరు భగవంతుడు ఉన్నాడు.. ఉన్నాడు.. అని చెప్తారు. మీరు ఇంత అందగాడు.. ఇంత సౌందర్యమూర్తి.. సన్యసించి.. ముండనం చేయించుకుని.. ఆ కాషాయ బట్ట కట్టుకొని.. సత్య దండం పట్టుకొని తిరుగుతున్నారు. ఇంత మిసమిసలాడిపోతున్నారు. ఒక వేళ భగవంతుడు లేకపోతే మీరు పొగొట్టుకున్న సుఖాలు పోగొట్టుకున్నట్లే కదా” అన్నారు.
దానికి శంకరులు ఇలా అన్నారు.
“అవును.. నువ్వు చెప్పింది యదార్థమే. ఒక వేళ దేవుడు అనే వాడు లేడనుకో.. లేకపోయినా నాకు ఇలా బట్ట కట్టుకోవడంలో.. ఇలా గుండు చేయించుకోవడంలో, ఇలా వస్త్రం వేసుకోవడంలో, ఇలా సత్య దండం పట్టుకోవడంలో, ఉపనిషత్తు చదువుకోవడంలో, ఇలా నడవడంలో నాకు ఒక గొప్ప తృప్తి ఉంది.
నీకు, భగవంతుడు లేడు అన్న నమ్మకంతో సంసారం నందు తృప్తి ఉంది. నువ్వు పొందుతోన్న తృప్తి అనేది నేను పొందుతున్నా ఇందులో. కానీ భగవంతుడు అనే వాడు ఉంటే.. శరీరం పడిపోయిన తర్వాత.. నీ బతుకేమిటో లెక్కపెట్టుకో” అన్నారు.
అందుకని దేవుడు ఉన్నాడా? లేడా? లాంటి వితండవాదం తగదు. ఇది ఇప్పటి ప్రశ్న కాదు. ఎప్పటి నుంచో ఉంది. కానీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అన్న నమ్మకం చేత పెద్దలు చెప్పారనే విశ్వాసంతో.. ఉన్నాడు ఈ కంటితో మేము చూశామని చెప్పిన ఋషుల యందు గౌరవం ఉంచి నియమములతో జీవితాన్ని గడుపుతున్నటువంటి జాతి భారత జాతి. # దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం #
దైవాన్ని నమ్మాలంటే ముందు నిన్న నువ్వు నమ్ము. సరిగా చూడగలిగితే ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు. రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఏంటో నిర్ణయించుకో.
– యుగ (కె.ఎమ్.కె)
ఇదీ చూడండి: మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?
ఇదీ చూడండి: The key players in the stock market